‘ కె.గీత ’ రచనలు

కవిత్వమే మిత్రుడు, ప్రేమికుడు, సహచరుడు…!

మార్చి 2013


కవిత్వమే మిత్రుడు, ప్రేమికుడు, సహచరుడు…!

మెరుపు తీగల వంటి కవులొచ్చిన 1985లలో ఆ కవుల మధ్యకు బిక్కుబిక్కుమంటూ వచ్చి, అతికొద్ది కాలంలో తనదయిన కవిత్వ వాక్యదీపాన్ని సరిదీటుగా వెలిగించిన కవయిత్రి కె.గీత. దయలేని జీవితం విధించిన నిశ్శబ్దాల్ని దాటుకొని, రాయలేనితనాల్ని గట్టెక్కి, ఇప్పుడు మూడో పుస్తకమయి మీతో పలకరిస్తున్న విజయగీతిక గీత.

ఏదైనా ఒక జీవితం కవిత్వం వల్ల సుసంపన్నమవుతుందా? కవిత్వంవల్లే పరిపూర్ణతను పొందుతుందా! కేవలం కవిత్వం రాయడంవల్ల సాంత్వనని పొంది మరి కొందరికి మార్గం చూపించగలదా!!

అవును-కవిత్వానికి ప్రపంచాన్ని తన ప్రేమైక హస్తాల్లోకి తీసుకుని వెన్ను నిమరగల గొప్ప మన:శ్శక్తి ఉంది. అది నిన్ను బతుకు నించి వేరు చేసి జీవింపజేస్తుంది.  మరణం అణగద్రొక్క లేని జీవితాన్ని ప్రసాదిస్తుంది. మన…
పూర్తిగా »

Missed Letter …

15-ఫిబ్రవరి-2013


Hi, pal! Howdy?
It’s ages since you penned your last letter!
Nay, eons!!!
The moments we caressed our wounds together
And the pep talk that transcended epochs
Still lie under the creased folds.

A Letter is an elixir
that doubles-up enthusiasm for life
every time you breathe…
It’s an amazing leaf that reassures
your heart with letters.

Hi, pal! Howdy?
Home, children, neighborhood,
Loans,…
పూర్తిగా »

కథ ముగిసింది

08-ఫిబ్రవరి-2013


కథ ముగిసింది
కథల చెట్టు కూలిపోయింది
నా చిన్నప్పటి కథల్లో రాజకుమారులు-గుర్రాలు, చాకలాడు-గాడిద
అందరూ, అన్నీ మరణించాయి
ఒక గొప్ప రహస్యం చెబుతున్నట్లు
“విషము నిమ్ము కాదు విషయ నిమ్ము”
అని గుసగుసలాడే గొంతు
ఆగి పోయింది

నాన్నమ్మా! నాన్నమ్మా!
నీ ఊడ పట్టుకుని వేళ్లాడే పసిరి కాయలం మేము
ఎనభై మూడేళ్లొచ్చాయని
ముసలితనం నిన్ను మింగేసిందని
ఎవరన్నారు?
నిన్నా మొన్నటి నీ మెత్తని చేతి స్పర్శ
నా చెంపల్ని తాకిన నీ బోసి నోటి ముద్దులు
గేటు దగ్గర నన్ను కౌగిలించుకున్నపుడు నా భుజాన్ని…
పూర్తిగా »

తూనీగ ఆధారం

జనవరి 2013


ఇక కన్నీళ్ల పిడి గుద్దుల్ని భరించలేను
అపజయాల దిగుడు బావిలో ఆత్మహత్యించలేను
నాకో నిర్భయ ప్రదేశం కావాలి
ఎండ తళుక్కున మెరిసే వెచ్చని నవ్వు కావాలి
నా మనసుకు తూనీగ కాలూన్చే చిన్ని ఆధారం కావాలి
అనుక్షణం తలలూపే పైర్లని ముద్దాడే ఏటవాలు తెమ్మెర కావాలి
నేనో అమాయకపు దీపప్పురుగుని
ప్రపంచం మెరుగుల్ని నురుగై పూసుకుని కూలబడతాను
కళ్ల ఆధారంతో కవిత్వాలల్లుకుని
కందిరీగల కాలాన్ని రెక్కలార్చుకుంటూ పోయే సీతాకోకచిలుకని
ఆగిన ప్రతిచోటా వెన్నెల పుష్పాలు జలజలా రాలాలి నాకు
చూపు సాగినంత మేరా కెరటాలు పాదాల ముందు ప్రత్యక్షమవ్వాలి

పూర్తిగా »