‘ కుప్పిలి పద్మ ’ రచనలు

ఇట్లు మీ… (12)

డిసెంబర్ 2015


ఇట్లు మీ… (12)

కార్తీకమాసమంతా శీతలవుదయాల ప్రభాత రశ్మిని అదే పనిగా చూడటం భలే సంతోషాన్నిస్తుంది. దైనందిన జీవితంలో కొన్ని క్షణాలని మనం మన కోసం మాత్రమే అట్టి పెట్టుకుంటాం. మన కోసం జీవిస్తాం. ఆ రశ్మి తనువులోని ప్రతి అణువుని స్పర్శిస్తుంటే, అప్పుడే పుట్టిన తన బిడ్డ వొళ్లంతా తడిమి తోటి మానవుల స్పర్శని తల్లి ఆ పసిప్రపంచానికి పరిచయం చేస్తున్నట్టు, ఆదిత్యుడు మరలమరల లేత వెచ్చదనంతో మనకి జీవధాతువుని పరిచయం చేస్తున్నట్టు వుంటుంది. అస్సలు విసుగు పుట్టని ఆ సంతోషానుభవపు తీగకి పూసిన చిరునవ్వుల కాంతుల్లో నిశ్చింతగా రోజువారి పనులు మొదలు పెడతాను. నువ్విక్కడుంటే వో ముద్దుని నీ కుడి అరచేతిపై పూయించి స్టాట్ట్యు అని…
పూర్తిగా »

ఇట్లు మీ… (11)

నవంబర్ 2015


ఇట్లు మీ… (11)

వో నా చిన్నా, చిన్నచలి. రాత్రంతా కురిసిన చిరుమంచుని కప్పుకొన్న పున్నాగల చల్లని సౌగంధం వుదయపు నడకలో నాతోపాటు. యింకా తెల్లవారని రాత్రి. నడిరాత్రి శుభ్ర పరచిన రోడ్స్. తెరచిన టీ స్టాల్స్ లోంచి మరుగుతోన్న టీ వేడి సువాసనలని లెక్కపెట్టగలిగేంతమంది రుచి చూస్తూ. గొలుసుల చేతివాటంవారికి చిక్కకూడదని మెడల్లో యేం లేకుండా జాగ్రత్త పడి యిళ్ళల్లో పనులకి వెళుతున్న స్త్రీలు, పాల పాకెట్స్ , న్యూస్ పేపర్స్ తో నిండిన టూ వీలర్స్, సైకిల్స్. రోడ్ కి అటూయిటూ యిడ్లి, దోస బళ్ళు. పార్క్ ముందు కొన్ని వూదా రంగు పావురాలు గింజలు తింటూ, పోలీస్ వ్యాను పోలీసులతో గన్స్ పట్టుకొని. సిసి…
పూర్తిగా »

ఇట్లు మీ… (10)

అక్టోబర్ 2015


ఇట్లు మీ… (10)

గత కొద్ది రోజులుగా యిక్కడ వానలు. ప్రేమలో మన మనసులు తడిసి ముద్దైనట్టు ఆకులు పువ్వులు తడిసి ముద్దయ్యాయి. వొత్తైన జిల్లుమనే చల్లదనం పియానో మోహపు రాగంలా అల్లరి చేస్తుంటే సముద్రతీరాన వున్న యిసుక రేణువులని లెక్కపెట్టలేనట్టు లెక్కలేనన్ని సార్లు నిన్ను తలచుకొన్నాను. యెదైన కొత్త ప్రాజెక్ట్ చెయ్యబోయే ముందు ఆలోచిస్తూ అటూ యిటూ పచార్లు చేస్తుండే నువ్వు, నీకు నచ్చిన పాటలు ఆన్ లైన్ లో కొనుక్కుని యెంత పనిలో వున్నా సరే ముందు ఆ పాటలు చూడమని నీ నోట్ బుక్ దగ్గరకి లాక్కొచ్చే నువ్వు, కంపోజ్ చేసుకొంటూనో, లేదా చదువుతూనో కాఫీని చల్లార పెట్టే నీకు కాఫీ తాగమని గుర్తు చేస్తున్నా…
పూర్తిగా »

ఇట్లు మీ… (9)

సెప్టెంబర్ 2015


ఇట్లు మీ… (9)

యెవ్వరు చూడకుండా అప్పుడప్పుడు నీ బుగ్గపై ముద్దుపెట్టుకొన్నట్టు రాత్రంతా కోనసీమ గాలి నన్ను అలా ముద్దుపెట్టుకొంటూనే వుంది. భలే అల్లరి గిలిగింత. నీకు అలానే వుంటుందా నా ముద్దు. చూడు యిలా అడగాలి నిన్ను... నువ్వపుడు చెప్పావ్ కదా. అఫ్ కోర్స్ నీ కళ్ళు చెపుతాయనుకో. యీ గాలిలోని వొక మోహ పారవశ్యపు పచ్చి సుగంధంలా వొళ్ళంతా కమ్ముకొంటుంటే నువ్వు నాతో యిక్కడకి వచ్చి వుంటే ఆ గాఢత మరింత రెట్టింపు అయేది కదా. కాని నువ్వు Thames నది జీవన సౌందర్యాన్ని డాక్యు మెంట్ చెయ్యడానికి వెళ్ళావు. భలే కదా మనిద్దరం రెండు నదుల జీవనాన్ని చూస్తున్నాం.
పూర్తిగా »

ఇట్లు మీ… (8)

ఆగస్ట్ 2015


ఇట్లు మీ… (8)

ముద్దపప్పు, జీడిపప్పు, నూపప్పు… యిలా యీ రోజుకి నీకు యే పేరు పెడదామాని ఆలోచిస్తున్నాను యీ గోదావరి వొడ్డున కూర్చుని.

వో పెద్ద వుత్సాహపు కిక్కిరిసిపోయిన సుసంభరం తిలకించిన ప్రేక్షకులు వాళ్ళవాళ్ళ గమ్యాలకి వెళ్ళిపోయాక నిశ్శబ్దంగా వున్నయీ ఆవరణలో కూర్చుని వున్నాను. నిజానికి అంతా బోసి పోయినట్టు కనిపించాలి. కాని అలా లేదు. యెదురుగా వున్న గోదావరి తనని చూడటానికి అంతమంది వచ్చారు. యిప్పుడు యీ రోజు వేళ్ళమీద లెక్కపెట్టగలిగేంత మంది మనుష్యులు మాత్రమే వున్నారిక్కడ… అయినా ఆ ప్రవాహపు మిలమిలలో తేడా యేమిలేదు.

గత కొద్ది రోజులుగా యెటు చూసినా మనుష్యులే. గుంపులుగుంపులుగా. వొక్కసారే అంతమంది చూడటం భలే అనుభవం. కలిసిమెలిసి…
పూర్తిగా »

ఇట్లు మీ… (7)

ఇట్లు మీ… (7)


యెండ హోరు తగ్గిందో లేదో వానలు మృదువుగా కురవటం మర్చిపోయాయా అన్నంత వర్షం. చిన్న జల్లుకే యేరుల్ని తలపించే నగరాలు. అటువంటిది పది రోజుల్లో కురవాల్సిన వర్షం వొక్క రోజులో కురిస్తే యీ ముంబాయి మహా నగరం పొంగి పొరులుతోన్న అరబిక్ నదిలా వుంది. జన జీవనం స్తంభించటం అంటే యేమిటో మళ్ళీ యిప్పుడు మరొక్క సారి చూస్తున్నాను. ప్రతి యేడాది వానాకాలంలో యిలా జలమయం అవుతోన్న నగరాలని చూస్తూ కూడా వాటిని మెరుగు పరిచేవారెవ్వరూ వాటి మీద అవి అలా కాకుండా చూడటం పట్ల యేమంత శ్రద్ధ కూడా పెట్టరు.

సో … పనులన్నీ పోస్ట్ పోన్. నా రూమ్…
పూర్తిగా »

ఇట్లు మీ… (6)

ఇట్లు మీ… (6)

వో నా జీవనసుగంధమా, యేం చేస్తున్నావ్‌…

యిప్పుడు యిక్కడ రాత్రి మూడవుతోంది. ‘తనూ వెడ్స్‌ మనూ రిటన్స్‌’ సెకెండ్‌ షో చూసొచ్చాను. నీతో కలసి సినిమాలు చూడటంలో వున్న సరదా వేరనుకో. రెండు గంటల వేళ సినిమా నుంచి వస్తూ కూడా కారులో ఎ.సి. తీసేసి రాత్రిగాలిని పలకరించటానికి లేదు. యీ నడిఝాము దారుల్లో కూడా చిరుగాలి వీచనని మోరాయిస్తోందనుకో. రోహిణీకార్తె. యెండలు ఝుమ్మంటున్నాయి. వొకప్పుడు బెజవాడ, గుంటూరు యెండలకి చెమటలూ పారేవి నిరంతరం అనేవారు. యిప్పుడు యే వూరు చూసినా యే సిటీ చూసినా వొక్కలానే వున్నాయి. సినిమా నుంచి వచ్చాక కూడా కంగనా గుర్తొస్తునే సంతోషం. యేమీ జీవిస్తుందా పాత్రల్లో. అసలు…
పూర్తిగా »

ఇట్లు మీ… (5)

ఇట్లు మీ… (5)

చుట్టూ కాగితాలు. యెదుట లాప్ టాప్. మరో పక్క లాగేస్తోన్న మల్లె పూలవనం. లోపల అల్లరి పెడుతోన్న పాటలెన్నో.
యేకకాలంలో యెన్నెన్ని భావాలో. మనకి పరిచయం అయిన ఆ తొలి వసంత కాలంలో మనిద్దరం కడియం మల్లెపువ్వుల తోటల్ని చూడటానికి వెళ్లాం. ముదురాకుపచ్చని గుబుర్ల నడుమ చిన్నివి, కొంచెం పెద్దవి, బాగ పెద్దవి మల్లెలు. పందిరి మొగ్గలు. ఆ మొగ్గలని బుట్టల్లోకి చకచక కోయటం చూసి నువ్వెంతగానో ఆ స్కిల్ ని మెచ్చుకున్నావ్.

యెన్నిన్ని కాంబినేషన్స్ తో మాలలు అల్లేవారో కదా! మల్లె దవనం. మల్లె మరువం. మల్లెలు కనకాంబరాలు. మల్లెలు మరువం కనకాంబరాలు… ఆ కలబోత మాలలు యెంత అందంగానో వుండేవి.…
పూర్తిగా »

ఇట్లు మీ… (4)

ఏప్రిల్ 2015


ఇట్లు మీ… (4)


యీ వుదయం వూరెళ్ళాలని యెయిర్ పోర్ట్ కి బయలుదేరుతోంటే నువ్వు కాల్ చేసావ్. వొట్టి నీ సెల్ ఫోన్ ముద్దుకే మురిసిపోయాను. పక్కనే నిలబడి ముద్దు పెట్టినంత యెఫెక్ట్ తో యెలా పెట్టగలవ్! యె న్నెన్ని గాలి ముద్దులో కదా… మనం మాటాడుకొంటున్నప్పుడు మన మాటల మధ్యన నిశ్శబ్ధంలో నీ పెదవులపై కనీకనిపించని నీ పసిఅల్లరి నవ్వువి వినడానికి చెవి వొగ్గానా, సరిగ్గా అప్పుడే వినిపించింది కోయిల పలకరింపు. వాకిట్లోని మామిడి చెట్టు మీద నుంచి. యీ వసంతానికి తొలిసారిగా యీ వూరి కో యిల పలకరింపు నీకు వినిపించింది కదా. మనిద్దరం వొకే సారి వినటం తరువాత రికార్డ్ చేసి…
పూర్తిగా »

రా.. వచ్చేయ్…

మార్చి 2015


రా
వచ్చేయ్

నిండు చందమామ తిరిగి
నెలవంకై యే దారిలో
పరిగెడుతోంది…

బోల్డన్ని తారకలు, కాసింత
చల్లగాలి పరుచుకొంటున్న యీ
రాత్రి
మనం కలుద్దాం

అత్యంత పురాతన వైన్
ఫ్రైడ్ గ్రీన్ టమేటో, రా సాల్ట్ డ్ చిల్లీస్
సిద్దంగా వుంచుతాను
గార్లిక్ బ్రెడ్ తీసుకురా…

నా కిష్టమైన నీ పసుపుపచ్చని
ఫ్యాబ్ ఇండియా
కుర్తా ధరించి

వో కొత్త పాటతో
రా
మన శ్వాసలకి
సరి కొత్త రిధమ్ ని
పరిచయం చేద్దాం
వొకరి మెడ చుట్టూ వొకరం చేతులేసి

పూర్తిగా »