ఒకప్పుడు కిడ్కి
ఒక సుందర స్వప్నం
పడమట గాలి, పైర గాలి
పహారీ కాస్తుండేవి.
వసంత గానం,సుగంధ పరిమళం
నట్టింటిలో షికార్లు చేస్తుండేవి.
చాంద్ కీ తుక్డా
గోడకు కిడ్కి.
ఇప్పుడు,
కిడ్కి లెక్క కోసం
కిడ్కికి వేలాడే పరదా
మన సరదాలకు గురుతు
దర్పానికి నిలువుటద్దం
ఇప్పుడు కిడ్కిలు మూసుకున్నాయి
మన మనస్సుల్లా!
Excellent poem on window.Our hearts are closed like our windows.Now a days relations are sentiments