“ఆవ పెట్టిన ఆనపకాయ కూర, దోసకాయ పప్పు , పులుసు పెట్టమని చెప్పి వచ్చాను ” వెళ్ళాలి అంటూ లొట్టలేసుకుంటూ భోజనానికి బయలుదేరాడు మూర్తి. లంచ్ టైమ్ కావడంతో నాకూ ఆకలి దంచేస్తున్నా ఈ ఒక్క స్టేట్మెంట్ చదివి వెళదాం అని కూర్చున్నాను కుర్చీ కి అతుక్కుని మరీనూ.
అయినా ఈ మూర్తి ఏమిటీ ? రోజూ ఫలానా వంట చేయమని చెప్పి వచ్చాను అంటాడు, అదేమిటి ? తనకి తోచినదేదో వండే స్వాతంత్ర్యం కూడా మూర్తి భార్య కి లేదా ఏమిటి ?
నాకు అన్నీ వింత గానే తోస్తాయి.
రోజుకి ఒక ఆపిల్ తింటే వైద్యుని కి దూరం గా ఉండ వచ్చు అన్న సూక్తి నాకూ తెలుసు ,కానీ ఆ మాట పట్టుకుని ,రోజూ ఆపిల్ పండు తినమంటే విషం తినమన్నట్టు మొహం పెడతాను నేను ,నాకు ఆ ఫలం చూడగానే ,తినాలి అని కోరిక కలగాలి ,కొనాలి, తినాలి అంతే కానీ ,అలా కొని పడేసి ,రోజూ ఏదో మందు లా తినమంటే ,తినగలమా ?
మూర్తి అలా కాదు ,అతని ఆలోచన ఇలా ఉంటుంది ఏదో జబ్బు చేసి వైద్యుని దగ్గరకి వెళితే ,పరీక్షలు ,మందులు అంటూ ఎంత ఖర్చు పెట్టిస్తాడు ?మనం ముందే ఇలా ఖరీదైనా పళ్ళు ఫలాలు తింటూ ఉంటే మనం వైద్యుని వద్ద కి వెళ్ళే పరిస్థి తే రాదు కదా ? అంటాడు ..
ఇదేం ఆలోచన ? ఫలాలు ,ఏవో ఇష్టం గా తినాలి అనిపిస్తే ,కొనుక్కుంటాం ,తింటాం ,అంతే కానీ ,వెనక ఇంత ఆలోచనా ?
ఏమో ,నేనే తప్పు గా ఆలోచిస్తున్నాను ఏమో ?
నాదే కొంచం తిక్క వ్యవహారం అందరూ ఇలాగే ఆరోగ్యం కోసమే కదా పళ్ళు తినేది అంటూ నన్ను నేను తప్పు పట్టుకున్నాను ..
నాకు అంత ముందు ప్లానింగ్ అదీ ఉండదు వంట విషయం లో కూడా ,ఆ రోజు కి ఏది సులువుగా వండగలను అనిపిస్తే ,అప్పటికది ,వండేసి ,అయింది ,ఈ రోజు కి వంట అనిపిస్తాను .. భాస్కర్ కూడా ,ఏది వడ్డిస్తే కంచం లో అదే మహా భాగ్యం అన్నట్టు తింటాడు , పాపం ..
ఈ మూర్తి ఏమో ,రైతు బజారు కి వారం కి ఒక్కసారి వెళ్ళి , ఆ వారానికి సరిపడా ,కూరలు ,పళ్ళు ,ఆకు కూరలు తో సహా ,తెచ్చి పడేస్తాడు ట ,అదేమిటి ? మీ ఆవిడ రాదా ? తను కదా వండాల్సింది ?అని మాటల మధ్య ఒకసారి అడిగితే ,దానికి సమాధానం గా - ” అబ్బబ్బ ! ఆ రైతు బజారు లో జనమే జనం అండీ , ఆడవారిని తోసేస్తూ ,రాసుకుంటూ ,ఎందుకు వచ్చిన కర్మ ? నేనున్నా గా !అయినా , నాకు తెలిసినంత బాగా మా సరోజ కి కూడా తెలియదు అండీ ”
అన్నాడు , పెదవి విరిచేస్తూ , తనని తానూ గొప్పగా చేసుకుంటూ!
నేను విస్తు పోయాను ,ఇలా కూడా ఉంటారా ? మగవారు అని .
భాస్కర్ ని ఎప్పుడైనా, ‘ఇవాళ వండ డానికి కూరలు ఏమీ లేవు. నాకు బద్ధకం గా ఉంది ,అలా బండి వేసుకుని వెళ్ళి ,నాలుగు రకాల కూరలు తెచ్చి పడేయవా ? ఏదో ఒకటి వండుతాను ,ఈ పూటకి’ అని అడిగితే ..
” బాబోయ్,నాకు అలాంటి పనులు అప్పచెప్పకు, ఐనా మొన్నటి అనుభవం చాలదంటావా ? ” భాస్కర్ బాణం విసిరాడు .
“అది ఆర్నెల్ల కింద మాట .. ” ముసి ముసిగా నవ్వుతూ అన్నాను .
భాస్కర్ ఊరుకోలేదు . ” ఉండు అలా మాట మర్చకు ,నేను వంకాయలు తెస్తే అన్నీ పుచ్చు వి ,చచ్చువి అంటూ నువ్వు విసుక్కోలేదూ ?”
“…………………..”
” పోనీలే అంత బద్ధకం గా ఉంటే ఏమీ వండకు ,హోటళ్ళు ఉండేవి అందుకే కదా ,పద తయారు అవు ” అంటూ ఎలా మాయ చేస్తాడు ,అంతే కానీ ,కూరలు మటుకు కొని తీసుకు రాడు ..
కానీ మూర్తి అందుకు భిన్నంగా కనిపిస్తాడు
నా కన్నా ఐదారేళ్ళు పెద్ద ఏమో మూర్తి అయినా ,ఏదో చాలా పెద్ద వయసు అన్నట్టు మాట్లాడు తాడు ,నాకు తెలియని ప్రపంచం ఆయన మాటల్లో వింటూ , కంటూ ఉంటాను ..
‘పాపం సరోజ ‘ అని అప్పుడప్పుడు నిటూరుస్తూ ఉంటాను .
మేమిద్దరం కలిసి ఒకే విభాగం లో రెండేళ్ళు నించి పని చేస్తూ ఉన్నా ,ఎప్పుడూ వాళ్ళావడ్ని ని కలిసే సందర్భం రాలేదు ,ఎందుకో !
భోజనానికి వెళ్ళి ,ఒక కునుకు కూడా తీసి వస్తాను అని చెప్పే మూర్తి ,పది మిముషాల లో హడవిడి గా వచ్చి ,సొరుగు తాళం తెరిచి ,”మా అలమారా తాళాలు మర్చి పోయాను “ అంటూ ,మళ్ళి అంతే హడావిడి గా వెళ్ళి పోయి ,నన్ను ఆశ్చర్యం లో ముంచెత్తారు .
ఇంటి బీరువా తాళం చెవులు ,ఇంట్లో భార్య చేతికి ఇవ్వరా ?
నాకిది ప్రపంచ ఎనిమిదో వింత మా బీరువా తాళం చెవులు ,ఏ దిండు కిందో ,నా బట్టల బీరువా లో ,బట్టల మధ్యో ఉంటాయి ..
అసలు తనంతట తాను ,బీరువా తాళం తెరవనే తెరవడు. పైగా -
‘అవన్నీ నీ చీరలు ,నీ వస్తువులే కదా ,ఆ పేపర్లు అవీ నువ్వే ఎక్కడొ జాగ్రత్త చేస్తావు. నేనిప్పుడు వెదికానంటే..అన్నీ కలిపేసానంటూ గోల పెడతావు. అదంతా నాకెందుకు ? నువ్వే తీసివ్వు ప్లీజ్ ” అంటూ బ్రతిమాలుకుంటాడు .
ఇలా ఆఫీసు కి ఇంటి బీరువా తాళాలు తెచ్చే మగవాళ్ళుంటారని కానీ, వాటినిలా ఇంత భద్రం గా దాచే మొగుళ్ళుంటారని కానీ.. ఇదిగో ఇప్పుడే మొట్ట మొదటి సారిగా చూస్తున్న. చూసి, నమ్మలేని దాన్నౌతున్నాను.
ఆ మర్నాడు తనే మరింత వివరణ ఇచ్చాడు.నేనేమీ అడగకుండానే ,
” మా ఆవిడ చేతికి రోజూ ఇరవై రూపాయలిస్తాను . ఏ గొంగూర కో , తోటకూర కో పనికొస్తుందని . అంతకు మించి ఆవిడకేం ఖర్చు ఉంటుంది చెప్పండి ? అన్నీ నేనే చూసుకుంటున్నాను కదా” అంటూ తనో పెద్ద ఘన వంతు డన్నట్టు నవ్వాడు .
ఈ మాట లు వినగానే నా మతి పోయింది.
నాకు వచ్చే జీతం లో నేను మా అమ్మగారికి కొంత పంపిస్తూ ఉంటాను.
బజారు కి వెళ్ళానంటే నన్నాకర్షించేవి ఎన్నుంటాయని ! కొత్త డిజైన్ చీరో ,రంగు పూల గాజులో, లేటెస్ట్ మోడల్ స్టీలు గిన్నో ,ఏదో ఒకటి కళ్ళబడక మానదు . ఆ వెంటే కొనుక్కుని రావడము నా కలవాటు.
ఇంటి కొచ్చా క , ‘ఇదిగో చూడు, నా సెలెక్షన్ ఎలా ఉందొ’ అంటూ ఉత్సాహం గా అడిగితే కూడా . ,కనీసం ‘ఎంత అని కూడా అడగడు. చూడకుండానే ,’బాగుంది ,బాగుంది’ అనే భాస్కర్ నా కళ్ళముందు గబుక్కున కనిపించాడు నవ్వుతూ.
ఇదే మా ప్రపంచం .
అందరిదీ కూడా ఇంతేననుకుంటున్ననాకు మూర్తి ఆలోచన ప్రపంచం చూసాక మనసు కలత బారింది. ఏదో నాకు తెలీని, అంతు పట్టని కొత్త ప్రపంచంలా తోచాడు.
బహుశా ,నేనెప్పుడూ ఇలాంటి వారిని నేను అంతకు ముందు చూడక పోవడం వల్ల కావచ్చు .
మూర్తి లాంటి వారు ఉండే ప్రపంచం గురించి అవగాహన తెచ్చుకుంటూ , అలవాటు పడుతున్నాను ..
మూర్తి రెండ్రొజుల నించి ఆఫీసు కి రావటం లేదు ,ఎందుకా ? అని మధన పడుతున్నాను .
ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఉండే వాళ్ళం కదా, ఆ మనిషి ప్రక్క సీట్ లో లేకపోవడం లోటు గా తోచింది ..
అటెం డర్ ని అడిగితే ,ఆ అమ్మ కి బాగో లేదటమ్మ అంటూ పూర్తి వివరణ లేని కబురు తెచ్చాడు.
వారి ఇల్లు నాకు తెలుసు . ఇంటికి వెళుతూ ,ఒక సారి తొంగి చూద్దాం అని నిర్ణయించు కుని స్థిమిత పడ్డాను .
ఆ సాయంత్రం ఒక అర గంట ముందే బయలుదేరాను ,చెప్పానో లేదో ,నేను అప్పుడు రీసెర్చ్ స్కాలర్ ని మూర్తి నా సీనియర్ ..
అనుకున్నట్టె వెళ్ళాను ,పిలవని అతిథి లా ..
మూర్తి ఆశ్చర్య పోయి , కొంచం కంగారు గా ,” సరోజా! నేను చెపుతూ ఉంటానే , విమల అని , ఆవిడ వచ్చారు ” అని ఒక కేక వేసాడు ,ఆ మూడు గదుల ఇంట్లో ,ప్రతిధ్వనించేలా .
లోపలనించి సరోజ వచ్చింది . తలకి కట్టు కట్టుకుని , నీరసం గా కనిపించింది , నన్ను చూసి సన్నగా నవ్వుతూ ..’నమస్తే ‘అనబోయింది.
నేను హడలి పోతూ ..’ఏమయిందండీ ? తలకి ఆ కట్టు ఏమిటి ?’ అని కంగారు గా అడిగాను ..
ఆవిడ కళ్ళ ల్లో నీళ్ళు గిర్రున తిరిగాయి ,నాకు చాలా బాధ అనిపించి, ఓదార్పు గా ఆమె చేయి పట్టుకున్నాను.
ఈ లోపు మూర్తి లుంగీ లోంచి పాంటు లోకి మారి ,ఇప్పుడే వస్తాను అంటూ బండి తాళాలు తీసుకుని బయటకి నడిచాడు ..
అతన్ని వెళ్ళ నిచ్చి , “ఎవరైనా కొట్టారా “? అని అనుమానిస్తూ అడిగాను .
” అబ్బే కాదండి , మా ఆయన బంగారం ” అంటూ జరిగిన సంగతి చెప్పింది
రెండ్రోజుల క్రితం , స్నానానికని కి వెళ్ళి, బాత్రూం లోంచి తడి చీర చుట్టుకుని, బయటకి వచ్చిందిట. గచ్చు మీద తడి మీద కాలు వేసి జారి పడిందట. ఆ పడడం అధాటున మంచం అంచు తగిలి ,బొట బొటా రక్తం చిమ్మింది ట .
ఆవిడ చెప్పేదంతా నేను శ్రద్దగా వింటూ, ఆలోచిస్తున్న. ఆమె ఇంకా చెబుతోంది .
“నాకు స్పృహ లేదు . ఎప్పటికో ఈ లోకం లో కి వచ్చి పడ్డాను .”
ఆ రోజు మూర్తి వేరే పని మీద మరో ఆఫీసు కి వెళ్ళడం గుర్తుకొచ్చింది .
“అయ్యో ! ఎంత పని జరిగింది ? . పోనీ లేచి డాక్టరు దగ్గరకు వెళ్ళారా ?”
“అబ్బే లేదండి ,చిన్న దే కదా , పంచదార అద్దాను ,ఏం చేసినా రక్తం అలా ధారలు గా కారుతునే ఉంది ,ఈయన ఎక్కడ ఉన్నారో ,తెలీదు .”
“పోనీ మీ వారికి వెంటనే ఫోన్ చేయక పోయారా ?”
“నాకు ఫోన్ చేయడం రాదండి. ” అంది, అసహాయం గా .
చేతిలో పది రూపాయలు మించి ఉండని ఆవిడ పరిస్థితి తల్చుకుని నా గుండె గుభేల్ మంది.
ఈ లోగా మూర్తి ఒక కూల్ డ్రింక్ సీసా పట్టుకుని వచ్చి ,నా కళ్ళ -ముందే తన జేబు లోంచి ఫ్రిజ్ తాళం తెరిచి , అందులో ఒక పది నిముషాలు పెట్టి ,నేను వెళతాను అంటె ,అప్పుడు లేచి , స్టీలు గ్లాసు లో డ్రింక్ పోసి ఇస్తూ అన్నాడు .
“విమల గారూ ! పెద్ద గండం గడిచిందండీ . ఈ దెబ్బతో ఇదిగో ఆ రోజు నించి సరోజ కి నేను వంద రూపాయలు ఇస్తున్నాను .” అంటూ గర్వంగా ఆమె వేపు చూస్తూ ఉంటే ,ఆమె మురిపెం గా నవ్వింది
సిప్ చేసిన కూల్ డ్రింక్ ,భగ భగ మని మండి పోయినట్టు గొంతు దిగలేదు,
సరోజ చేతికిచ్చిన ఇరవై కి లెక్క చూపిస్తేనే కాని మరో ఇరవై ఇవ్వని మహాను భావుడితను. అలాటిది రోజుకి వంద ఇస్తాడా? ఆ మహా ఇల్లాలు ,పతి యే దేవుడు అనుకునే పాత కాలం మనిషి మరి , ఈయన చేతిలో పెట్టిన ఆ వంద రూపాయలని అలాగే దాచి పెడుతుంది నాకు తెలుసు .
ఇరవై ఏళ్ళు అయిందేమో , ఇది జరిగి. నా ప్రపంచం లో నేను అలాగే ఉన్నాను. ఏ మాత్రం మార్పు లేకుండా , సరోజ మూర్తి ల దాంపత్యం దివ్యం గా ఉండి ఉంటుంది
అది వారి ప్రపంచం ఒకే భూమి మీద ఇన్ని రకాల మనుషుల్లో ఎన్ని రకాల ప్రపంచాలూ!
ఎవరి ప్రపంచం వారిదే అయినా కొన్ని వింతగా ఉండడమే చిత్రం ,
నాకదే ఎప్పటికీ అర్ధం కాని వింత , ఒక వింత .
*******
ఆమెకు ఏమీ తెలియదు.. అనే ఒక్క వాక్యంతో భలే కట్టిపడేస్తారండీ ఆడవాళ్లను నిజంగా..! కానీ ఫ్రిజ్ కి కూడా తాళాలు వేసే మహానుభావులున్నారని మీ కథ చదివాకే తెలిసిందండీ..!
అనూ ,
అవును..నీ కేమీ తెలియదు. నోరు మూసుకో అనేది ,ఊత పదం లా వాడు తారు కొందరు..ఫ్రిజ్ కె కాదు.. బియ్యం pap pula గది కి కూడా తాళం వేసె వారు ఉన్నారు …హ్మ్మ్..ఇవి నిజాలు ..మీ స్పందన కి నా ధన్యవాదాలు
వసంత Lakshmi .పి.
మూర్తి లాంటి వారు చాలా మంది ఉన్నారు. కానీ “సరోజ ” లు మాత్రం తక్కువ ఉండాలని కోరుకుందాం. మీకు అర్ధంకాని వింతలు తారసపడకూడదని కోరుకుంటాను .:) వసంత గారు కథ నచ్చింది . అభినందనలు .
వనజ గారు ,
ముందుగా మీ స్పనదన కి ధన్యవాదాలు , మూర్తి లాంటి వారు ఉండడం కి కారణం , సరోజ లాంటి వారు ,మూడు పూటలా భోజనం పెట్టి , కొట్టకుండా ,తిట్టకుండా , ఉంటే చాలు..గొప్ప భర్త అనుకునే సరోజలు ఉండడంమే…అంతకన్నా ఆశించడం అత్యాశ Ani చిన్నప్పటినించి నూరి పోస్తారు మరి హ్మ్మ్..అలాగే కోరుకుందాం ..ఇంతకన్నా ఎం చేయలేక పోతున్నాం ..
మరొక సారి థాంక్ యూ ..నా కథ చదివి మీ అభిప్రాయం తెలిపినందుకు ..
వసంత లక్ష్మి ,పి.
Grt
శంకర్ గారికి,
ధన్యవాదాలు అండీ, మీ ప్రశంస కి ..నా కథ మీకు నచ్చినందుకు మరొక సారి ధన్యవాదాలు.
వసంత లక్ష్మి , పి
శ్రీమతి వసంతలక్ష్మి గారికి,
నమస్కారములు.
వాకిలి అంతర్జాల పత్రిక ఏప్రిల్ 2014 సంచికలో ప్రచురించబడిన మీ కథ ” అర్థం కాని వింత కథ” ఇప్పుడే చదివేను.
మూర్తి గారి లాంటి వ్యక్తులు మీకు తటస్థపడినందువలన ఈ కథ బాగా వ్రాయగలిగేరు.
కథా కథనము, సంరచన, మనోవైశ్లేషిక వివరణ అన్నీ బాగుండి, కథకు వన్నెలు దిద్దేయి.
మీకు అభినందనలు.
భవదీయుడు,
జోగారావు,
బెంగుళూరు
శ్రీ జోగారావు గారి కి ,
నమస్కారంలు , మీ అభిమాన ప్రశంస , చక్కటి విశ్లేషణ నాకు చాలా సంతోషం కలిగించింది , మీ వంటి పెద్దలు ,నా కథ చదివి మెచ్చుకొనడమ్ నాకు చాలా ప్రోత్సాహం ఇస్తుంది ముందు ముందు ఇంకా మంచి కథలు వ్రాయడానికి ..
వసంత లక్ష్మి ,పి.
చాలా బావుంది వసంత లక్ష్మి గారూ, చదువుతుంటే మధురాంతకం గుర్తొచ్చారు. అభినందనలతో -
రాధ గారూ ,
చాలా గొప్ప కథకుని తో పోల్చి నా పై పెద్ద భారం మోపారు, ఆ అర్హత కోసం మరింత శ్రమించాలి మరి ..చాలా పెద్ద బాధ్యత మోపారు,
మీ అభిమాన ప్రసంస కు నా మనస్ఫూర్తి ధన్యవాదాలు మీకు.
వసంత లక్ష్మి , పి
ఎవరి ప్రపంచం వారిదే అయినా కొన్ని వింతగా ఉండడమే చిత్రం ,
అది వారి ప్రపంచం ఒకే భూమి మీద ఇన్ని రకాల మనుషుల్లో ఎన్ని రకాల ప్రపంచాలూ!
వసంత గారు కథ నచ్చింది . అభినందనలు
వింజమూరి వెంకట అప్పారావు గారు,
నా కథ మీకు నచ్చినందుకు ధన్యవాదాలు అండీ.
వసంత లక్ష్మి , పి
వసంత గారు కథ చదివించింది అభినందనలు
మని వడ్లమాని గారు
ధన్యవాదాలు అండీ…
వసంత లక్ష్మి , పి
చాలా బాగుంది. మీకు నా అభివందనలు . మూర్తి లాంటి వాళ్ళు చాలా మందే ఉంటారు. ప్రతీ రోజు పాలు పెరుగుకి కూడా లెక్కలు అడిగేవాళ్ళు, సరుకులు లెక్క కట్టి ఇచ్చి ఎంతమంది వచ్చినా దానితోనే సరిపెట్టాలనె (అక్కడికి ఆడవాళ్ళ చేతిలో ఏదో అక్షయ పాత్రల్లాంటివి ఉన్నట్లు ) ధీరులు కూడా ఉన్నా సర్దుకుపోతో మన సంసార వ్యవస్థని కాపాడుకొస్తున్న ఇల్లాళ్ళకి నా జోహార్లు.
లక్ష్మి గారు ,
నిజం అండీ , అక్షయ పాత్ర అనే అనుకుంటారు,ఏ వెళ అయినా , ఆని రుచుల తో వండి వడ్దించాలి అని చూసే భర్తలు ఉన్న దేశం మనది. నా చుట్టు జరుగుతున్నా విషయాలే రాసాను, కల్పితం మటుకు కాదు..నా కథ మీకు నచ్చినందుకు చాల సంతోషం అండీ,
వసంత లక్ష్మి, పి.
వసంత లక్ష్మి చాలా బాగుంది ‘అర్ధంకాని వింత కథ’! ఆపకుండా చదివించింది. అభినందనలు.
వి .బాల సుందరి గారు,
నా కథ మీకు నచ్చినందుకు , చాలా సంతోషం అండీ ,
ధన్యవాదాలు అండీ
వసంత లక్ష్మి ,పి
వసంతగారు కథ బాగుంది .అబినందనలు .
గాలి లలితా , ప్రవల్లిక
నా కథ నచ్చినందుకు చాల సంతోషం. ధన్యవాదాలు మీకు
వసంత లక్ష్మి ,పి
ఈ జయ నామ సంవత్సరం తో మీ కథలన్నీ విజయ భేరి మోగించాలి అని ఆకాంక్షిస్తూ..
మీ
ఫ్రెండ్ ని.
డియర్ ఫ్రెండ్ , దమయంతి గారు,
అంతా మీ ప్రోత్సాహం , మీ సహాయ సహకారాలు ,
తప్పక మీ ఆకాంక్ష ని నిజం చెయడానికి ప్రయత్నిస్తాను..మీ విషెస్ కి నా కృతజ్ఞతలు ..
వసంత లక్ష్మి , పి
డియర్ వసంత,
అర్ధం కానీ వింత కథ చదివెను చాల బాగుంది. ఇప్పటి రోజులలో కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని పుట్టించిన భ్రహ్మ
దేవుడు కూడా మర్చలేడని అనుకుంటాను.
రత్న మాల ,
ఆవును నిజం. బ్రహ్మ కూడా మార్చలేరు , ఇలాంటి వారిని . ఈ మాట నిజం. నా కథ నచ్చినందుకు సంతోషం .
ధన్యవాదాలు మీకు ,రత్నమాల ..
వసంత లక్ష్మి ,పి.
చాలా బాగుంది వసంత లక్ష్మి గారు…
థాంక్ యూ హరిత , నా కథ నచ్చినందుకు ..
వసంత లక్ష్మి ,పి
చాల బాగుంది
పతిపాటి ఉష రాణి ,
థాంక్ యూ ..నా కథ మీకు నచ్చినందుకు చాలా సంతోషం .
వసంత లక్ష్మి ,పి.
Truth is stranger than Fiction. This story is an iota of Domestic Violence.Financial Control is the basis of all kinds of emotional and Physical Abuse. This just a story or imagination but the root of imagination has come from where that you have seen. This is truly real life in many cases. Poet Sri Sri annaru kadaa Banisa Banisa Banisa. Mundu Thandriki Banisa. Pellayaka Bhartaki Banisa,a tharvatha Pillalaku Banisa.Strre jeevithame anta. But times have not changed. Domestic Violence is beyond financil,social,economic boundaries.
barriors.
లక్ష్మీ మూర్తి ,
బాగా చెప్పారు. అవును స్త్రీ ని బానిస చేసారు… వనరులు , సంపద అంతా మగవారి చేతిలో పెట్టుకుని , స్త్రీలని ఇంటి చాకిరి కి పరిమతం చేసారు, ఉద్యోగం చేసే స్త్రీ అయినా , ఆమెకి తన జీతమ్ పై హక్కు ఉండదు. ఆదీ నేటి కి దుస్థితి..చాలా బాగా విశ్లేషించారు మీరు.
నా కథ ని చాలా చక్కగా అర్ధం చేసుకున్నారు, మీకు నా ధన్యవాదాలు..
వసంత లక్ష్మి, పి.
కథ చాలా బావుంది .
పార్థ సారధి రెడ్డి గారు,
థాంక్ యూ అండీ..నా కథ మీకు నచ్చినందుకు ..
వసంత లక్ష్మి , పి
ఇలాంటి భర్తలున్న భార్యలు తమకి తామే అర్ధం కాని స్థితికి ఎదిగి జీవితాన్ని సుగమం చేసుకుంటారేమో మరి!
కథ బాగుందండీ, తెలిసినా, తెలియకపోయినా, తెలియదు అని డిసైడ్ అయ్యే మూర్తి లాంటి వాళ్ళే ఎక్కువ మంది ఉంటార్లెండి
దర్భాలక్ష్మి అన్నపూర్ణ గారు,
చెప్పలేనం అండీ , ఆ అస్వంత్త్ర్యం అలవాటు అయిపోతుంది..ఆ వ్యవస్థ లో ఒక భాగం అయిపోయి , తరవాత తరం ని కూదా అలాగ తయారు చేసే పని ముట్లు అయిపోతారు ..
అందుకే తరతరాలుగా అలా కొనసాగుతోంది.
ధన్యవాదాలు మీ స్పనదన తెలియచేసినందుకు.
వసంత లక్ష్మి, పి.
మోహన్ రావిపాటి గారూ !
క్షమించండి ముందు ,మీ స్పందన కి స్పందించడం కాస్త కాదూ చాలా ఆలస్యం జరిగింది , క్షంతవ్యురాలిని .
అవును అండీ ,మూర్తి లాంటి వారు ఎక్కువే ఉంటారు , మూర్ఖుడు మహా రాజు అన్నారు , ఏమీ తెలియని వానికి ఉన్న దర్జా ,సౌఖ్యమ్ ,ఆలోచించే వారికి కలగదు మరి .
ధన్యవాదాలు మీకు .
వసంత లక్ష్మి .
మీ కథలు, బ్లాగులు చదువుతుంటే…నా చుట్టూ ఉన్న వ్యక్తుల గురించే వ్రాసినట్లుంటుంది. చాలా చక్కగా వ్రాస్తారండి మీరు
సురేష్ ,
నా చుట్టు ఉన్న ప్రపంచం నుంచే నా కథలు..ఊహా ప్రపంచం లో నిలబడి కథలు రాసే వయసు దాటిపోయాను.నా అనుభవం లోకిరాకపోయినా ,చూస్తూ అవగాహన కి వస్తూ, ప్రతిస్పందించడం నాకు అలవాటు అయిపొయింది.
థాంక్ యూ నా కథ మీకు నచ్చినందుకు
వసంత లక్ష్మి,పి .
కథ చెప్పిన విధానం చాలా బాగుంది. మీ కథకి వచ్చిన స్పందనలకి అభినందనలకి సంతోషంగా వుంది. మీకు నా అభినందనలు కూడా.
ఉమా రవీ గారు,
ధన్యవాడాలు అండీ, అవును అండీ ,నాకు కూడా సంతోషం గా ఉంది , నా మొదటి ప్రయత్నం ఈ కథ ,నా బ్లాగ్స్ లో కాకుండా.
మీ అందరి ప్రోత్సాహం నాకు చాలా బలం .. థాంక్ యూ ..
వసంత లక్ష్మి , పి
వసంత లక్ష్మిగారూ,
కథ చాలా బాగుందండీ. రోజులు మారేయంటున్నారు కానీ అలాంటి భర్తలు, భార్యలూ ఇంకా అక్కడక్కడ కనిపిస్తూనే వున్నారు. అంత చక్కగా వ్రాసినందుకు అభినందనలండీ..
జీ ఎస్ లక్ష్మి గారు,
ధన్యవాదాలు అండీ , మీ అభినందనలు నాకు శక్తి , మరో కథ వ్రాయడానికి.
వసంత లక్ష్మి ,పి.
This is not a contemporary story… wonderful, ahh relieved. Sickness may be one of the traits of the exploiter. I like the story for its unblemished realistic presentation. Good. (Fed up with the writers of exportation of artistic, chiseled merchandise ‘successfully killing realism’.) Good.
థాంక్ యూ ,ఉమా మహేశ్వర రావు గారూ ,
నిజాయితీ గా చెప్పాలి అని ప్రయత్నిస్తున్నాను .. మీ కాంప్లిమెంట్ ని అర్ధం చేసుకుంటున్నాను ..
వసంత లక్ష్మి , పి.
సా హి త్యం జీ వి త ద ర్ప ణం గా ఉం డా లి. It is unfortunate my friends in progressive literature are still running after deceptive formalism.
ఉమా మహేశ్వర రావు గారూ ,
నా కథ ని మీరు ఇంత క్రిటికల్ గా చదివి నందుకు చాలా సంతోషం ..
వసంత లక్ష్మి ,పి.
ఫోను చెయ్యడం కూడా రాని భార్యా, ఫ్రిజ్‌కి తాళం వేసే భర్తా – వాళ్ళో డబ్బా భార్యా,భర్తలు. వాళ్ళ గురించి అనడానికి ఏమీ లేదు వేరేగా. ఎటొచ్చీ, ఈ మూర్తి, కొన్ని ఇంటి పనులు చేస్తాడు, భార్యకి బొత్తిగా రాదని అవమానం చేస్తూ. ఈ భార్య, సరోజ, బయట ఉద్యోగం చేసే మనిషి కాదు. ఆత్మ గౌరవం అనేది వుంటుందని తెలియని మనిషి.
భాస్కర్, విమల – ఈ జంట గురించి చెప్పుకోవచ్చు. ఈ విమల ఒక తెలివి తక్కువ మనిషి. భాస్కర్ గొప్ప లౌక్యుడు. ఈ భాస్కర్‌కి పనులు ఎలా తప్పించు కోవాలో బాగా తెలుసు. భార్యని ఉబ్బేయడం, పుచ్చు వంకాయకీ, మంచి వంకాయకీ తేడా తెలియనట్టు నటించడం (అయిదో క్లాసు చదివే పిల్లాడికి కూడా తెలుస్తుంది ఈ తేడా, కళ్ళనేవి వుంటే), వంట రోజూ ఉద్యోగం చేసే భార్య చేతనే చేయించడం, పెత్తనం చెయ్యకుండా వుంటే జీవితంలో పనులు తగ్గి, ఆనందంగా వుండొచ్చు అని గ్రహించడం, వగైరా తెలిసిన గొప్ప లౌక్యుడు.
ఈ విమల ఉత్త వెర్రి మొహం. భర్తతో సమానంగా ఉద్యోగం చేస్తున్నా, వంటా, రైతు బజారు పనులూ మొత్తం తానే చెయ్యాల్సిన పరిస్థితిలో వున్న మనిషి. ఆ అదనపు పనులను ఎగురుకుంటూ చేసే తెలివి తక్కువ మనిషి. తన స్థాయిలో లోపాలు తెలియవు గానీ, అవతల వాళ్ళ మీద బోలెడు జాలి ఈ మనిషికి. ప్రతీ మనిషికీ చాలా సహజంగా వుండాల్సిన కొంత స్వేచ్ఛ తనకి తన భర్త వల్లే వచ్చిందని ఆ భర్త మీద బోలెడు గౌరవం ఈ మనిషికి. మూర్తి చెత్త ప్రవర్తన పాఠకులకి సులభంగా అర్థం అవుతుంది గానీ, ఈ విమల తెలివి తక్కువతనం గ్రహించడం అంత సులభం కాదు.
ప్రసాద్
ప్రసాద్ గారికి .
థాంక్ యూ..
మీ స్పందన ఆలస్యం గా చూసాను ,అవును అండీ ,ఎన్ని రకాల వింత మనుశులుంటారొ అనే నా కథ వస్తువు .
మీ అభిప్రాయం తెలిపినందుకు సంతోషం అండీ ..
వసంత లక్ష్మి ,పి
ఇప్పుడు పట్నములో చదువుకుంటున్న యువకులకు పల్లె లలో జీవించిన స్త్రీలకు పెళ్లి చేస్తే ఇలానే ఉంటుంది. మీరు చూసింది కరెక్టుగా మంచి సరళిలో చెప్పినారు. ఈ సంబందాలు ఎలా ఉంటె మంచిదో కుడా చెప్పండి
బత్తుల తిరుమల రావు గారికి నమస్కారం .
అవును అండీ ,నేను చూసిన పాత్రలే ఇవి ,ముప్ఫై ఏళ్ళ క్రితమేమో ,ఇంట్లో ఫోను లు లేని కాలం అది , బయటకి పోయి ఫోన్ చేయడం అంటే అది ఒక పెద్ద పని లా భావించే కాలం మరి అది ..ఈ భార్యా భర్తల సంబంధాలు ఎలా ఉండాలో చెప్పి చూపించడం ,కథకురాలి గా నా ఉద్దేశం కాదండీ ,ఒకరు చెపితే ,మారేవి కావు ..స్త్రీకి కూడా ప్రపంచ జ్నానం కలిపించాలి , ఆమె ని సమానం గా చూడాలి అని నేను చెప్పినా , ఇప్పుడు అలా లేరా ? అని అడిగే వారూ ఉంటారు ..ఎవరికి వారు ,తమ మనసులని అడిగి ,తేల్చుకోవల్సిన విషయం అవి ..
మీ స్పందన తెలిపినందుకు చాలా సంతోషం అండీ ..
వసంత లక్ష్మి .
వాకిలి లో వస౦త గారి కధ బాగు౦ది. మనకు తరుచు తారస పడుతూ…ఆలోచనలు రేకెత్తిస్తూ౦టాయి కొన్ని స౦ఘటనలు. కాని…కధగా మలచాలనే ఊహ రావట౦ జరగదు. కధను బాగా మలిచారు వస౦తలక్శ్మిగారు. అభిన౦దనలు….ఆచ౦టహైమవతి.
ఆచంట హైమావతి గారూ !
నమస్కారం ..నా కథ మీకు నచ్చినందుకు చాలా సంతోషం గా ఉంది .. ముప్ఫై ఏళ్ళయిందేమో ,ఆ పాత్రలు మారి ఉండవచ్చు .. కానీ నా మనసులో అవి అలా మిగిలి ఉండిపోయాయి ..
ఒక కథ గా మిగిలాయి చివరికి ..
ధన్యవాదాలు అండీ …
వసంత లక్ష్మి .
ఈ కాలంలో కూడా ఇలాంటి వారు ఉన్నారా అని ఆశ్చర్య పోవడానికి లేదండి. ఆన్ని కాలాల్లోని అన్ని రకాల వారుంటారు. అయితే వాళ్ళిద్దరిలో ఎవరోఒకరు అలా బానిస గా సెట్ అయిపోతే పర్వాలేదు. ఈ కధలో ఆమె సెట్ అయిపోయింది, ఆల్ హ్యాపీస్. మొగుడు పైసలివ్వకపోతే వాడి అన్ననో, అక్కనో పదీ పరకా అడుక్కుంటూ సంసారాలు వెలగ బెట్టే ఆడవాళ్ళున్నారు. అలాగే తెచ్చిన జీతమంతా ఆడదాని చేతిలో పెట్టేసి.. మళ్ళీ దాన్నే ఓ పది పైసలు అడుక్కుని బ్రతికే మగాళ్ళూ ఉన్నారు. కర్మ సిద్దాంతం అని కొట్టి పడేస్తే మనకి ప్రశాంతం గా వుంటుంది.
గౌతమీ !
బాగా చెప్పారు ..
మన దేశం లో అన్నిటికీ ఈ కర్మ సిద్దాంతం బాగా ఉపయోగపడుతుంది ..
మీ స్పందన తెలియచేసినందుకు ..ధన్యవాదాలు ..
వసంత లక్ష్మి .