‘ పైడి తెరేష్ బాబు ’ రచనలు

కొత్త మట్టి లోకం…కొత్త ప్రశ్నల జననం….!

01-ఫిబ్రవరి-2013


కొత్త మట్టి లోకం…కొత్త ప్రశ్నల జననం….!

పైడి తెరేష్ బాబు…లో పైడి అంటే బంగారం. తెరేష్ అంటే ఏదో ఒక దేవుడి గారి పేరే అయి వుండొచ్చు. కానీ, పైడి తెరేష్ బాబు కవిత్వం అంటే బంగారం కాదు, మట్టి! పనిచేసేది ఆకాశవాణిలో కావచ్చు, కానీ తెరేష్ బిగి కౌగిళ్ళన్నీ నేలకి! నేలలో మెరిసే మట్టికి! కోయిలలు మాత్రమే కూసే చోట…కోయిలల్ని బహిష్కరించి కాకులకు రాజ్యం అప్పజెప్పే కవి తెరేష్. అతన్ని కేవలం కవి అందామంటే మనసొప్పదు, పోనీ కవి కాదు ఇంకేదో అందామంటే కవిహృదయం తల్లడిల్లి పోతుంది. కవిత్వానికీ, తాత్వికతకీ పెళ్లి కుదుర్చిన వాడు. తన ప్రేమకీ లోకమ్మీది ప్రేమకీ బంధం నేర్పినవాడు. తెరేష్…అంటే అరమరికలు లేని మనసు. తెరమరికలు లేని…
పూర్తిగా »

తమకు తెలియని ధర్మమే … ధర్మరాజా !!!

నిజం మాట్లాడే వారిని నిజమే మాట్లాడనివ్వండి
- సోక్రటీస్

నిజం చెప్పు తెరేష్
నీకోసం ఈలోకం
ఎన్ని నీతినియమాలు విధించిందీ
ఎన్ని కట్టుబాట్లు రచించిందీ
అయినా సరే
నీతుల కంచెలు దాటి నిషిద్ధ ఫలాన్ని తిన్నావు కదూ
నియమాల గోడలు దూకి నిశీధితో రమించావు కదూ

నిజం చెప్పు తెరేష్
నీ గుండె నిజం గా నిముషానికి
డెబ్భై రెండుసార్లే కొట్టుకుంటుందా
నీ రక్తపోటు అంకెలు స్థాయీ భేదాలు ఎరుగవా
నీ నోట్లో ఊరే లాలాజలం
నీ కొలెస్టరాల్ శాతాన్ని ఎప్పుడూ పెంచలేదా

నిజం చెప్పు తెరేష్

పూర్తిగా »