‘ చాంద్ ’ రచనలు

ఓ మూడు…

అక్టోబర్ 2014


ఓ మూడు…

1. రహస్యం

దేహాలు పెనవేసుకున్నపుడు
ఒకర్నొకరు గెలిచామని
అనుకోవడం తప్ప ఏముంది?

అంటుకట్టకుండా
తీగలు కలిస్తే ఏం లాభం

నువ్వు నాలో నేను నీలో
పూలు పూసేది ఇంకెప్పుడు?

***

ఒక్కసారైనా ఇలా కలుద్దాం.
దేహాల లోపల దాగున్న వివస్త్ర
శరీరాలను దాహం తీర్చుకోమని
ఒకరిలోకి ఒకర్ని ఒంపుకుందాం.

నగ్నమైన నీ మనసే కదూ
నన్నింతగా మోహపరిచేది?

***

మనసులు పెనవేసుకున్నపుడు
కొంత వెన్నెల పుడుతుంది
సరిగ్గా మన జీవితానికి సరిపడేంత.

2. నీ కోసం

మనసెలా ఉందని నిన్నడిగి
ఏమీ రాయలేను నేనిపుడు

నువ్వెపుడూ
ఎర్రని అక్షరాలన్నీ…
పూర్తిగా »

నిద్ర

జూన్ 2014


నిద్ర

నువ్వు నిద్రించక చాలా కాలమయ్యింది కదూ

ఒక శరీరం నీ మీద కప్పబడినప్పుడు
అలిసిపోయిన రెప్పల వెనుక
నువ్వెంత కాలం మెలుకువగా ఉంటావు

***

దోసిళ్ళతో వెలుగు పువ్వులను పట్టుకొని
కొన్ని నవ్వులను బాల్యం నుండి పిండుకొని
తెల్లని కడిగిన కళ్ళతో నువ్వు ప్రకాశిస్తూ

ఏదో ఒక దుప్పటి క్రింద కాదు
నువ్వు అపరిమితంగా ఆ చల్లని గాలిలా వ్యాపించి
వెన్నలవై రాత్రి మీద నిద్రించు

***

గాలి తాకిడికే తేరి చూచే కన్నులు
నిదురించేదేపుడు కలలు కనేదెపుడు

విడుస్తున్న శ్వాసలో నీది కానిది వదులుతూ
నీలో ఒక శూన్యాన్ని పాన్పుగా పరుచుకో

***


పూర్తిగా »

ప్రయాణం

మే 2014


ప్రయాణం

రెండు శ్వాసల మద్య వంతెనలా
అడుగులను పేర్చుకుంటూ సాగిపోవాలి
తెలియని దూరాన్ని
ఆలోచనకు అందినంత కొలుచుకొని
అలిసిపోతే వెనుక పోగేసుకున్న
జ్ఞాపకాలతో మనసు తడుపుకొని
చుట్టూ చీకటిలో నీలో దీపాన్ని
ఆరిపోకుండా జాగ్రత్తపడాలి

***

వద్దనుకున్నా పులుముకున్న రంగులను
అప్పుడప్పుడూ కన్నీటితో కడుక్కుంటూ
నిన్ను నిన్నుగా చూసుకునేందుకు
గుండెల్లో ఒక అద్దాన్ని దాచుకోవాలి
తీపో, కారమో ఏ రుచీ నీ దారిలో
కడదాకా కొనసాగాదని సర్దిచెప్పుకుంటూ
ఎడారిలో నీళ్ళ కోసం కాదు
దప్పికను ఒర్చుకోవడం నేర్చుకోవాలి

***

ఎన్నో అడుగులు నీతో జత కలిసి

పూర్తిగా »