కవిత్వం

వత్సర

జనవరి 2014

సంతోషాలన్నీ తన ఖాతాలోనే
ఖాళీలన్ని వొదిలేసి పరాయికే
వీడ్కోలు
గడపదాటకముందే
స్వాగతం గతాన్ని స్వగతంలా
కొత్తనాటికలో ప్రాంప్టింగ్ చెప్తున్నది

రా,రా పాత నేలమాళిగల్లో
పద్మనాభస్వాములున్నారేమో ఆశపడు
కొత్తగా భూమికి గర్భం వొచ్చిందేమో
ముహుర్తం నేటి అర్థరాత్రి శూన్యతిథిలో

వాడెవడో చెప్తే కలలన్ని మూటగట్టి
టోకున బజార్లో పడుతావా
పొద్దున్నే నీరెండలో నీడలు కొలుచుకునేదెట్లా
అప్పటి ఇసికపిట్టగూళ్ళ పాటలేరుకునేదెపుడు

నులితీగల్లా ఈ రాత్రినీలికేశాలను, క్లేశాలను
వేళ్ళకు చుట్టుకుంటూ సిగ్గుపడే వెలుగుల్ని
పారబోసి పొయ్యే ఎవరి అడుగుజాడలు మర్చిపోయావు
ఎంతలో మారిపోయావు నీకు తెలియనివి నాకూ తెలువొద్దా

మనం ముసిముసిగా నవ్వుకున్న ముచ్చట్లన్ని
అనగనగా ఒకనాటి కథలేనా
అవును ఇవాళ గుర్తున్నదా
ఇద్దరం ఒకే ద్వారం నుండి రెండు
కవితలమై ఎగిరిపోవాలని
వలసదేశానికి నువ్వు నేను,
అపరిచితులం చివరి అక్షరాత్మీయులం6 Responses to వత్సర

 1. January 1, 2014 at 10:46 am

  పరిచితమైన అక్షరాత్మీయత ఎగురుకుంటూ హత్తుకున్నట్లు,.. బాగుందండి,.

 2. January 3, 2014 at 10:36 pm

  మనం ముసిముసిగా నవ్వుకున్న ముచ్చట్లన్ని
  అనగనగా ఒకనాటి కథలేనా
  అవును ఇవాళ గుర్తున్నదా
  ఇద్దరం ఒకే ద్వారం నుండి రెండు
  కవితలమై ఎగిరిపోవాలని
  వలసదేశానికి నువ్వు నేను,
  అపరిచితులం చివరి అక్షరాత్మీయులం..ఆత్మీయంగా ఉంది.

 3. January 4, 2014 at 6:53 pm

  బాపూ ఇంట మంచికవిత మీరు తప్ప ఇంకెవరు రాస్తారు ! హరగోపాల్ గారూ “మనం ముసిముసిగా నవ్వుకున్న ముచ్చట్లన్ని
  అనగనగా ఒకనాటి కథలే” అన్నమాట నాకు మొన్న మొన్ననే చెప్పారు గుర్తుందా ? మీ స్నేహం పొందడం బాగుంది. కొత్త సంవత్సరం పూట మంచి కవిత

 4. chinnarivemuganti
  January 8, 2014 at 9:01 pm

  manchi kavitha rasindru haragopal gaaru

 5. Mangu Siva Ram Prasad
  January 10, 2014 at 10:57 pm

  “ఇద్దరం ఒకే ద్వారం నుండి రెండు
  కవితలమై ఎగిరిపోవాలని” స్వేచ్ఛను కాంక్షించే ఒక చక్కటి భావ చిత్రం.

 6. January 31, 2014 at 12:26 pm

  బాగుంది హరగోపాల్ గారు

మీ అభిప్రాయం రాయండి

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)