‘ శ్రీశాంతి దుగ్గిరాల ’ రచనలు

బామ్మ గుట్టు

బామ్మ గుట్టు

మిట్టమధ్యాహ్నం సూరీడు నడినెత్తిన ఉండి తన ప్రతాపాన్ని చూపిస్తున్న వేళ స్కూలు వదలగానే రోడ్డు మీద పడ్డాను మాసిపోయిన యూనీఫాంతో, అవ్వాయి చెప్పులేసుకుని. ఓపక్క ఆకలి, మరోపక్క వేడెక్కిన రోడ్డుమీద నడక, ఎంత తొందరాగా ఇంటికి వెళ్ళి అన్నం తింటానా అనే తొందరలో ఉన్నాను. సరిగ్గా మా గుడి సందు దాటుతుంటే, ఎత్తరుగు మీద ఇంటి చూరు కిందగా, కాళ్ళు బారజాపుకుని చేతి కర్రతో కాకుల్ని తోలుతూ వడియాలకు కాపలాకాస్తూ కూచునుంది సిద్ధేర్వరి బామ్మ. ఆకలి వల్ల కళ్లానక ఇలావచ్చేసాను. “చచ్చానురా దేవుడా… ఉత్తపుణ్యాన బామ్మకు పలారమైపోతానే” పక్కదారిగుండా పోకుండా ఎందుకు గుడి దారిన వచ్చానురా అనుకున్నాను. నేను తనను చూడక మునుపే బామ్మ తన…
పూర్తిగా »