కవిత్వం

వాళ్ళ అమ్మలేం చేశారని?

జనవరి 2013

 

ఉరి తీయాలి ‘లంజా’కొడుకుల్ని…

ఏం పాపం?

వాళ్ళ అమ్మలేం చేశారని?

2

విలువలకు వలువలూడ్చి

టచ్ స్క్రీన్లపై,

ల్యాప్ టాప్లపై..

సన్నిలి’యోన్లు’ హెచ్.డి. వ్యూలో

నిరంతరం దర్శనమిస్తూంటే…

3

నిర్లజ్జగా ఆ నగ్నదేవతల్ని

నెత్తిన పెట్టుకొని పూజిస్తూన్న

జాతి దౌర్భాగ్యమిది!

 

నరనరాల్లోకీ ఈ విషాన్ని నింపుకొని

నెత్తికెక్కిన ఆ మత్తులో

క్రమం తప్పిన కౌమార్యపు క్రూరత్వమిది!!

4

న్యూటౌన్లోని మరతుపాకైనా..

న్యూఢిల్లీలోని మర్మాయవమైనా…

‘వివేకం’ కోల్పోతే జరిగేది నరమేధమే!

5

నీకూ.. నాకూ.. వాడికీ.. మధ్యా ఉన్నది నైతిక దూరమే!!