కవిత్వం

గూడు కట్టుకునే చిత్రం

సెప్టెంబర్ 2014

ఇక మీదట దుష్టులతో
మాట్లాడ కూడదని నిర్ణయించాను.
ఇప్పుడు నాతో నేను మాట్లాడుకోవటానికి కుడా భయమేస్తుంది.

ప్రపంచం లోని గొప్ప మోసగత్తె తనే
కావచ్చు నేమోనని అనిపిస్తోంది
ఆ రోజు గాలిలో ఉగిసలాడే
తన ముంగురుల జ్ఞాపకాలు
గుండెల్లో భద్రంగా ఉన్నాయి మరి.

దేవతలని చీల్చి చెండాడి
మురికి కాలువలో వేద్దామనుకుంటున్నాను.
ఉదయంనుండే బియ్యం,పప్పు ,పసుపు,కుంకుమ
కొబ్బరికాయ ,తమలపాకులు,పూలు,పళ్ళతో నిలబడినవారు
ఆర్తిగా రోదిస్తున్నారు.
మాకున్న నమ్మకపు చివరి కొండిని తొలగించవద్దని.

మతం గురువు భోదన
రాజకీయనేత ప్రసంగం
కవి కవిత్వం
వీటి నడుమ తేడాలని తుడిచిన వారెవరని
వెతుకుతున్నాను.

ఎవరో ఇక్కడ పొగపెట్టి తేనెను దొంగలించారు
వీటి ఉనికి లేకుండానే
వేల వేల తేనెటీగలు మళ్ళీ గూడు కడుతున్నదృశ్యం
నా కళ్ళముందుంది.
ప్రభుత్వపు గోటి పదును ఎంత తీవ్రంగా ఉంది.
అదెంత సున్నితంగా పొడుస్తుంది!
ఏ మాత్రం గాయపడకుండా.

నీటిని కెలుకుతూ ఉన్నారు శుభ్రపరుస్తామని..
వీరిని ఎదురించటం ఎలా అని నేను ఆలోచిస్తున్నాను.

చింపిరి బట్టల గుబురు గడ్డం బైరాగి చెబుతున్నాడు
మాలాటి ఫకీరుతో స్నేహం చెయ్యండి
మీకు బాధ ను ఓడించటం ఎలా అని చెబుతానంటూ..

 

కన్నడ: డాక్టర్ విక్రమ్ విసాజి
తెలుగు అనువాదం: సృజన్



2 Responses to గూడు కట్టుకునే చిత్రం

  1. sindhu madhuri
    September 1, 2014 at 9:09 pm

    హాయ్ సృజన్
    ఎన్టీ ఇంత surprise .చాల సంతోషం.శివారెడ్డి గారు చెప్పారు ఆయన హోస్పేట వత్చినప్పుడు కలిసిన సంగతి,నిన్న తెనాలి లో మీ గురించి మాట్లాడుకున్నాం. చాల సంతోషం.బహుముఖ ప్రజ్ఞా వంతులు అయిన మీరు అప్పుడప్పుడు అనువాదాలు రాతలు మాకోసం చెయ్యాలి.చాల బాగున్నది పద్యం.బొమ్మ కూడా వెయ్యాలిసింది.మీ నించీ ఇంకా కొన్ని అరుదైన కన్నడ అనువాదాలను ఆసిస్తూ .హోస్పేటను చాల మిస్ అవుతున్నాను.
    సింధు మాధురి.

  2. ఆర్.దమయంతి
    September 14, 2014 at 8:18 am

    అనేకానేక రంగు దుస్తులు ధరించిన మనుషుల్ని చూపించారు.
    ముసుగు కప్పుకున్న సమాజం ఇలా మన ముందు నించీ నడచి వెళ్తుంటే చూడటం నాకెంతయినా ఇష్టం.
    సృజన్ గారు, మీ అనువాదం బావుంది.
    అభినందనలతో..

మీ అభిప్రాయం రాయండి

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)