‘ మండవ సుబ్బారావు ’ రచనలు

కథా రచనకు పురి గొలిపే ‘కథనశాల’

ఫిబ్రవరి-2014


కథా రచనకు పురి గొలిపే ‘కథనశాల’

(‘కథనశాల’ ప్రత్యేక సంచిక సమీక్ష)

సాహితీ స్రవంతి చేసిన మరో నూతన ప్రయత్నమే “కథనశాల” ప్రత్యేక సంచిక.29 అక్టోబర్ 2013 హైదరాబాదు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉదయం గం.10 లనుండి సాయంత్రం ఆరు గంటల వరకు కథా కార్యశాల నిర్వహించి వివిధ కథాంశలపై ప్రముఖ కథా రచయితలు రచయిత్రులచే ఔత్సాహికులు,నూతన రచయితల కోసం రచన శిల్పం మెళుకువల గురించి చెప్పించడం జరిగింది.సుమారు రెండు వందల మంది పాల్గొని కథలు రాయడం నేర్చుకున్నారు.ఈక్రమంలో సేకరించిన ప్రముఖ కథా రచయితల ఆభిప్రాయాలు, స్వీయ కథల నేపధ్యాలు స్పందనలు మొదటి తరం కథకుల కథా సూత్రాలు కలిపి ఈ ప్రత్యేక సంచిక తీసుకురావడం జరిగింది. గతంలోనూ ప్రస్థానం ప్రచురించిన ప్రత్యేక…
పూర్తిగా »

కిడ్కి

అక్టోబర్ 2013


ఒకప్పుడు కిడ్కి
ఒక సుందర స్వప్నం
పడమట గాలి, పైర గాలి
పహారీ కాస్తుండేవి.
వసంత గానం,సుగంధ పరిమళం
నట్టింటిలో షికార్లు చేస్తుండేవి.
చాంద్ కీ తుక్డా
గోడకు కిడ్కి.

ఇప్పుడు,
కిడ్కి లెక్క కోసం
కిడ్కికి వేలాడే పరదా
మన సరదాలకు గురుతు
దర్పానికి నిలువుటద్దం
ఇప్పుడు కిడ్కిలు మూసుకున్నాయి
మన మనస్సుల్లా!


పూర్తిగా »

పని అంటే ఏమిటి?

09-ఆగస్ట్-2013


పని అంటే ఏమిటి?

“పని” అంటే ఏమిటి? ఇదీ ఓ ప్రశ్నేనా “అనే సందేహం కలగడం సహజం.కానీ, పని గురించి మనకు చాలా విషయాలు తెలీవు.”పని”అంటే వ్యాపారం అని చెబుతుంది “శబ్ద రత్నాకరం”.వ్యాపారంలో వస్తు మార్పిడి గానీ, ద్రవ్య మార్పిడి గానీ ఉంటుంది.వ్యాపారం కానిదేదీ పని కాదు. సో..క్రియలన్నీ పనులు కావు.చేతలు కొన్ని పనులు కొన్ని.”ఏం పని చేస్తున్నావ్?” అని ఎవరైనా ప్రశ్నిస్తే—“ఏం చేయడం లేదు.పళ్లు తోము కుంటున్నాను” అని అనాలి.ఎందు కంటే పళ్ళు తోము కోవడం పని కాదు గనుక.ఎందుకు పని కాదు?ఇందు లో ఏ వ్యాపారం జరుగ లేదు గదా!నీ పళ్ళు నువ్వు తోము కుంటున్నావ్.ఇందులో వస్తు మార్పిడి గానీ,ద్రవ్య(డబ్బు) మార్పిడి గానీ జరగడం లేదు గదా.అందు…
పూర్తిగా »

స్వాగతం చెప్పవలసిందే!

కలం కన్నీరు పెట్టుకుంది.
అవును నిజమే!
కాగితం మీద తన నాట్యం ఆగి పోయిందని
కలం కన్నీరు పెట్టుకుంది.
చిట్టెలుక శరం ధరించి
గాజు తెర మీద చిందులు వేస్తుంటే
బిత్తర పోయి కలం కన్నీరు పెట్టుకుంది.
క్షరం లేదనకున్న అక్షరాలు
కాగితం మీద క్షరించి
అంతర్జాలంలో ప్రత్యక్షమైతే
కలం కన్నీరు పెట్టుకుంది.
ఆటంకం లేదనుకున్న ఘంటం
నీ రాకతో నాడు చిత్తై పోలేదా?
గతం ఎప్పుడైనా కాల గర్భంలో కలిసి పోవలసిందే
క్రొత్తకు గొంగ్రొత్తగా స్వాగతం చెప్ప వలసిందే!


పూర్తిగా »