‘ జి.ఎస్.లక్ష్మి ’ రచనలు

ఇప్పుడైనా చెప్పనీయమ్మా…

ఆగస్ట్ 2014


ఇప్పుడైనా చెప్పనీయమ్మా…

“ఈరోజు ఇంతటి గురుతరమైన బాధ్యత, యింతటి గౌరవించదగిన ఉద్యోగం నాకు లభించిందంటే దానికి ముఖ్యకారణం మా అమ్మగారు. ఆవిడ కడుపున పుట్టడం నా అదృష్ట మయితే, ఆవిడ ప్రవర్తన నాకు స్ఫూర్తి అయింది.” టీవీ ముందు కూర్చుని, కొడుకు యిస్తున్న ఇంటర్వ్యూ చూస్తున్న శంకర్రావు, పార్వతి ముందుకువంగి యింకాస్త శ్రధ్ధగా వినసాగారు.

   అమెరికాలో ఒక పెద్ద సాఫ్ట్ వేర్ సంస్థకి సీ.ఈ.వో.గా ఎంపికయిన విజయ్ హుందాగా కూర్చుని యాంకర్ అడుగుతున్న ప్రశ్నలకి సమాధానాలిస్తున్నాడు. నలభై అయిదేళ్ళ విజయ్ పరిపూర్ణ వ్యక్తిత్వంతో ఆ ఫ్లడ్‍లైట్లముందు వెలిగిపోతున్నాడు. అమెరికాలో ప్రముఖసంస్థల జాబితాలో మొదటి నాలుగుస్థానాల్లో నిలబడే ఆ…
పూర్తిగా »

సంసారంలో సంగీతం…

డిసెంబర్ 2013


సంసారంలో సంగీతం…

ఆఫీస్ నుండి వస్తూ ఇంట్లోకి అడుగు పెట్టగానే రఘుపతికి కమ్మటి పాప్ కారన్ చేసేటప్పుడు వచ్చే ఘుమఘుమ సాదరంగా ఆహ్వానం పలికింది. ఒక్కసారిగా అమందానంద కందళిత హృదయారవిందు డయిపోయాడతను. పాప్ కార్న్ అంటే అంత ఇష్టం అతనికి మరి. అందులోనూ ఈమధ్య ఇన్ స్టెంట్ పేకట్లు వచ్చేక అది చేసుకోవడం మరీ తేలికయిపోయింది. మైక్రోవేవ్ వుంటే వాటి రుచింక మరీ చెప్పక్కర్లేనంత బాగుంటుంది. కాని రఘు భార్య రమ అస్తమానం పాప్  కార్న్ చెయ్యదు. ఇంటి నిర్వహణ బాధ్యతంతా సమర్ధవంతంగా నడిపిస్తున్న రమకి అన్నన్ని డబ్బులు పెట్టి ఆ పేకట్లు కొనడం శుధ్ధ డబ్బు దండగని కొనదు. రఘుకి ఇష్టం కనక నెలకొక్కసారి మటుకు అతనికి…
పూర్తిగా »