‘ ఆలివర్ గోల్డ్ స్మిత్ ’ రచనలు

వికలాంగసైనికుడు

వికలాంగసైనికుడు

(మూలం: ఆలివర్ గోల్డ్ స్మిత్)

“ప్రపంచంలో సగంమందికి మిగతా సగంమందీ ఎలా బ్రతుకుతున్నారో తెలీదు”. అన్నంత అతి సాధారణమూ, యదార్థమైన పరిశీలన మరొకటి ఉండదేమో. గొప్పవాళ్ళ ఆపదలూ, కష్టాలూ మన ఆలోచనలను ప్రభావితం చేసేలా మనకి చెప్పబడుతుంటాయి; అవి ఉపన్యాసాలలోలా కాస్త అతిశయోక్తులతో కూడుకుని ఉంటాయికూడా; `అయ్యో వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో(పడ్డారో) చూడం’డని ప్రపంచం దృష్టికి తీసుకెళతారు; బాధలవల్ల కలిగే ఒత్తిడిలో ఉన్న గొప్పవాళ్లకి వాళ్ళ బాధలు చూసి మిగతా వాళ్ళు జాలిపడుతున్నారు అన్న ఎరుక ఉంటూనే ఉంటుంది; వాళ్ళ ప్రవర్తన ఏకకాలంలో వాళ్లకి ప్రజల మెచ్చుకోలూ, జాలినీ కూడా సంపాదించిపెడుతుంది.

ప్రపంచం అంతా చూస్తున్నప్పుడు ధైర్యంగా కష్టాలని ఎదుర్కోడంలో గొప్పదనం ఏమీ లేదు; మనుషులు…
పూర్తిగా »