‘ దేశరాజు ’ రచనలు

రాత్రి ఋతువులో పరిమళించే పద్యాల తోట

జనవరి 2015


రాత్రి ఋతువులో పరిమళించే పద్యాల తోట

“I love you as certain dark things are to be loved, in secret, between the shadow and the soul.” ― Pablo Neruda

రాత్రి… కటిక ఏకాంతపు చీకటి రాత్రి… చీకటి ఒక సామూహిక స్వప్నావిష్కరణ. రాత్రి, చీకటి పెనవేసుకున్న ప్రేమ, పగ. దేనిని ఎందుకు ప్రేమించాలి? లేదా, ఎందుకు ద్వేషించాలి? అసలు, దేన్నైనా ప్రేమించే, లేదా ద్వేషించే స్వేచ్చ కవికి వుందా? రాత్రి ఆవిష్కరించిన చీకటిలో నీడల వెతుకులాట, నీడలు లేని చీకటిలో ఆత్మతో సంభాషణ. ఎక్కడో కుదురుతుంది ఒక అక్షరానుబంధం! అప్పుడు ఆ అక్షరమాల కోడూరి విజయకుమార్ కవిత్వమై విచ్చుకుంటుంది. మధ్య రాత్రి, ఒక…
పూర్తిగా »

వాన పిట్ట

25 జనవరి 2013


వదలనంటుంది ఆకాశం,
కురవనంటుంది మేఘం
నావికుడా-
ఈ అమాయకపు వానిప్పుడు అవసరమా?
***
బాయ్ చెప్పడానికెత్తిన చేతిని సంగంలోనే ఆపి,
ఆఫీస్కు డుమ్మాకొడతానేమోనని..
చూపులు మిటకరిస్తూ
గేటు మీద వాల్తాయి రెండు పిట్టలు
నావికుడా-
పెనుగులాట వారిది మాత్రమేనా?
***
చూస్తుండగానే, నల్లమబ్బులు కమ్మేస్తాయి
జీవితపు రిమోట్ను సెకన్ల ముల్లుకు తాకట్టుపెట్టే
హృదయ స్పందనలను దేంతో కొలవాలని?
***
తడిసిన చూపుల్తో పిట్టలు
ముడుచుకుని లోపలకు జరుగుతాయ్
ఉసురు మాత్రం ముసురై..
ఏ ఫ్లైఓవర్ పైనో నిన్ను నిలువునా…
పూర్తిగా »