‘ సతీష్ పోలిశెట్టి ’ రచనలు

దత్తుడు

ఫిబ్రవరి 2017


దత్తుడు

దత్తుడు మట్టిలో కలిసిపోయాడు. భూమి మీద పడి మట్టి మీద బ్రతికినంత నిశబ్దంగానే. తరాల వారి కంగా ఒక్కటంటే ఒక్క శిలా విగ్రహం కూడా ప్రతిష్టించబడలేదు. తన గుడిసెలో ఉన్న ఆ రెండు పంచెలు, గొడ్డలి మాత్రేమే అతను మిగుల్చుకున్న జ్ఞాపకాలు.ఆరేళ్ళ వయస్సులో పోలేటి వెంకట్రావు ఇంటికి దత్తుడు కింద వచ్చాడు. పక్కూరులో ఎవడో ఎర్రోడి ఆఖరి కొడుకు. అతనికి పెంచే దిక్కులేకపోతే పోలేటి వెంకట్రావు, పోస్ట్ మాస్టారుని వెంటబెట్టుకెళ్ళి ఎంతకో కొన్నుక్కు తెచ్చుకున్నాడు. వెంకట్రావు కూడా ఏమి కలిగినోడు కాదు. నలుగురు ఆడపిల్లల తండ్రి. అతనిదీ కూలి పనే. వాళ్ళావిడ మేకల్ని మేపేది. మా ఊల్లోకి దత్తుడిని  కరణం గారి…
పూర్తిగా »

ఒల్వేరా స్ట్రీట్ పిచ్చికవి

ఒల్వేరా స్ట్రీట్ పిచ్చికవి

అమెరికా. ఒల్వేరా స్ట్రీట్. శిథిలావస్థలో ఉన్న మెట్రో ప్లాజా లాడ్జ్. గది నెంబర్ 404. పగిలిన అద్దాల కిటికీ. కొన్ని వందల సూర్యోదయాలు, సూర్యాస్తమయాలు అతను దాని గుండా చూసాడు. అలసిపోవడం తెలీని “సన్ డయల్” అతనికి బాగా తెలుసు. చిరువ్యాపారిగా జీవితం మొదలుపెట్టి ఖరీదైన కార్లలో తిరిగే స్థాయికి వచ్చిన వారినీ అతడెరుగును. ఆనందంతో ఆ వీధి గుండా చక్కర్లు కొట్టే యువతీయువకులు అతనికి తెలుసు. విషాదంతో ఆ వీధి చీకటిని పంచుకునేవాళ్ళు అతనికి తెలుసు. మౌనం అతని భాష.ఎవడు? ఎక్కడ నుంచి వచ్చాడు? ఎన్నేళ్ళుగా ఇక్కడ ఉంటున్నాడు? – లాంటి వివరాలు (ఖచ్చితంగా) చెదపురుగులు తినగా మిగిలిన రిజిస్టర్లకే తెలుసు. ఆ…
పూర్తిగా »

ఆఖరి శబ్దం

ఫిబ్రవరి 2016


ఆఖరి శబ్దం

ఇలా రాయడం నాకే ఆశ్చర్యంగా కొత్తగా కూడా ఉంది తెలుసా. నిన్న నీ ముఖాన్ని నా దోసిట్లోకి తీసుకున్నప్పుడు కూడా అదే కొత్తదనం, అదే ఆశ్చర్యం తెలుసా? చాల మారిపోయావు నువ్వు. ఒక్కపుడు నువ్వో గొప్ప అందగత్తెవి అంటే ఇప్పుడు ఎవరూ నమ్మరు తెలుసా? అంతలా మారిపోయావు అమ్మమ్మలా. నీ ఎక్ స్ట్రా పన్ను ఏమైంది? అప్పట్లో నిన్ను తెగ ఆటపట్టించేవాడిని కదూ. నువ్వు అబ్యజౌ రాక్షసి జాతికి చెందిన దానివి అందుకే నీకు ఆ ఎక్ స్ట్రా పన్ను అంటే, ఒకసారి రాత్రి నేను మంచి నిద్రలో ఉన్నపుడు నీ ముఖానికి రంగులవీ పూసుకుని నన్ను భయపెట్టాలని చూసావ్. కోపంగా నిన్ను తిట్టేసి…
పూర్తిగా »