‘ అపర్ణ తోట ’ రచనలు

నేనూ – బోర్హెస్

జూన్ 2016


నేను అలా వీధుల్లోంచి నడుస్తూ, ఎంట్రన్స్ హాల్ ఆర్చివైపో, గేటుమీది ఇనపకమ్మీలనూ చూసేందుకో అలవాటుగా ఒక్క క్షణం ఆగినప్పుడు నాకు తటస్తపడే వ్యక్తి బోర్హెస్. నాకు ముందుగా ఇతను ఉత్తరాల ద్వారా తెలుసు, ఒక్కోసారి అతనిపేరు అధ్యాపకులు, ఆత్మ కథకుల జాబితాల్లో కనిపిస్తూ ఉంటుంది.

ఇక నా సంగతా ?నాకేమో ఇసుక గడియారాలు, మాపులు, పద్దెనిమిదో శతాబ్దపు టైపోగ్రఫీ, కాఫీ రుచి, స్టీవెన్సన్ వచనం, ఇటువంటివంటే చాలా ఇష్టం. వీటిల్లో కొన్ని అతనికి కూడా నచ్చుతాయేమో, కానీ వాటన్నిటినీ మహా గొప్పగా తన పాత్రల వర్ణనకోసం మాత్రమే వాడుకోవడం నన్ను కష్టపెడుతుంది. ఐనాసరే, మేము పరస్పరం విరుద్ధమైన వ్యక్తులమని అంటే అది అతిశయోక్తి అనే అంటాను.…
పూర్తిగా »

పునీత

సెప్టెంబర్ 2014


పునీత

ఎన్ని రోజులైందో గుర్తుకు రావట్లేదుగాని చాలా రోజులైనట్లే ఉంది. నెలదాటిందా అంటే!  ఉండు ఒక్కసారి సరిగ్గా గుర్తుకు తెచ్చుకోనీ.  ఆ..  ఆరోజు రమావాళ్ళింట్లో ముక్కోటి ఏకాదశి, విష్ణుసహస్రనామ పారాయణానికి వెళ్ళామా అక్కడే కదా అయ్యింది! ఎక్కడ తెలిసిపోతుందో అనుకుని హడావిడిపడుతూ వచ్చేసాను కానీ నా మొహం, ఎలా తెలుస్తుంది? అయినా ఏం పూజలో ఏం పాడో, భక్తి మీద ధ్యాస కన్నా బయటవుతామేమో అన్న భయం ఎక్కువ కదా. ఇంతకీ పారాయణం ఏ రోజు జరిగింది? పోయిన నెల ఏకాదశి అంటే, ఏది తెలుగు కాలెండరు? జూలై ఎనిమిదిన. ఈ రోజేంటి? ఓరి దేముడోయ్ సెప్టెంబరు ఇరవైమూడు! ఇంకా అవకపోవడమేంటి?! దడ పుట్టేస్తుంది.

నా మొహం…
పూర్తిగా »