‘ వారణాసి నాగలక్ష్మి ’ రచనలు

అరుణోదయం

అరుణోదయం

ఇవాళ శని వారం. సగం రోజే పని. స్కూలు అయిపోగానే తిన్నగా ఇంటికి రాబుద్ధి కాలేదు. రమణితో కాసేపు గడపితే బావుంటుందనిపించింది. వాళ్లిల్లు అమీర్ పేట్ లో, మా బస్సు రూట్లోనే ఉంది. దారిలో దిగిపోయి వాళ్లింటికి వెళ్లాను.
పూర్తిగా »

విముక్త

విముక్త

“మామ్మగారూ! ఇంక నేను బతకడం వృధా ” అంటూ ఒక్కసారిగా ఆవిణ్ణి పట్టుకుని వల వలా ఏడ్చేశాను. ఆ క్షణంలో నాకు పరిసరాలన్నిటా నా ‘బంగా’రుకొండ, ముద్దుగా ‘బంగా’ అని మేమిద్దరం పిలుచుకునే మూడేళ్ళ బుజ్జిబాబు తప్ప ఇంకేమీ కనిపించడం మానేసింది. నేనేం చేస్తున్నానో అర్ధం కాని ఒక అయోమయం … అనుక్షణం నా కొంగు పట్టుకుని తిరుగుతూ బూరెబుగ్గలతో ముద్దులొలికిపోయే బంగా, కనిపించకుండా పోయి నాలుగ్గంటలు దాటిపోయింది. వీధి చివరి కిరాణా షాపు కెళ్లి, అక్కడున్న కూరగాయల బండి దగ్గర కూరలకోసం ఆగినప్పుడు నా కొంగు పట్టుకు నిలుచున్న బంగా అలా ఎలా మాయం అయ్యాడో నాకు అర్ధం కావడం లేదు. ఎవరో కావాలని…
పూర్తిగా »