కవిత్వం

ఓ మూడు

డిసెంబర్ 2013

వెన్నెల హారతి

నదీ పాయల ఏకార్తె లో హారతి కర్పూరంలా మారిన
ఆ పున్నమి జాబిలి ప్రతిబింబాన్ని వెలిగించి
లోకానికి వెన్నెల హారతి పడుతున్నాయి నా చూపులు.

********

మౌనామృతం

గిట్టకుండానే, దేవుడిచ్చిన పుట్టుకలో
మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటాను నేను.
ఎందుకంటే మౌనమనే అమృతాన్ని అప్పుడప్పుడు
నా మనసుకు పట్టిస్తాను నేను.

********

మాతృభాష

ఒకచేత్తో బిడ్డకు ఉగ్గుపాలు పడుతూనే
ఇంకో చేత్తో తులసినీళ్ళు పడుతున్నారు
మాతృమూర్తులు, నా మాతృభాషకిపుడు.