నీటికి, వలకీ మధ్య
రహస్య ఒప్పందమేదో వుండేవుంటుంది!
నీళ్ళనొదిలేసి, ఎంత ఒడుపుగా-
చేపల్ని పట్టుకుంటుందో వల.
నీటినుంచి చేపని-
విడదీస్తున్నానేమో అని, భాద నటిస్తూ
జలజల రాలే కన్నీళ్ళొకటి పైగా.
చివరికిలా అంటుంది కదా..?
ఇన్నాళ్ళూ నీటిలో నాని,నాని,
నాలా నీకూ జలుబు చేస్తుందనే
నాతోటే నిన్నూ ఇలా-
ఒడ్డుమీద ఆరబెట్టడం.
వలల ద్వారా జరిగే ‘హత్య’ ను కవితగా మలచి చెప్పిన తీరు బాగుంది. కాసింత వలలకు దూరంగా ఉందాం మరి..:-) అభినందనలు సార్
వర్మ గారు., కృతజ్ఞతలు సార్.
నా కవితను ప్రచురించినందుకు వాకిలి సంపాదకులకు ధన్యవాదాలు.