‘ కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి ’ రచనలు

ఆర్తిగా లోలోన రగిలే హృదయాలాపనే కవితాసమయాలుగా.. ‘ఒక రాత్రి మరొక రాత్రి’

ఆర్తిగా లోలోన రగిలే హృదయాలాపనే కవితాసమయాలుగా.. ‘ఒక రాత్రి మరొక రాత్రి’

సృజన ఆధార మూలస్రావాల్లో తడిసిముద్దవుతున్నవాడు, నిదుర ఓడకు లంగరేసి, మెళుకువ తీరాలవె౦ట మాటల శకలాల్ని ఏరుకు౦టూ సుమధుర భావాలాపన ఆలపించే౦దుకు ఎరుకతో ఆలోచనా మునకలు తీస్తు౦టాడు. అన్వేషణ అన౦తమైనదని తెలుసు, తానూ దూకుడుగా ప్రవహి౦చే తన భావనా నది లోతైనదనీ తెలుసు, దాన్ని ఈదడం భారమనీ తెలుసు. అయినా తనను గాయపరచిన సామాజిక సందర్భాల్ని దాచివు౦చిన జ్ఞాపకాల మూటల్ని విప్పుకు౦టూ ఒకటొకటిగా బయటకు తీసి నిమురుతూ ఆప్యాయ౦గా హృదయానికి హత్తుకుని ఏడ్చే పసిబిడ్డను లాలి౦చినట్టు లాలిస్తూ కన్నీటిని మునివేళ్ళతో తుడుస్తూ దారితప్పి తచ్చాడే కురుచ భావాలను సవరి౦చుకు౦టూ ఆత్మలో మొలకెత్తే సలుపును పసిగట్టి కాపాడుకోవలసిన దుఃఖాల పట్ల స్పృహ కలిగి కాల౦ స్థితిని పి౦డి అక్షరాల్లో…
పూర్తిగా »

మసిబారిన మానవ సంబంధాలను ఎత్తి చూపే మమత కవిత్వం

మసిబారిన మానవ సంబంధాలను ఎత్తి చూపే మమత కవిత్వం

మనసు బాధతో గుక్కపట్టినప్పుడో, జీవితంలో ఓ ఆనందం పూదండలా మెడకు చుట్టుకుని ఆహ్లాదపరచినప్పుడో ఉద్వేగంతో కూడిన భావజాలం కవిత్వమై మమతకు సాంత్వననిస్తూంటుంది. జీవితానికో పరమార్ధముందంటూ గుర్తుపట్టగలగడం తల్లిదండ్రులనుండి ఈ కవయిత్రి సంతరించుకున్న అనిర్వచనీయమైన వో అనుభూతి కావచ్చు. లేదా తాను నడచిన విద్యార్ది జీవితానుభవం కావచ్చు.
పూర్తిగా »

తాత్వికాన్వేషణ దిశగా సాగిన “అసంపూర్ణ” కవిత్వం

తాత్వికాన్వేషణ దిశగా సాగిన “అసంపూర్ణ” కవిత్వం

జీవితంపట్ల, సమాజంపట్ల ఒక విశ్వాసం,నమ్మకం ఉన్న కవి జీవితానుభవం సంతరించుకునే కొద్దీ ప్రాణభూతమైన లక్షణంగా జీవద్భాషను ఉపయోగిస్తూ తనవే ఐన గాఢ తాత్వికభావాల్ని వెల్లడిస్తూపోతూంటాడు. కవిత్వ రహస్యాన్ని పట్టుకుని పాఠకుల హృదయాల్లోకి జొరబడుతూంటాడు. తాత్విక పునాదిని భద్రపరచుకుంటూ, సామాజిక స్పృహతో, ఆత్మస్పృహతో, సాహిత్య స్పృహను కట్టుదిట్టం చేసుకుంటూ, కవిత్వంలో ప్రజ్ఞత, రసజ్ఞత, విజ్ఞతను ముప్పిరిగొల్పే విధంగా పెనవేసుకుంటూ, కవిత్వమై ప్రవహిస్తున్న కవి రామా చంద్రమౌళి. ఈయన ఇటీవల వెలువరించిన కవితాసంపుటి “అసంపూర్ణ” చదివినప్పుడు పైవిషయాలన్నీ కనిపిస్తాయి. కవి ఆశించిన విలువలపట్ల పాఠకలోకంలో ఏ ‘ఇజం’ ప్రత్యేకించి కనబడదు. అభ్యుదయ దృక్పథంతో మానవత్వాన్ని ఊతంగా చేసుకుని గమ్యం వైపుకు సాగిపోతున్న కలం వీరిది. కవిత్వం ఒక సామాజిక…
పూర్తిగా »

నిశ్శబ్దాంకురం

నిశ్శబ్దాంకురం

లోన… ఉడికేదంతా ఉడుకనిద్దాం
తెర్లేదాన్నంతా తెర్లనిద్దాం
చిట్లి శిలగా మారేదాన్ని మారనిద్దాం!
చేతనావర్తన జాలుగా జారుతూ
ప్రాణ సారాన్ని అద్దుకుంటూ
గబ్బెడు నెత్తుటి కబుర్లుగానో
దోసెడు ఆనందపు జల్లులుగానో
ఉత్తేజితమై కురుస్తూ
మౌనంగా మూసివున్న మూకుడ్ని
పై కెగతన్నుతూ
భావనా యుతభాషగా పొంగిపొర్లుతూ
వొ అనుభవ సారాన్ని మనదైనముద్రగా
బయటకు తెచ్చే అంతరంగ ఉద్దీపకంగా!…
నేటి ధ్వంస యానంలో
కన్నీటి ప్రయాణంలో
చేరాల్సిన తీరాల్ని పసిగడుతూ
జీవించేందుకు మిగిలించేదేదో చెబుతూ
ఏకాకితనాన్ని సామూహికం చేస్తూ
వ్యవస్థీకృత చాదస్తపు బందిఖానాను బద్దలుకొడుతూపూర్తిగా »

ఎప్పటికీ కొత్తగానిది

హృదయాంతరంగంలోకి
నిన్నెత్తుకోంది,నీతో మొత్తుకోంది,నిన్నత్తుకోంది
ఏ గమ్యమూ చేరలేను! జీవనసారాన్ని స్పృశించలేను!

నీతో విసిగివేసారి
దిగాలుపడి కూర్చునప్పుడల్లా
మనసును మేఘావృతం చేసి
కన్నీటి బిందువై వడుస్తూ,…మనోభారాన్నిదింపుతూ…
నీకు నాకు వో అలౌకిక బంధాన్ని పెనవేస్తుంటావ్!

నిన్ను వదిలించుకోవాలని విదిలించుకుంటుటానా!
ఆనందం రాలిపోతుంటుందేగాని
నీవు మాత్రం వెన్నంటే వుంటుంటావ్!

ఆత్మజులనుకున్న వారు
ఎందరు వదిలిపెట్టి వెళ్లినా
నీవు మాత్రం విడిచిపెట్టని వో సహచరివై
నా కూడా నడుస్తుంటావ్! నాలోకి వడుస్తుంటావ్.

నమ్మకం దిశగా వో అనంత విశ్వాసాన్ని నిర్మించుకునే
వో ఆలంబనంగా నీలో నన్ను పుటమేసుకోంది,
శుద్ది చేసుకోంది, అహంకారంలోంచిపూర్తిగా »