‘ ప్రసాదమూర్తి ’ రచనలు

సమాజాన్ని కవిత్వాన్ని వేరు చేసి చూడ్డం నాకిష్టం వుండదు. – డా. ప్రసాద మూర్తి

డిసెంబర్ 2015


సమాజాన్ని కవిత్వాన్ని వేరు చేసి చూడ్డం నాకిష్టం వుండదు. – డా. ప్రసాద మూర్తి

అలతి అలతి పదాలతో అనల్పమైన భావప్రకటన అతని సొత్తు. “మాట్లాడు కోవాలి”, “కలనేత”, “ నాన్నచెట్టు“ ఇప్పుడు అవార్డ్ తెచ్చిన “పూలండోయ్ పూలు” అతని కవిత్వానికి చిరునామాలు. వస్తువేదైనా అనుగుణమైన భావాన్ని అద్భుతంగా పొదగగల నైపుణ్యం, చదువరులకు హత్తుకునేలా సమకాలీన సమస్యలనూ కవితామయం చెయ్యగల నేర్పు ఉన్న డా. ప్రసాద మూర్తి గారు 2015 ఫ్రీవర్స్ ఫ్ర౦ట్ అవార్డు అందుకున్న సందర్భంగా కవిత్వం గురించి వాకిలి రెండు మాటలు మాట్లాడినప్పుడు, మనసు పరచి మనకి వినిపించిన అభిప్రాయాలు ఇవి.

Q: కవులకూ మిగతా వారికీ ఉన్న తేడా ఎలా అనిపిస్తుంది మీకు?

జ. అందరూ మనుషులే. కాకుంటే కవి చూపు మిగిలిన వారికంటే భిన్నంగా…
పూర్తిగా »

నేనూ నా పక్షులూ

8-నవంబర్-2013


నేనూ నా పక్షులూ

ఏ తిరునాళ్ళలోనో తప్పిపోయిన పిల్లల్ని
ఏళ్ళ తర్వాత కలుసుకున్నట్టుంది
నేనెవరో మర్చిపోయి చాన్నాళ్ళయ్యాక
ఇన్నాళ్ళకి ఈ పిల్లల ముఖాల్లో
నన్ను నేను చూసుకున్నట్టుంది.

వాళ్ళను చూసిన క్షణాల్లో
జ్ఞాపకాల తూనీగలు
ఒక్కసారిగా నామీద దాడిచేశాయి
నవోదయ తోటలో పక్షుల్ని
ఒళ్ళంతా వేళ్ళాడేసుకుని కదిలేవాడిని
పాఠాలు ఏం చెప్పానో కానీ
ఆ పిట్లల పాటల పరిమళం దమ్ములాగుతూ
ఒక రౌడీచెట్టులా కొమ్మలెగరేసుకుంటూ తిరిగేవాడిని

ఇన్నాళ్ళ తర్వాత ఇన్నేళ్ళ తర్వాత
గుండె ఆల్బం దుమ్ము దులిపాను

నేనో పిల్లలో..పిల్లల్లో నేనో
నాలో పిల్లలో..
ఒక్కో బొమ్మా
నా…
పూర్తిగా »