‘ విశ్వనాథ సత్యనారాయణ ’ రచనలు

Your Chariot

Your Chariot

నీ రథము

 

ఓ ప్రభూ! నీ రథము దీక్షాప్రణీత

విధురవేగమ్ము పరువులు వెట్టుచుండె

నా శరీరమ్ము దానిక్రింద బడి నలిగి

నలిగి పోయినయది రక్త నదము లింకి.

 

దివ్యతేజోవిరాజత్త్వదీయ రథము

ఈ గతుకుడేమియనియైన  నాగలేదు

నా విరోధించిన హఠాన్నినాదమునకు

వెనుదిరిగియైన మరి జూచికొనగలేదు.

 

నాదు రక్తము నీ రథచోదకుండు

కడిగివేయును రేపు చక్రములనుండి

అచట బహుజన రక్త చిహ్నములయందు

నాదియిదని గుర్తేమికన్పడును, సామి?

 

-విశ్వనాథ సత్యనారాయణ

 

 

Your Chariot

 

Your chariot, O my Lord, is racing

With an ordained speed, uninterrupted!

This corp came under it, got crushed;…
పూర్తిగా »