‘ తృష్ణ ’ రచనలు

ఇస్ మోడ్ సే జాతే హై..

మే 2013


ఇస్ మోడ్ సే జాతే హై..

इस मोड़ से जाते हैं

విడుదలౌతూనే వివాదాల్లో చిక్కుకున్న సంచలనాత్మక చిత్రం, గుల్జార్ దర్శకత్వం వహించిన “ఆంధీ(1975)”. వివాదాల సంగతి పక్కన పెడితే ఈ చిత్రంలో గుల్జార్ రాసిన నాలుగు పాటల్లో మూడుపాటలు క్లాసిక్స్ గా సంగీతప్రియులందరిచే ఈనాటికీ పరిగణించబడతాయి. “తేరే బినా జిందగీ సే కోయీ..” నా ఆల్ టైమ్ ఫేవొరేట్. ఎన్ని వందల పాటలు నచ్చినవి ఉన్నా.. నా మనసు ఈ పాట దగ్గరే నిలబడిపోతుంది. ఆ తర్వాత “తుమ్ ఆగయే తో నూర్ ఆగయా హై..” కూడా మరువలేని సాహిత్యమే. అయితే ఈ రెండూ స్ట్రెయిట్ లిరిక్స్. “ఇస్ మోడ్ సే జాతే హై..” అనే మూడో పాట లోతైన…
పూర్తిగా »

ప్రేమను ప్రేమగానే ఉండనీ.. ఏ పేరునీ ఆపాదించకు

ఏప్రిల్ 2013


ప్రేమను ప్రేమగానే ఉండనీ.. ఏ పేరునీ ఆపాదించకు

అశుతోష్ ముఖర్జీ రాసిన “నర్స్ మిత్ర” అనే బెంగాలి కథను 1959లో దర్శకుడు అసిత్ సేన్ “Deep jwele jaai” పేరుతో బెంగాలి సినిమాగా తీసారు. “సుచిత్రా సేన్” నాయిక. అదే చిత్రాన్ని 1969లో “ఖామోషీ” పేరుతో అసిత్ సేన్ హిందీలో రీమేక్ చేసారు. వహీదారెహ్మాన్, రాజేష్ ఖన్నా ముఖ్య పాత్రల్లో నటించారు…లేదు లేదు జీవించారు. ఇదే సినిమాను తెలుగులో 1960లోనే “చివరకు మిగిలేది” పేరుతో “గుత్తా రామినీడు” గారు తీశారు. ఇందులో నాయిక పాత్రను బెంగాలీ, హిందీ నటీమణులకన్నా మన సావిత్రి అత్యద్భుతంగా పోషించిందని అంతా అంటారు. ప్రియురాలికి దూరమై మానసికరోగిగా మారిన ఒక ప్రముఖ రచయితను ఒక నర్స్ ఎలా మామూలు మనిషిగా…
పూర్తిగా »

నీవు లేని పగళ్ళలో సంచారిని!

మార్చి 2013


నీవు లేని పగళ్ళలో సంచారిని!

పురస్కారాలు అందుకోకపోయినా, కొన్ని పాటలు ఎంతో ఖ్యాతిని సంపాదించేసుకుని సంగీతప్రియుల పెదాలపై ఎప్పుడూ నాట్యం చేస్తూ ఉంటాయి. అటువంటి పాటల్లో ఒకటి “ముకద్దర్ కా సికందర్“(1978) సినిమాలోని “ओ साथी रे..” పాట. అమితాబ్ బచ్చన్ సినిమాల్లో “షోలే” తరువాత అత్యంత జనాదరణ పొందిన సినిమా ఇది. చిత్రంలో “సలామే ఇష్క్ మేరీ జా”, “దిల్ తో హై దిల్”, “రోతే హుయే ఆతే హై సబ్” మొదలైన మిగతా పాటలన్నీ బహుళజనాదరణ పొందినవే. ప్రేమనీ, ఆవేదననీ, ఆర్ద్రతనీ కలగలుపుకున్న “ओ साथी रे..” పాట మాత్రం ఆణిముత్యమనే చెప్పాలి. అమితాబ్ కి ఎన్నో హిట్ సాంగ్స్ ని రాసిన గీత రచయిత “అంజాన్” ఈ…
పూర్తిగా »

మనసేదో అందా…? ..ఏమీ లేదు..

ఫిబ్రవరి 2013


మనసేదో అందా…? ..ఏమీ లేదు..

సామాజిక సినిమాలు నేర్పుగా తీయటంలో నిష్ణాతుడైన “హృషీకేశ్ ముఖర్జీ” చేతుల్లో అందంగా ముస్తాబైన చిత్రం “అనుపమ”. “అనుపమ” అంటే ఉపమానం లేనిది.. సాటిలేనిది.. అని అర్థం. అటువంటి అనుపమానమైన పాత్రలో ‘షర్మిలా టాగూర్’ని మలిచారు ముఖర్జీ. బిమల్ రాయ్ వంటి ప్రఖ్యాత దర్శకుడి వద్ద ఎడిటర్ గా, అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసిన పనితనం ఈయన సినిమాల్లో ప్రస్ఫుటంగా కనబడుతుంది.

చిత్రకథలోకి వెళ్తే అనుపమ ఒక ధనవంతుడి ఏకైక కుమార్తె. బయటవారికి ఆమె ఏ లోటు లేని రాజకుమార్తె. కానీ కుమార్తెకు జన్మనిచ్చాకే భార్య మరణించటం వల్ల కుమార్తెను దగ్గరకే రానివ్వడు ఆ తండ్రి. తండ్రి నిరాదరణకూ, కేకలకూ భయపడి నోరే తెరవకుండా పెరుగుతుంది అనుపమ.…
పూర్తిగా »

అణువు అణువుగా

జనవరి 2013


అణువు అణువుగా

మండుటెండలో తిరిగి తిరిగి దాహంతో ఉన్నప్పుడు గ్లాసుడు నీళ్ళు తాగితే ఎంత హాయిగా ఉంటుందో కొన్ని పాటలు విన్నప్పుడు అంతే హాయిగా ఉంటుంది. భాష ఏదైనా కొన్ని పాటలు వింటుంటే తెలియని ఆనందం, హాయి కలుగుతాయి మనకి. ఓ మంచి పాట మన మనసులను తాకి, వేసవిలో చల్లని పానీయం ఇచ్చినంత హాయిని ఇచ్చి మనల్ని జ్ఞాపకాల వీధుల్లో పరిగెత్తిస్తుంది. ఆనందోల్లాసాలలో డోలలాడిస్తుంది. మన మూడ్ బాలేకపొయినా ఠక్కున సరిచేసేస్తుంది. పాటలోని విచిత్రమేమిటంటే విషాదభరితమైన పాట కూడా ఒకోసారి వినటానికి హాయిగా ఉంటుంది. సాహిత్యానికి ఆ శక్తి ఉంది. అలాంటి హాయినిచ్చే కొన్ని మంచి మంచి పాటల్ని, వాటిలోని సాహిత్యాన్నీ గుర్తుచేసి, వాటి తాలూకూ చల్లదనాన్ని…
పూర్తిగా »