‘ లలితా టిఎస్ ’ రచనలు

అందరాని కొమ్మ

జనవరి 2018


శ్రావణమాసం.

బెంగళూరు వర్షాల్లో తడిసి మెరిసిపోతోంది.

లేత బూడిద వర్ణపు ఆకాశం కింద పచ్చాపచ్చటి చెట్లు ఆకాశం నుంచి జలదారుల జలతారులా కురిసి ఆగిన వానలో తలారా నీళ్ళోసేసుకుని ఎర్ర తురాయి పూల చీర కట్టేసుకుని, వచ్చే పోయే వారిమీద వాననీటి జల్లులు చిలకరిస్తున్నాయి.

అప్పుడే ఆగిన బెంగళూరు నగర సారిగె సంస్థ వాహనంలోంచి దిగి చెంగున ఎగిరే జింకపిల్ల పాదాలతో తలపున మెదిలిన ఏ పాటకో తలాడిస్తూ, దానికి తనదైన పేరడీ కట్టేసుకుని పాడుకుంటూ తనలో తనే మురుస్తూ చిన్ని చిన్ని వాన చినుకుల సందడికి తన మువ్వల అలికిడి తాళం వేస్తూ భుజం మీది సంచీ సర్దుకుంటూ ఇంటి ముఖం పట్టింది మందహాసముఖి…
పూర్తిగా »