‘ నాగరాజు రవీందర్ ’ రచనలు

మంకుతిమ్మ కగ్గ

ఫిబ్రవరి 2018


కన్నడ సాహిత్య చరిత్రలో ఒక గొప్ప రచన మంకుతిమ్మ కగ్గ. దీనిని దేవనహళ్ళి వేంకటరమణయ్య గుండప్ప (డి.వి.గుండప్ప) అనే ఆయన 1943లో వ్రాశాడు. మంకుతిమ్మ కగ్గ అంటే ‘మందమతి తిమ్మడి వెఱ్ఱిమాటలు’ అని అర్థం. ఇది నాలుగు పాదాలు కలిగిన 945 పద్యాల సమాహారం. వీటిలో అక్కడక్కడా ప్రాచీన కన్నడ భాష కనిపిస్తుంది. కొన్నింటిలో కవిత్వపు ఛాయలు గోచరిస్తాయి. లోతైన భావాలు కలిగి, కొన్ని పాడడానికి అనువుగా ఉంటాయి.

రచయిత వీటిని ‘మందమతి మాటలు’ అని చెప్పుకున్నా, ఇందులో గొప్ప జీవితానుభవాలు ఇమిడి ఉన్నాయి. జీవితానికి సంబంధించిన ప్రశ్నలతో, వాటి ద్వారా ‘సత్య దర్శనము ‘ చేయిస్తూ మారుతున్న దేశకాల పరిస్ఠితుల కనుగుణంగా మానవులు ఎలా…
పూర్తిగా »

షికారి

గప్పుడు పొద్దుగూకి నాలుగొట్టిండ్రు కావచ్చు. నేను గప్పుడే బడి కాడ్నించి అచ్చిన. బాపు కుక్కి మంచంల కూకోని ఏందొ ఆలోచన జేత్తండు. అమ్మ అంటింట్ల యేదొ సగవెడ్తంది. శాయ్ వెడ్తున్నదో ఏందొ, గిన్నెల సప్పుడు గలగల ఇనవడ్తంది. ఇంట్ల ఎవ్వలు లేరు, మే దప్ప. అన్నలు పట్నంల సదువుకుంటున్నరు. అక్కలు పెండ్లిల్లు చేసుకోని అత్తగారింటి కాడ ఉంటున్నరు. పండ్గకో పబ్బానికో అత్తరు. గప్పుడు ఇల్లంత కలకల లాడ్తది.

నేను అంటింట్లకు అరుగు మీదికీ కోడ్రిగానోలె అటూ ఇటూ తిర్గుతన్న. నా మన్సంత ఇంటి ముందటి బజార్లనె ఉన్నది. ఎప్పుడు నా దోస్తులు రామడు , రవిగాడు, రాయేశడు అత్తరా – ఎప్పుడు ఆల్లతోని శిర్రగోనె, పెండల…
పూర్తిగా »