కవిత్వం

జ్ఞానకోశం

జూలై 2014

ఎవరి కోసం
ఏకాగ్రతతో నిరీక్షిస్తున్నది ఈ జ్ఞానకోశం ?
తన లోని జ్ఞాన కణాలను వెలికి తీసి
వాటికి ఆకృతి కలిగించే
అభినవ ప్రయోక్తల కోసం
గుప్తంగా పడి వున్న జ్ఞానం
పొదిలో ఒదిగి వున్న బాణం లాంటిది
ప్రయోగించినపుడే దాని పదును లోకానికి తెలుస్తుంది
జ్ఞానకోశం అప్పుడప్పుడూ మూల్గుతూ వుంటుంది
తనలోని మూల ధనాన్ని వైజ్ఞానిక రంగం
వినియోగించుకునే రోజులు ఎప్పుడొస్తాయా అని
అంతటితోనే ఆగిపోలేదు ఆ జ్ఞానకోశం
అది తహ తహలాడుతుంది
కళా జగత్తులో తాను
శబ్దాలుగా చిత్రాలుగా శిల్పాలుగా
రూపు దిద్దుకునేది ఎప్పుడా అని
రాగాలుగా రవలించే క్షణాలు ఇంకా రాలేదేమని
జ్ఞానకోశం తపనను గుర్తించిన ప్రయోక్తలు
దానిలోని నిధులను దోసిళ్ళతో పైకెత్తి
తమ తమ విధానాలకు అనుగుణంగా మలచుకున్నారు
తన నిరీక్షణ సత్ఫలితాలను యిచ్చినందుకు
జ్ఞానకోశం నిండుగా ఉచ్చ్వసించింది

* * *

(మొదటి ముద్రణ: 13వ ఆటా మహాసభల జ్ఞాపక సంచిక, జూలై 2014)మీ అభిప్రాయం రాయండి

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)