‘ కోడూరి విజయకుమార్ ’ రచనలు

కులం లక్ష్మణ రేఖ రహస్యం విప్పిన పద్యం

కులం లక్ష్మణ రేఖ రహస్యం విప్పిన పద్యం

జీవితం లోని తీరిక సమయాలలోని వ్యాపకంలానో, లేక, వ్యక్తిగత విషాదాలను గానం చేసుకునే వాహిక లానో, కవిత్వాన్ని స్వీకరించిన వాళ్లకు, సమాజంలో తన చుట్టూ వున్న సంక్షోభాలను, అసమానతలను, అవకతవకలను పలికిన కవిత్వం పెద్దగా నచ్చక పోవొచ్చు. ఆ మాటకొస్తే, అసలది కవిత్వమే కాదని దబాయించనూ వొచ్చు ! కానీ, కవి సున్నిత మనస్కుడైన మనిషి కదా ! తన లోపలి ప్రపంచపు సంక్షోభాలని గానం చేసే కవి, తన బయటి ప్రపంచపు సంక్షోభాలని గానం చేయకుండా ఎట్లా వుండగలడు ? ‘కవిత్వ కళ ‘ నిర్దేశించిన కొన్ని ప్రమాణాలు తక్కువైనాయని పండితులు హాహాకారాలు చేసినా సరే – ఆగ్రహ ప్రకటన చేయకుండా ఎట్లా వుండగలడు…
పూర్తిగా »

జీవితం… తిరిగి మొదలు పెట్టవలసిన పద్యం!

జీవితం… తిరిగి మొదలు పెట్టవలసిన పద్యం!

తప్పిపోతాం మనం. లోకం లోకి వొచ్చి, అమ్మ చేతి గోరుముద్దల కాలం దాటి, ఇంటి నుండి విశాల వీధుల లోకి అడుగు పెట్టాక, మన చిన్నప్పటి అమాయక వెన్నెల నవ్వులని, ఎదురుపడిన మనిషిలోకి అట్లా అనాయాసంగా వెళ్లిపోగలిగిన స్వచ్చ అద్దం లాంటి మనసున్న అప్పటి రోజులని కాలగమనంలో మనకు తెలీకుండానే పోగొట్టుకుంటాం!

ఇక అక్కడి నుండీ మనం ఎట్లా మారిపోతాము? కరచాలనం దాకా వొచ్చిన మనిషి కూడా మనల్ని కదిలించడు. ఎదురయ్యే ఏ దృశ్యమూ మనల్ని అబ్బుర పరచదు. రోజులు గడిచే కొద్దీ మనం చాలా ముందుకు వెళ్ళి పోతున్నామన్న ఒక భ్రమ ఏదో మనల్ని ఆవరించి వుంటుంది గానీ, మనల్ని మనం సజీవంగానే ఒక…
పూర్తిగా »

ముంజేతిపై వాలిన సీతాకోక చిలుక

సెప్టెంబర్ 2014


ముంజేతిపై వాలిన సీతాకోక చిలుక

చిన్నప్పటి అమాయకపు కలల ప్రపంచాలనూ, ప్రేమించిన మనుషులనూ, ప్రోది చేసుకున్న విశ్వాసాలనూ, ఒక్కటొక్కటే పోగొట్టుకుని, జీవితమొక నిస్సార ప్రయాణం గా మారిపోయిన తరుణంలో నీ ఎదుట వాలిన రంగుల సీతాకోక చిలుకని చూస్తే నీకేమనిపిస్తుంది ?

బహుశా, నిన్ను విడిచి ఏ దిగంతాలకావలకో వెళ్ళిపోయిన నీ మనిషి ‘నా కొరకు విలపించ వలదు’ అంటూ నీకై పంపిన కుశల సందేశమేమో?

ఈ నల్లని విషాద రూపాన్ని విడిచి రాగలిగితే వన్నెల రూపం ఒకటి నీ కోసం వేచి వుంటుందనీ, ఆ రూపాన్ని స్వప్నిస్తూ సాగమనీ వర్ణమయ ప్రకృతి, ఆ సీతాకోకని నీ ముందు అలా నిలిపిందేమో?

ఒక సీతాకోక చిలుక తన ముందు వాలగానే, అనాదిగా…
పూర్తిగా »

దుఃఖ రహస్యం విప్పిన తాత్విక కవి పద్యం ఒకటి!

దుఃఖ రహస్యం విప్పిన తాత్విక కవి పద్యం ఒకటి!

పురాణ గాథ లాంటి కథ ఒకటి ప్రచారంలో వుంది. ఒకనాడు అక్బర్ చక్రవర్తి తన ఆస్థాన సంగీత విద్వాంసుడు తాన్ సేన్ ని ‘దీపక్’ రాగాన్ని ఆలపించమని కోరాడు. తాన్ సేన్ రాగాలాపనతో ఆస్థానం లోని దీపాలు వాటంతట అవే వెలిగాయి. రాగాలాపనతో తాన్ సేన్ శరీరం అంతా ఎంతగా కాలిపోయిందంటే, అతడిని వెంటనే దాపునే వున్న నది దగ్గరకు తీసుకు వెళ్ళారు. అయినా లాభం లేకపోయింది. నది లోని నీళ్ళు వేడెక్కి పోయాయి. ఇక చావు తప్ప మరొక దారి లేదనుకున్న సమయం లో ఇద్దరు అక్కచెల్లెళ్ళు ‘మల్హర్ ‘ రాగం ఆలపించారు. ఆ అక్కచెల్లెళ్ళు ఆలపించిన మల్హర్ రాగానికి ఒక్క సారిగా వర్షం…
పూర్తిగా »

“కాలీ దునియాఁ” ని నిలదీసిన కవిత్వం

“కాలీ దునియాఁ” ని నిలదీసిన కవిత్వం

‘కవిత్వం వేరే ఎక్కడో లేదు / నిస్సహాయుడు నిరాయుధుడైన ఒక గిరిజనుడు లేదా / ఒక దళితుడు మాట్లాడేదంతా కవిత్వమే’ అన్నాడు అజంతా. బహుశా ఆయన బతికి వుండి వుంటే, ‘మరీ ముఖ్యంగా, మతోన్మాదుల దాడిలో గాయపడిన ఒక ముస్లిం స్త్రీ ‘ అని కూడా చెప్పేవాడేమో!

‘జాతీయ వాదం’ అంటే ‘హిందూ మత వాదం’ గా మారిపోయిన దేశంలో, పొరుగున వున్న పాకిస్థాన్ ని శత్రుదేశం గా చూడడం మొదలు పెట్టిన నాడే ఈ నేల మీద ముస్లిముల్ని ఆ శత్రుదేశపు ప్రతినిధులుగా, ఎప్పటికైనా అక్కడి నేలకు తరిమి వేయవలసిన ఒక పర జాతిగా చిత్రించడం మొదలయింది. సమాధులలో గతించిన చరిత్రను తవ్వి పోసి,…
పూర్తిగా »

చివరి పద్యం చెప్పకనే పోతామే ‘మో’ ?!

చివరి పద్యం చెప్పకనే పోతామే ‘మో’ ?!

లోకం లోని దుఃఖాన్ని, లోకుల ఆగ్రహాన్నీ పద్యం గానం చేస్తుందనీ, లోకం వేదనలకు పద్యమొక ముక్తిదాయని అనీ… ఇలా ఏమేమో చెప్పారు గానీ, పద్య రచనకు ఉపక్రమించినపుడు కదా సత్యమేదో కవి కళ్ళ ముందు నగ్నంగా కదలాడేది !

అప్పుడు కదా కవి గ్రహించేది, తన లోపల్లోపల సుడులు సుడులుగా తిరుగుతోన్న కొన్ని చింతనా శకలాలని దోసిట్లో పట్టుకుని ఒక చీకటి సొరంగం లోపల ప్రయాణానికై ఒక నిస్సహాయుడిలా బిక్కు బిక్కుమంటూ ఆ సొరంగము ఎదుట తాను నిలబడినానని!

కవీ, ఎలాంటి స్థితి అది ?

ఆ స్థితి ఎలాంటిదో తెలుసుకోవడానికి ఒక సాధారణ కవి దగ్గరికి వెళ్లగలమా? బహుశా, దీనినొక గంభీరమైన అంశంగా మార్చి…
పూర్తిగా »

మన చెవుల ముందు మోగుతోన్న డప్పు – సతీష్ చందర్ ‘ఒక జననం వాయిదా’

మన చెవుల ముందు మోగుతోన్న డప్పు – సతీష్ చందర్ ‘ఒక జననం వాయిదా’

‘కులం’ అనే మాటకు, ముఖ్యంగా ‘అంటరాని కులం’ అనే మాటకు సంబంధించిన స్పృహ నా జీవితంలో ఎప్పుడు కలిగింది అని తవ్వుకుంటూ వెళితే, నా చిన్నతనం లోని రెండు సంఘటనలు జ్ఞాపకం వొస్తాయి.

మొదటి సంఘటన జరిగినపుడు నేను మూడో తరగతిలో వున్న జ్ఞాపకం!

నాకు పదిహేనేళ్ళ వయసు వొచ్చే వరకు, వరంగల్ లోని రైల్వే గేటు అవతల వుండేవాళ్ళం. మేముండే ఏరియా దాటి ముందుకు వెళితే, అక్కడొక హరిజన వాడ వుండేది. అప్పుడు మా తాతమ్మ (నాన్న వాళ్ళ అమ్మమ్మ, ‘వెంకమ్మ’) ఇంటి దగ్గర గారెల్లాంటివి చేసి అమ్మేది. చిన్న దుకాణం కావడం వలన అటుగా వెళ్ళే వాళ్ళు మంచి నీళ్ళ కోసం మా…
పూర్తిగా »

‘తుమ్మెద’ కు కృతజ్ఞతలు స్మైల్ !

‘తుమ్మెద’ కు కృతజ్ఞతలు స్మైల్ !

ఇంట్లో ఆడుకోవడానికి చిన్న తనంలో నాకు మా నాన్న కొని తెచ్చిన బొమ్మలు, ఒక రెండు గుర్తున్నాయి. ఒకటి, కీ తిప్పితే పరుగు తీసే కారు, రెండవది నెంబరు బిళ్ళల్ని అటూ యిటూ తిప్పుతూ ఆడుకునే ఒక పజిల్. నా తరువాత నలుగురు చెల్లెళ్లకి ఈ పాటి అదృష్టం కూడా లేకపోయింది.

సరే… ఆటలు ఇంటిలోకన్నా బయటే ఎక్కువగా ఆడుకునే వీలున్న ఆ రోజుల్లో, ఊరిలో గడిపిన అదృష్టం వలన ఆ లోటు ఎన్నడూ పెద్దగా తెలియలేదు.

అలా బయట ఆడుకున్న ఆటలలో నలుగురు స్నేహితులతో కలిసి ఆడే దాగుడు మూతలు, కబడ్డీ, చిర్ర -గొనె (బిళ్ళంగోడు) లాంటి ఆటలు కాక, చిన్నతనంలో నేను ఒంటరిగా…
పూర్తిగా »

వలను ప్రేమించిన స్త్రీల వేదన -నిర్మల పద్యం

సెప్టెంబర్ 2013


వలను ప్రేమించిన స్త్రీల వేదన -నిర్మల పద్యం

మొగుడి పనులతో, పిల్లల పనులతో, ఇంటి పనితో సతమతమయ్యే స్త్రీ కోరుకునేదేమిటి?
ఒక పలకరింపు … మరి కాస్త ముందుకు వెళ్లి చెప్పాలంటే, ‘ఒక తల్లి పలకరింపు లాంటి పలకరింపు’
తన లోని బాల్యాన్ని తట్టి లేపే ఒక మృదువైన పలకరింపు ….

మరి, కూతురి ఇంటికి ఎపుడో ఒక సారి చుట్టపు చూపుగా వొచ్చే తల్లి కూడా, ఆ స్త్రీ ‘గృహిణీత్వం’ పైనే ప్రశ్నల పరంపరని సంధిస్తే ఆ స్త్రీ వేదన ఇంకెంత భారంగా వుంటుందో మీ అనుభవం లోకి రావాలంటే, కొండేపూడి నిర్మల రాసిన ‘వలను ప్రేమించే పిట్టల జాబితా’ ఒక సారి చదవండి …

అప్పుడెప్పుడో ‘రేవతీ దేవి’…
పూర్తిగా »

ఆమె సమయాలు

ఆమె సమయాలు

1
బట్టల షాపులో నేల మీద పరచిన
మెత్తని పరుపుపై కూర్చుని ఆమె నింపాదిగా
ఒక్కొక్క చీరనీ వేళ్ళ మీదగా తెరుస్తోంది
ఇవతల గడియారపు రెండు ముళ్ళ నడుమ
చిక్కుకుపోయి ఒకింత చీకాకుతో నేను

నేల పచ్చదనాన్ని అద్దుకున్న చీర
నీలాకాశపు సౌందర్యం నింపుకున్న చీర
పౌర్ణమి రాత్రి నక్షత్ర కాంతులతో మెరిసే చీర
రంగుల సీతాకోకలు కొలువైన చీర
సప్త వర్ణాల ఇంద్రధనుసు విరిసిన చీర

వేళ్ళ మీదుగా తెరిచిన ఒక్కొక్క చీర
అంచునీ అలా భుజం పైన కప్పుకుంటూ
ప్రశంస కోసమో, అభిప్రాయం కోసమో అర్థం కానిపూర్తిగా »