‘ ఇటాలో కాల్వినో ’ రచనలు

ఉలిపికట్టె

ఉలిపికట్టె

అనగనగా ఒక ఊరు. ఆ ఊరంతా దొంగలే. చీకటి పడగానే ప్రతీవాడూ దొంగతాళాల గుత్తి బొడ్లో దోపుకుని గుడ్డి లాంతరు చేత పట్టుకుని బయల్దేరేవాడు. దొరికిన ఇళ్ళల్లో దూరడం, చేతికందింది మూటగట్టుకోడం. తెల్లారేవేళకి దొంగసొమ్ముతో ఇంటికి చేరేసరికి వాడిల్లు ఇంకెవడి చేతిలోనే గుల్లయి ఉండేది.

అలా అందరూ ఒకరినొకరు దోచుకునే వాళ్ళు. కలిసి మెలిసి సుఖంగా బతికేవాళ్ళు. ఒకడు ఎదిగిందీ, ఇంకోడు చితికిపోయిందీ లేదు. ఒకణ్ణొకడు దోచుకుంటూ, ఆ గొలుసు దొంగతనాలు ఊళ్ళో చివరి వాడు తిరిగి మొదటివాడిల్లు కొట్టెసేదాకా క్రమం తప్పకుండా సాగేవి. ఆ వూర్లో వ్యాపారమంతా అమ్మేవాళ్ల, కొనేవాళ్ళ మోసపు తెలివితేటల మీదే నడిచిపోయేది. అక్కడి ప్రభుత్వం ఒక మాఫియా. ప్రజల్ని వీలైనన్ని…
పూర్తిగా »