‘ యాజి ’ రచనలు

ప్రేమలో జయం?

అక్టోబర్ 2017


అలసటా, దుఃఖం, ఆందోళనా నిండి ఉన్నా, సితార ముఖంలో అందం ఏ మాత్రం తరగలేదు. అసలు తనని అందంగా తప్ప వేరే రకంగా చూసే సామర్థ్యం నా కళ్లకి లేదేమో. స్టీరింగ్ వీల్ పైన ఉన్న నా చేతులు ఆమెని దగ్గరకు తీసుకొని ఊరడించటానికి ఉవ్విళ్లూరుతున్నాయి. తాను మాత్రం, బాహ్య ప్రపంచం పట్టని స్థితిలో కారు విండోకి తలానిచ్చి, నా వైపే చూస్తున్నట్లుగా, కూర్చుని ఉంది. సరిగ్గా ఆరు నెలల క్రితం ఇద్దరం అపరిచితులం. “యే కహా ఆ గయే హమ్?”

నేను ఒక సిలికాన్ వేలీ సక్సెస్ స్టోరీ. నా కంపెనీని అమెజాన్ కొనెయ్యటంతో, చిన్న వయస్సులోనే చాలా సంపాదించాను. నలభై అయిదేళ్ల ఎలిజిబుల్…
పూర్తిగా »

మైధిలి

ఏప్రిల్ 2013


మైధిలి

“ఏంటీ, మీ ఆవిడ కనపడ లేదు ప్రొద్దుటి నించీ? ఓ సారి చూడందే నాకు పొద్దు పోదని చెప్పరాదె”, జంకు ఛాయలు ఏ మాత్రం లేకుండా అడిగేశాడు రాణా. హద్దులు కట్టుకున్న సహనం ఒక్క సారిగా ఆవిరైపోయింది రఘులో. వెనక ఉన్న పటాలాన్ని కూడా పట్టిచ్చుకోకుండా, ఒక్క దూకుతో రాణాతో కలబడ్డాడు. ఎక్కువ సేపు పోరాటానికి ఆస్కారం లేకుండా అందరూ కలసికట్టుగా రఘూ ని చితక్కొట్టేశారు.

శరీరం పైన తగిలిన గాయాలకన్నా, మైధిలి నోట వినాల్సివచ్చే శూలాల లాంటి మాటల పోట్ల వల్ల కలగబోయే బాధను ఉహించుకుంటూ, ఆలోచనలు ఎంత వెనక్కి లాగుతున్నా, ఇంటి వైపు కాళ్ళీడ్చటం మొదలెట్టాడు రఘు.

రఘు, మైధిలి, హైదరాబాద్ వదిలి,…
పూర్తిగా »

చరిత్రహీనులు

జనవరి 2013


ఇంత ఉద్వేగాన్ని జీవితంలో ఎప్పుడూ అనుభవించలేదు, నేను. ఆవేశం, అసహాయత, ఆత్మ న్యూనత అన్నీ కలసికట్టుగా ఒకే సారి నా మస్తిష్కం లో చొరబడి నా వ్యక్తిత్వాన్నీ, నా అభిమానాన్నీ, గాయపరచి  నడి బజారులో నన్ను నిర్వస్త్రుడిగా చేసి నిలబెట్టినట్టుగా ఒక ఘాటైన భావన. “జానకి ఎందుకిలా చేసింది? ఎలా చెయ్యగలిగింది, నా జానకి?” ఇలా, ప్రశ్నలే తప్ప జవబులివ్వలేని ఉత్తరం నా ఎదురుకుండా పడి ఉంది. ఒకటా, రెండా, ఇరవయ్యేళ్ళ అనుబంధం మా ఇద్దరిదీ. తను క్యాన్సర్ తో  గత  నాలుగేళ్లగా పోరాడుతూ  అంతిమ  క్షణాలలో హాస్పిటల్ బెడ్ మీద పడి ఉందన్న విషయం కుడా మర్చి పోయేటట్లు చేసింది ఈ ఉత్తరం. ఉదయం,…
పూర్తిగా »