కవిత్వం

దారి తప్పాం

జనవరి 2013

తన తల్లి లోనే అమృత వర్షిణి ని
మమతల కోవెలను
అనురాగాల ఆలయాన్ని చూసి
పక్కింటి అమ్మలో
అవేవి చూడలేని ద్రుతరాష్ట్ర
సంతతి మనది
కాలేజీల్లో చిలిపి పనులేవైనా చేశావా?
అమ్మాయిల వెంట పడలేదా?
అయితే నీలో లోపం ఏంటి?
అని అడిగే కుసంస్కారుల మీడియా మనది
కళ్ళు మూసుకున్నాం
శరీరం కాలుతుంది
దారితప్పాం, తప్పించాం
ఫస్ట్ఎయిడ్ కాదు
అత్యవసర చికిత్స అవసరమిపుడు


మీ అభిప్రాయం రాయండి

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)