‘ కర్లపాలెం హనుమంత రావు ’ రచనలు

శునక పురాణం

శునక పురాణం


కుక్కలమీద కథలు సరదాగానే ఉంటాయి. కక్కకథే చేదు. ఎనభై నాలుగు లక్షల రకాల జీవజాతులు సృష్టిలో. ఎవరికీ లేని కడగండ్లుకు మా కుక్కజాతికే!కుక్కలంటే విశ్వాసానికి మారుపేరు అంటారు. మంచిమాటే. కానీ మా విశ్వాసానికి వీసమెత్తైనా విలువేదీ?మా జంతుజాలం దృష్టిలో మనుషులంతా పాతసినిమా రాజనాలలు. సూర్యకాంతాలు. కుక్క కంటబడితే చాలు రాళ్లతోనో, కర్రల్తోనో కొట్టాలని మీకు కుతి. ఆత్మరక్షణకోసం మేం కాస్త నోరు చేసుకొన్నామా.. ‘పిచ్చికుక్క’ అని పేరెట్టి మరీ వేపుకుతింటారు. మున్సిపాల్టీ బండ్లకోసం పరుగులు పెడతారు!మా కుక్కలు.. వరాహసోదరులు, నోరు చేసుకోకుంటే మీ స్వచ్చభారతులు ఎంత కంపుకొట్టేవో! ఆ విశ్వాసమైనా లేని కృతఘ్నులు మీ మనుషులు!

కుక్కకష్టాలు ఒక్క మనుషులతోనే కాకపోవచ్చు!…
పూర్తిగా »

మగాళ్లం.. మమ్మల్నీ కాస్త ఏడవనివ్వరూ!

మగాళ్లం.. మమ్మల్నీ కాస్త ఏడవనివ్వరూ!

ఏడుస్తూ పుడతాడు. పోతూ ఏడిపిస్తాడు. మధ్యలో ఏడవలేక నవ్వులు.. నవ్వురాక ఏడుపులు! ఛార్లీ చాప్లిన్ చిత్రంలాంటిది జీవితం. ఏడుపులు.. నవ్వులు పప్పులు, కూరల్లో ఉప్పూకారాలు.పిల్లలకి.. ఆడపిల్లలకేనా రోదన బలం.. అలంకారం! ఏడ్చి ఏడ్చి ఎర్రమన్ను తిన్నతరువాతేగా యడ్యూరప్పకి మళ్లా మాతృసంస్థలో పట్టు దొరికింది! మగజాతికి కన్నీటిని దూరంచేసి ఘోరనేరమే చేసింది మన సంస్కృతి.

శ్రీరామచంద్రుడు స్మితపారిజాతుడు.. శ్రీకృష్ణుడేమో చిదానంద స్వరూపుడు. దేవుళ్లే అయినా వాళ్లకళ్లూ కలువపూరేకులకు మల్లే తడవక తప్పిందికాదు! మామూలు మగవాడికిక మూగిరోదిగా బతుకు సాగించడం సాధ్యమేనా!

మొదటి కవిత పుట్టిందే మగవాడి ఏడుపులనుంచి. బావురుమంటే బాగుండదన్న మగబాధే వాల్మీకిచేత ఆరుకాండల రామాయణం రాయించింది. ఆ రామాయణంనిండా మళ్లా మగాళ్ల శోకన్నాలేగదా!

దశరథుడి..…
పూర్తిగా »

కోడిపలావు కహానీ!

కోడిపలావు కహానీ!

‘గిన్నీసు రికార్డుకాదు.. ఇంట్లో గిన్నెలూ చెంబులూ బద్దలైపోతున్నాయేందే నీ దెబ్బకీ!’

‘నా దెబ్బ కాదయ్యా మగడా! ధరల దెబ్బ! బోడి బీరకాయ కిలో యాభయ్యా! బీన్సు ఎనభయ్యా! బీటురూటు ముప్పై.. బెండ ముప్పై రెండా! దొండ..’

‘అబ్బబ్బ! ఆపవే బాబూ! ఆ ధరల దండకం!’

‘లేకపోతే ఏందయ్యా! నువ్వేడనో కోడిని కొట్టుకొచ్చి పలావు చెయ్యమని నా పీకలమీద కూకున్నావు ! పుంజునంటే కొట్టుకొచ్చావుగానీ.. పలావులోకి దినుసులు నేనే కొట్టుకాడ కొట్టుకురావాలి మావా!’

‘కొట్టుకు రావడమేంటే.. కొత్తగా మాట్లాడుతుండావ్! నెలమొదట్లో జీతం మొత్తం కుడుముల్లా నీ చేతిల్లోనే పోసాను గందే! అదంతా మార్నింగుషోలకే మటా!’

‘ఆ తమాషా ఒక్కటే తక్కువ నా బతుక్కి! నా బతుకే…
పూర్తిగా »

రాజకీయాల్లేని రోజు..!

రాజకీయాల్లేని రోజు..!

ప్లేటోకన్నా ముందున్న మనపురాణాల్లో మాత్రం రాజకీయాల్లేవా! గణాధిపత్యానికి పోటీ పెడితే వినాయకుడు అమ్మానాన్నలచూట్టూ ప్రదక్షిణాలనే ఉపాయం కనిపెట్టి మరీ కాకాయిజానికి శ్రీకారం చుట్టాడు. మహాభారతంలో శ్రీకృష్ణులవారలా నడిపించిందంతా రాజకీయం కాక మరేవిటో! వేళచూసి గోడదూకబట్టేగా విభీషణుడికి లంకానగరం దక్కింది! తలొంచినవాణ్ణి పాతాళానికి తొక్కేసే తంత్రం బలికాలంనుంచే చలామణీలో ఉందికదా! బోళాశంకరులకు హాలాహలమే దక్కేది. సత్యహరిశ్చంద్రుళ్ళా నిష్టగా నీలిగితే జీవితమంతా కష్టాలే కష్టాలని.. కాన్వెంట్లకెళ్లే పిలగాళ్ళుకూడా గుర్తుపట్టే కలికాలం కదా ఇది! రాజకీయాలొద్దే వద్దని పోతురాజు మామయ్యిలా పేద్ద పేద్ద సిద్ధాంతాలు చేస్తే మాత్రం అవంత సులువుగా రద్దపోయేవా!
పూర్తిగా »

ఆచార్య దేవోభవ!

ఆచార్య దేవోభవ!

‘గురువూ, దేవుడూ ఒకేసారి కనిపిస్తే ముందు నేను గురువుకే నమస్కారం చేస్తాను. దేవుడిని నాకు ముందు చూపించినవాడు గురువే కదా!’ అంటాడు షిర్డీ సాయిబాబా. యుద్ధరంగంమధ్య విషాదయోగంలోపడ్డ అర్జునుడికి ‘సుఖదుఃఖే సమేకృత్వా’ అంటూ గీతోపదేశం చేసిన శ్రీకృష్ణుడిని ‘జగద్గురువు’గా భావిస్తాం. అద్వైతబోధ చేసిన ఆదిశంకరులు మరో జగద్గురువు.

రాయికి రూపం ఇచ్చేవాడు శిల్పి. శిష్యుడికి రూపం తెచ్చేవాడు గురువు. ‘గు’ అంటే చీకటి, ‘రు’ అంటే పోగొట్టేది. అజ్ఞానాంధకారం పోగొట్టేది గురువే! కనకే, జన్మనిచ్చిన తల్లిదండ్రుల పిదప పూజనీయుడవుతున్నాడు. గురువును పరబ్రహ్మ స్వరూపంగా సంభావించే సంప్రదాయం భారతీయులది. అధర్వణ వేదంలోని శిష్టాచార సంప్రదాయం ప్రకారం- అభ్యాసానికి కూర్చునేముందు శిష్యుడు ఇష్టదేవతా ప్రార్థన అనంతరం ‘స్వస్తినో బృహస్పతిర్దదాతు’…
పూర్తిగా »

దిష్టిబొమ్మల వ్యాపారం

దిష్టిబొమ్మల వ్యాపారం

ఉడయవర్లు పదిహేనేళ్ల కిందట అందరు కుర్రాళ్లకు మల్లేనే రెండు కంప్యూటర్ భాషలు టకటక నేర్చేసుకొని అమెరికా ఎగిరెళ్ళినవాడే! రోజులు బావోలేక రెండేళ్ల కిందటే ఇండియా తిరిగొచ్చేసాడు. ఇక్కడు పరిస్థితులు అప్పట్లో అంతకన్నా అర్థ్వానంగా ఏడ్చాయ్!

స్వఛ్చందపదవీవిరమణ వంకతో చాలా కంపెనీలు బలవంతంగా ఉద్యోగుల్ని పీకేస్తున్నాయి. కొత్తగా వచ్చే కొద్ది ఉద్యోగాల్లో పెద్దతలల రద్దీనే ఎక్కువగా ఉంది. బాగా నడిచే బ్యాంకులూ ఉన్నట్లుండి బోర్డులు తిప్పేయడటంవల్ల అందులో పనిచేసే ఉద్యోగులూ రోడ్డెక్కాల్సిన పరిస్థితి. వరస కరువులవల్ల పల్లెల్లో పనులక్కరువు. వృత్తిపని చేసుకొందామన్నా పెద్ద కంపెనీల వత్తిడి పెద్ద అవరోధంగా మారింది. బహుళజాతి కంపెనీల బహుకృతవేషాలముందు బక్కజాతి మనిషుల కళ ఎక్కడెక్కి వస్తుంది?!

ఉన్న కాసిని ఉద్యోగాలీ సర్కార్లు…
పూర్తిగా »

ఆపరేష(షా)న్!

ఆపరేష(షా)న్!

మా కొలీగ్ సుబ్బారావు తనకు వంట్లో బావోలేదని ఆసుపత్రికి వెళుతుంటే నేనూ తోడు వెళ్ళా.

బైట బోలెడంత క్యూ. గంటకయినా లోపలికి పోవడం అనుమానమే. ఆఫీసుకి టైమయిపోతుందని నేను కంగారు పడుతుంటే కారిడార్లలో గుర్నాథం కనిపించాడు. నన్ను గుర్తుపట్టి పలకరించాడు.

గుర్నాథం హైస్కూల్లో నా క్లాస్ మేట్. చాలా ఏళ్ళతరువాత అనుకోకుండా ఇక్కడ కలిసాడు. నేను వచ్చిన పని కనుక్కొని చనువుగా ‘డాక్టరుగారు నాకు బాగా తెలుసులేరా! నువ్వెళ్ళు! మీ ఫ్రెండు పని నేను చూస్తాలే!’ అన్నాడు.

ఆ సాయంత్రం సుబ్బారావు గుర్నాథాన్ని ఒహటే పొగడటం! ‘మీ ఫ్రెండుకి మా చెడ్డ ఇన్ఫ్లుయన్సుందండీ! చకప్పులూ అవీ చకచకా చేయించేసాడు. రిపోర్టులు తీసుకొని తనే వస్తానన్నాడు’…
పూర్తిగా »

అనగనగా ఓ గాడిద

అనగనగా ఓ గాడిద

అనగనగా ఓ గాడిద. దానికి బతుకుమీద విరక్తిపుట్టి రేవులో మునిగి చద్దామని బయలుదేరింది. చివరి నిమిషంలో దేవుడు ప్రత్యక్షమై ‘ఏవిటి నీ బాధ?’ అని అడిగాడు. ‘కోకిలమ్మకు కమ్మటి గొంతిచ్చావు. కోతిబావకు గెంతులిచ్చావు. నెమలికన్నెకు అందమైన ఈకలిచ్చావు. మా జాతిదే అయిన గుర్రానికీ మంచి తేజాన్నిచ్చావు. సింహాన్ని సరే వనానికే మహారాజుని చేసావు. చివరికి చిట్టెలుకక్కూడా గణాధిపతి వాహనంగా గౌరవమిచ్చావు. నేనేం పాపం చేసానని నాకీ గాడిద బతుకిచ్చావు?! గాడిదచాకిరీ చెయ్యలేక ఛస్తున్నాను. చీదరింపులకు అంతే లేదు. ఇన్నిన్ని అవమానాలు పడుతూ బతికేకన్నా ఈ రేవులో పడి చావడం మేలు’ అని ఘొల్లుమంది గాడిద.

‘ముందా కొళాయి కట్టేయ్! ఏం జన్మ కావాలో కోరుకో!’…
పూర్తిగా »

కృత(క) యుగారంభం

కృత(క) యుగారంభం

 

కార్తీకమాసం. శుక్లపక్షం. శుద్ధ నవమి. కృత యుగారంభ దినం. బ్రహ్మాజీ ఆ యమ బిజీగా ఉన్నాడు. దాదాపు అన్ని ఏర్పాట్లూ పూర్తైపోయినట్లే. ఇహ ఎవరి బాధ్యతలు వాళ్లకి అప్పగించడమే తరువాయ.

ముందుగా ధర్మ దేవతకు ఫోను కొట్టాడు. నాలుగైదు రింగులైతేనే గానీ రంగం మీదకు రాలేదా మహా తల్లి. “సారీ! మీకు తెలీందేముంది! ఒంటి పాదం..” ధర్మ దేవత సంజాయిషీ.

“ ఓకే..ఓకే! ఈ ఘడియ వరకే నీకీ కష్టం. ఈ బ్రహ్మీ ముహూర్తం నుంచి ఇహ నీ ఇష్టం. పరుగే పరుగు! కృత యుగం ఆరంభం. కంగ్రాట్స్ ధర్మ దేవతా!”

కంగారు పడింది ధర్మ దేవత” ఒక్క పాదంతో తిప్పలు పడుతున్న…
పూర్తిగా »

మారు (య ) పేర్లు!

మారు (య ) పేర్లు!

మనం కోరుకుని ఒకరి ఇంట్లో పుట్టలేదు. మనల్ని అడిగి మరీ కన్నవారు మనకీ సుబ్బారావు, సుబ్బలక్ష్మి అన్న పేర్లు పెట్టరు. ఏ దేవుడికో మొక్కుకున్న తరువాత పుట్టిన బిడ్డకు ఆ దేవుడి వరప్రసాదమని నమ్మి ఆ గాడ్ పేరు పెట్టుకుంటారు కొంతమంది. నాకు తెలిసిన ఒక స్నేహితుడి పేరు మస్తానయ్య. ఏ పీర్ల పండుగ నాడో ఆ పైనున్న సాహెబ్ కి మొక్కుకుంటే పుట్టిన వరప్రసాదమని నమ్మి పాపం వాడికా పేరు పెట్టి ఉంటారు. అదొక ఆచారం. కొంత నయం. వరుసగా పిల్లలు పుట్టి పోతుంటే ఏదో శని చుట్టుకుందన్న భయంతో దాన్ని పోగొట్టుకోవటానికి బిడ్డను ఏ పెంటయ్యో, చింపిరమ్మో అనో పిలిచే ఆచారమూ…
పూర్తిగా »