‘ అనిల్ డ్యాని ’ రచనలు

…అయినా

డిసెంబర్ 2017


గాలి తాను పాడుతున్న పాటను ఆపడం లేదు
చేతిలో ప్రేమలేఖ
మనసులో దిగులు
గులాబీ ఒక్కటి వేల వేల కిలోల బరువై పోతూ
నేను మోయలేనంతగా మారిపోతుంది
దూరంగా రైలు వస్తున్న చప్పుడు
ఒక పసిపాప నా భయం చూసి నవ్వుతుంది
పచ్చ జండా ఊపుతూ రైలు కదిలిపోయింది
పూర్తిగా »

గూడు రిక్షా

డిసెంబర్ 2015


గూడు రిక్షా

రాత్రి పదకొండు దాటింది. పరిషత్ పోటీలలో ఆఖరినుంచి రెండో నాటకం మొదలైంది. ఓపెన్ గ్రౌండ్. జనం పల్చగా ఉన్నారు. మంచు కూడా పలచగా రాల్తోంది.గ్రౌండ్ బయట ఒక గూడు రిక్షాలో కూర్చుని నాటకాన్ని చూస్తున్నాడు వీరయ్య. అసలు అతను ఈ పాటికి రోజూ ఇంటికి వెళ్ళి పోయి పడుకునే వాడే కానీ, అతనికి చదువు లేకపోయినా సంగీతం, పద్యాలు పాటలు అంటే కొంచం ఇష్టం. దాని వల్ల ఇంట్లో లచుమమ్మకి చెప్పి ఇక్కడ కూర్చుని నాటకాన్ని చూస్తున్నాడు.పెద్దగా ఏమి సాగటం లేదు, నాటకం నాటకీయంగానే ఉంది అంతా. వీరయ్య గట్టిగా నిట్టూర్చి, జేబులోంచి సగం కాల్చిన బీడి తీసి, రెండు చేతులతో బాగా నలిపి,…
పూర్తిగా »

నవ్వే నక్షత్రాలు

ఆగస్ట్ 2015


చీకట్లో ముఖాలు ఎలా కనపడతాయి
నక్షత్రాలే కనపడతాయి
సుదూర తీరాలలో ఉన్నా సరే మెరుస్తూ
నట్ట నడి గోదారిలో ఎదురీదుతున్న చేపపిల్లలా
రోడ్డు పై సాగిపోతున్నప్పుడు
ముఖానికి కట్టిన ముఖ్మల్ దుప్పట్టా
ఊపిరాడనివ్వని స్థితిలో
ఏ సిగ్నల్ దగ్గరో ఆగినప్పుడు
కవ్వింపుగా విసిరేయబడిన కామెంట్లు కొన్ని
ముఖానికి కాకపోయినా
మనసుకి కొన్ని మరకల్ని అంటిస్తాయి
కనపడే ముఖాలన్నీ దాయబడిన
వాటిని గుచ్చి గుచ్చి చూస్తుంటాయి
వాస్తవమేదొ ఉందని
ఊహకందనిది మనకెందుకని వదిలేయలేని
ఆలొచనలకు వేయాలికదా అసలు ముసుగు
అటూ ఇటుగా ఓ అయిదొందల…
పూర్తిగా »

తనలో తాను

సెప్టెంబర్ 2014


తనలో తాను

తనలో తాను కల్లోలిస్తున్నప్పుడు
ఒక్కడు… ఏం చేయగలడు!
ఒడ్డునవాలిన అలల నురగలా ఆరిపోతూ
తడిసీ తడవని ఇసుకలా మారుతూ
తనని తానే ఓదార్చుకుంటాడు

తన గుండె నాలుగ్గదుల్లో తానే దాక్కుంటూ
దాగుడు మూతలాడుతుంటాడు
చీకటి చివరి కొసలపై పాటకట్టీ
రాగానికి రంగు అద్దేందుకు నల్లరంగు లేదేమని
ఇంద్రచాపాన్ని నిలదీస్తాడు

నిశబ్దాన్ని పారేసుకుంటూ
ఏకాంతాన్ని కోరుకుంటూ
చెదరిన కలని, చెరగని జ్ఞాపకాల్ని మోసుకుంటూ
ఆరిన దీపపు పొగ గాల్లో కలిసినట్టు
తనలోకి తాను మెల్లిగా జారుకుంటాడు.


పూర్తిగా »