‘ ఆనంద్ గుర్రం ’ రచనలు

యుద్ధం

ఆగస్ట్ 2015


యుద్ధం

అల్లాహ్ అక్బర్.. అషహాదు అల్లాయిలాహ ఇల్లల్లాహ్.. అష్‌హదు అన్నమహమ్మదర్రసూలుల్లాహ్.. హయ్య అలస్సలాహ్.. హాయ్య అలల్ ఫలాహ్..

గుట్టు సప్పుడు గాని సీకటి పొద్దును సిల్లకల్లం జేసుకుంట లౌడ్‌స్పీకర్‌ల నుంచి ఫజర్ నాలుగు దిక్కుల్లా మోగంది. మసీదు గూట్ల బిగేసుకోని పండుకున్న జంట పావురాలు జడుసుకోని రెక్కలు ఇసురుకుంటా ఆకాశంలకి ఎగిరినయ్. ఎగిరివోయిన పావురాలకి కిందెందో గింజల్లెక్క మెరవంగనే ఓ పాత రేకుల షెడ్డు మీద టపా టపా రెక్కలార్చినయ్. మెరిసే వాట్ని ముక్కుల్తో పొడవబోతే ముక్కులు దిగవడి రేకు రంధ్రాలు పెద్దగైనాయ్.

గా రంధ్రాల కెళ్ళి సొచ్చుకొచ్చిన జీరో బల్బు వాటి కండ్లల్ల ఎలిగింది. పావురాలు ఇచ్ఛంత్రవోయి మెడలు మెలికలు తిప్పుకుంట లోపల్కి తొంగిజూత్తే,…
పూర్తిగా »