‘ రాజేశ్ యాళ్ల ’ రచనలు

కిటికీలోని బాల్యం

డిసెంబర్ 2014


కిటికీలోని బాల్యం

వెలుతురూ గాలీ ధారాళంగా ఉన్న ఆ గదిలోనే గత పదేళ్ళుగా నా నివాసం! గది కిటికీ దగ్గరే ఇన్నేళ్ళుగానూ నా మకాం కూడాను. ఆ కిటికీలోనుంచి చిత్రకారుడు తీర్చిదిద్దినట్టుగా కనిపించే పచ్చిక బయలు కనువిందుగా కనిపిస్తూ ఉంటుంది. “అరణ్య ” అన్న ఈ ఎస్టేట్ కు పెట్టిన పేరును సార్థకత చేకూరుస్తూ ఏపుగా పెరిగిన చెట్లు, గుబురుగా ఉండే పొదలు ఇవన్నీ వందల అపార్ట్ మెంట్ భవనాల మధ్యలో చక్కని పచ్చదనాన్ని కళకళలాడిస్తూ ఉంటాయి.

నా భర్త చనిపోయాక నా ఒక్కగానొక్క కొడుకూ, వాడి భార్య, నేనూ అద్దె ఇంట్లో మిగిలాం. వాళ్ళిద్దరూ ఉద్యోగస్తులే కావడంతో నగరానికి చివరలో వాళ్ళకు అందుబాటు ధరలో వచ్చిందని…
పూర్తిగా »