కవిత్వం

ప్రేమకు స్మృతిగీతి

జనవరి 2013

ఆ మేఘం
తన గూటిని వశం చేసుకోలేదింకా

తన నీడకు
అచ్చెరువూ
శెలవనలేదు

ఆ నక్షత్రమూ
తన సంధ్యతో
సంబరించలేదు

ఆ యజమానీ
తన మృత్యువును
నిర్జనం చేయలేదు

వీరంతా మరణానికి
తలుపును బార్లా తెరిచి వుంచారు
వాకిలిని రాత్రికీ
సహస్ర ద్వారాలను సమరానికీ
తెరిచే వుంచారు

#

ఓ మిత్రులారా!
నా పాన సఖులారా!
ఈ నిర్మానుషత్వాన్ని
నిలువరించండి

#

స్త్రీలంతా నాకు ప్రీతే

కానీ
నా జాడలను
గాలులతో చిత్రించే
అతివలే అయిష్టం

భాషిత గగనాలకు
చేరువయ్యే పర్వతాలన్నా
ఇష్టం లేదు
నాకు
రహస్యంగా
మనసు దరిచూపే దారులంటేనే ప్రియం

పాదాల పాత జాడలకు
ఆత్మని లాగేసేయ్

నన్ను ఈ భూగోళం అంచులకు కోనిపో
భూగోళం అంటే
నా ఉద్దేశ్యం
భూ భాగం కాదు

స్త్రీ పెదాలూ అని
లేదా
ద్రాక్ష గుత్తి
లేదా
గాజు
లేదా
జాబిల్లి
పోనీ
మహనీయ సూర్య కిరణాల నుంచీ
నా అరచేతులపై పడే వాన నుంచీ
నన్నే అక్కున చేర్చుకునే
ఓ ఒడి
అని నా ఉద్దేశ్యం

అయినా
రాత్రి అని కాదు నా ఉద్దేశ్యం
దాని తెల్లవారే అని

#

నాకు అసలేమీ గురుతు వుండదు

అతని ముఖం నిర్మలంగా
దేహం శీతలంగా
లీలగా నాకు జ్ఞాపకం

నా ఆశ్చర్యం
నాకు మాత్రమే
బాగా గురుతు

నేను
చని
పోతే

నా మదిలో దాక్కున్న
ఆమె
ఎచటకు
పోతుంది?

#

మరి లైలా మవునంగా వుంటుందా?
చావిడిలో బుసైనా కనిపిస్తుందేమో
ఎల్జాను కౌగిలించుకుంటుందేమో జోస్ లీన్

చిరు పిచ్చాపాటికోసం
వీళ్ళంతా నా చుట్టూ మూగుతారనుకుంటా

“అతను యుద్ధానికి నేస్తం”
అని లైలా అంటుంది
“గాలి గారాలపట్టి అతను”
ఇది జోస్ లిన్ మాట

తన ఛాయ నుంచి విడివడలేదు తను
అతను వివేకి
ఈ శూన్యానికీ
తనే సఖుడు

 
Original:  హసన్ ఎల్ ఒజ్జానీ (మొరాకో కవి)
తెలుగు: అనంతు

 



One Response to ప్రేమకు స్మృతిగీతి

  1. fellow poet
    January 19, 2013 at 6:37 am

    wah..wa…..Andhra akhtar

మీ అభిప్రాయం రాయండి

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)