‘ సిల్వీనా ఒకాంపో ’ రచనలు

ఆ తెల్లని ఇల్లు

ఆ తెల్లని ఇల్లు

క్రిస్టినా మూఢనమ్మకాలు జీవితంలోని సహజత్వాన్ని తన కి దూరం చేస్తున్నాయా అనిపిస్తోంది నాకు.  బొమ్మ మసకేసిన ఒక అరిగి పోయిన నాణెం, ఒక నల్ల సిరా చుక్క, అదాటున రెండు గాజు తలుపుల మధ్య నుంచి కనపడ్డ చంద్రుడు  వీటిలో ఏదో ఒకటి చాలు  ఆమెను హడల గొట్టడానికి. లక్కీ డ్రెస్ కదాని ఆ ఆకుపచ్చ్ డ్రెస్ ని చీలికలు వాలికలయ్యే దాకా వేసుకుంటూనే ఉంది. ఆ డ్రెస్ కంటే చక్కగా అతికినట్టు సరిపోయే నీలం రంగు డ్రెస్ వేసుకుంటే, ఆ రోజు నుంచి ఇక మేము కలుసుకోమని తన నమ్మకం! ఇలాటివన్నీ మరీ  పిచ్చి నమ్మకాలని క్రిస్టినాకి నచ్చ జెప్పడానికి నేను చాలానే…
పూర్తిగా »