‘ సుజాత ’ రచనలు

ఆ తెల్లని ఇల్లు

ఆ తెల్లని ఇల్లు

క్రిస్టినా మూఢనమ్మకాలు జీవితంలోని సహజత్వాన్ని తన కి దూరం చేస్తున్నాయా అనిపిస్తోంది నాకు.  బొమ్మ మసకేసిన ఒక అరిగి పోయిన నాణెం, ఒక నల్ల సిరా చుక్క, అదాటున రెండు గాజు తలుపుల మధ్య నుంచి కనపడ్డ చంద్రుడు  వీటిలో ఏదో ఒకటి చాలు  ఆమెను హడల గొట్టడానికి. లక్కీ డ్రెస్ కదాని ఆ ఆకుపచ్చ్ డ్రెస్ ని చీలికలు వాలికలయ్యే దాకా వేసుకుంటూనే ఉంది. ఆ డ్రెస్ కంటే చక్కగా అతికినట్టు సరిపోయే నీలం రంగు డ్రెస్ వేసుకుంటే, ఆ రోజు నుంచి ఇక మేము కలుసుకోమని తన నమ్మకం! ఇలాటివన్నీ మరీ  పిచ్చి నమ్మకాలని క్రిస్టినాకి నచ్చ జెప్పడానికి నేను చాలానే…
పూర్తిగా »

హెమింగ్వే మ్యూజియం

ఏప్రిల్ 2017


హెమింగ్వే మ్యూజియం

రచయితలు మనుషులుగా నిష్క్రమించినా, రచనలుగా ఎప్పటికీ మిగిలే ఉంటారు. కొన్ని పుస్తకాలు చదువుతుంటే, అయ్యో వీళ్ళు బతికుండగా కలుసుకోలేక పోయినా కనీసం సమకాలికులుగా అయినా లేమే? అనిపిస్తుంది. అలాటి వాళ్లలో జాక్ లండన్, హెమింగ్వే తప్పకుండా ఉంటారు నా లిస్టులో. స్వేచ్ఛా ప్రవృత్తితో ఇష్టమైన జీవితాన్ని బతికినన్నాళ్ళూ గడిపిన వాళ్ళే ఇద్దరూ! జాక్ లండన్ కి రిగ్రెట్స్ ఏమీ లేవేమో గానీ హెమింగ్వే జీవితాన్ని, తనకు తానే రాసుకున్న మరణ శాసనాన్ని చూస్తే ఉన్నాయేమో అనిపిస్తుంది. సొసైటీ లో ఉన్న పేరు ప్రఖ్యాతుల్ని, తమ నిష్క్రమణ వెనుక సాగబోయే ఊహాగానాల్ని లెక్క చేయక మరణాన్ని కౌగిలించుకునే సెలెబ్రిటీల మనసుల్లో దాగున్న అగాథాలేమిటో, ఎంత లోతైనవో,…
పూర్తిగా »

సాహిత్య సౌరభానికి కాలం చెల్లుతోందా?

ఆగస్ట్ 2014


సాహిత్య సౌరభానికి కాలం చెల్లుతోందా?

అసలెవరైనా పుస్తకాలెందుకు చదువుతారు?

ముఖ్యంగా ఫిక్షన్ ఎందుకు చదువుతారు” అనే ప్రశ్న ఎప్పుడూ వేసుకోవాలని తోచదు. కానీ రచయిత సొదుం రామ్మోహన్ దీనికి ఇలా చెప్తారు ఒక వ్యాసంలో!

“నా జీవితం సంగతి నాకెరుకే. ఇతరుల జీవితాలు ఎలా ఉన్నాయో? జీవితం, సమాజం పట్ల నాకు కొంత అవగాహన, కొన్ని అభిప్రాయాలు ఉన్నై. ఇతరులకెలా వున్నాయో? … ఇలాంటి సవాలక్ష ప్రశ్నలకు సమాధానాలు రాబట్టుకోడానికి చదువుతారు కొందరు.

ఒక పుస్తకం చదవటం మూలంగా, తమ విజ్ఞానం విస్తరిస్తే ఆ సాహిత్యానికి ప్రయోజనమున్నదని, అది చదవడం మూలంగా తామూ ప్రయోజనం సాధించామని అనుకుంటారు కొందరు. తనకు అంతకుపూర్వం తెలియని సామాజిక వాస్తవాలను కథలోనో, కవిత్వం లోనో గ్రహిస్తే…
పూర్తిగా »

మధ్య తరగతి జీవితం కథల్లోంచి నెమ్మదిగా అంతర్థానం అవుతుందా?

ఫిబ్రవరి-2014


మధ్య తరగతి జీవితం కథల్లోంచి నెమ్మదిగా అంతర్థానం అవుతుందా?

కధలతో బంధం ఊహ తెలిసీ తెలియని వయసులోనే మొదలవుతుంది మనందరికీ. అమ్మ చెప్పే మాటలను ఊ ఊ అంటూ కధలుగా వింటాం. ఊహ తెలిసే కొద్దీ వయసు పెరిగే కొద్దీ కథలు జీవితం నుంచే పుడతాయని అర్థం చేసుకుంటాం. అవును, సాహిత్యం జీవితాన్ని ప్రతిబిమంచిపనుడే కల కాలం పాఠకుల హృదయాల్లో నిలిచి ఉంటుంది. తొలి తెలుగు కథ “దిద్దు బాటు” నుంచీ ఈ నాటి అస్తిత్వ వాద కథా సాహిత్యం వరకూ కథలన్నీ జీవితాన్ని ప్రతి బింబించేవే! కొన్ని జీవితాల్ని దిద్దేవి కూడానూ!

కథా సాహిత్యానికి ఒక ప్రత్యేకత ఉంది. అది క్లుప్తత! ఎంతో పెద్ద విషయాన్ని చెప్పాల్సి వచ్చినా దాన్ని కొద్ది మాటల్లో క్లుప్తంగా…
పూర్తిగా »

ఊబిలో దున్న!!

జనవరి 2014


ఊబిలో దున్న!!

ఒక దున్న పోతు!

గాలికి వదిలేస్తే పాపం… గడ్డి మేయడానికొచ్చి వాగులోని ఊబిలో తెలీక కాలు వేసి సగానికి పైగా దిగబడి పోయింది. ఎప్పుడు దిగబడిందో ఏమిటో, ఎవరూ పట్టించుకోరు దాన్ని!

గొబ్బి మండలు నరుక్కుపోడానికి ఆ దారిన వచ్చిన ఒక రైతు ఆ దృశ్యం చూస్తాడు. దాన్ని బయటికి తీయడానికి నిశ్చయించుకుంటాడు. ఎవరినైనా సాయానికి పిలుద్దామంటే ఆ సమయానికి ఎవరూ అక్కడ కనిపించరు. బయటికి తీయగలడో లేదో తెలీదు. కానీ ప్రయత్నం మాత్రం తప్పని సరి అని భావిస్తాడు. ఊబిలో దిగబడి, బయటికి వచ్చే ప్రయత్నం ఏదీ చేయకుండా (చేసిందో లేదో తెలీదు) తన బరువు, బాధ్యత మొత్తం అతని మీద వేసి నిశ్చలంగా,…
పూర్తిగా »

యాభయ్యేళ్ళ సూపర్ హిట్ నవల “చక్రభ్రమణం”

నవంబర్ 2013


యాభయ్యేళ్ళ సూపర్ హిట్ నవల “చక్రభ్రమణం”

కోతి కొమ్మచ్చి మొదటి భాగం లో ముళ్లపూడి ఇలా అన్నారోచోట.
“ప్రజలకి కథలు చదివే రుచి చూపించి,అలవాటు చేసి,దాన్ని ఒక వ్యసనంగా పెంచి- పుస్తకాలు కొనుక్కుని, తిట్లు తిని, దిండు కింద దాచుకుని చదివి ఆనందపడేలా చేసిన కర్మ వీరులు, కార్యశూరులు నలుగురైదుగురు ఉన్నారు.

కొ కొ కొ రా కో-
కొవ్వలి లక్ష్మీ నరసింహారావు
కొడవటిగంటి కుటుంబరావు
కొమ్మూరి సాంబశివరావు
కోడూరి కౌసల్యాదేవి
రాధాకృష్ణ-

కోడూరి (ఆరికెపూడి) కౌసల్యాదేవి రాసిన చక్రభ్రమణం నవల సూపర్ సెన్సేషన్ … ఆడా మగా కూడా ఎగబడి ఆంధ్రప్రభ వారపత్రిక కొనుక్కుని, అద్దెకు తెచ్చుకుని, ఎరువు తెచ్చుకుని చదివి మురిసిపోయారు.


పూర్తిగా »

ఒక సిద్దార్థుడి జ్ఞానాన్వేషణ – హెర్మన్ హెస్ నవల “సిద్దార్థ”

అక్టోబర్ 2013


ఒక సిద్దార్థుడి జ్ఞానాన్వేషణ – హెర్మన్ హెస్ నవల “సిద్దార్థ”

ఏమిటి జీవితం? ఎక్కడ ఆనందం? ఏది పరమార్థం? ఏది ఆవశ్యకం? ఏది అనుసరణీయం? ప్రశాంతత ఎక్కడ? బంధాల్లోనా? వాటిని తెంచుకోడం లోనా? జ్ఞానమంటే? ఏదీ అనుభవం లోకి రాకుండా “ఇదే జ్ఞానం” ఎని ఎలా గ్రహించడం?

సిద్దార్థుడికి అన్నీ సందేహాలే! వాటికి సమాధానాలు కనుక్కోడానికి ఇల్లు వీడాడు. శ్రమణుల్లో కలిశాడు. సాక్షాత్తూ బుద్ధుడినే కలిశాడు. ఆ తర్వాత ఏమి చేస్తాడు? తీరాయా సందేహాలు? దొరికిందా శాంతి? లభించిందా జ్ఞానం?

భారతీయ వేదాంత సారం, తత్వం, విజ్ఞానం , ఆధ్యాత్మికత లను పూర్తిగా ఒంటబట్టించుకోడానికి కాదు కదా, అందులో కనీసం కొంత భాగం అయినా అర్థం చేసుకోడానికి ప్రయత్నిస్తే జీవిత కాలం సరిపోదేమో! అలాటిది ఒక స్విస్…
పూర్తిగా »

అమ్మ-నాన్న-అమెరికా

ఆగస్ట్ 2013


అమ్మ-నాన్న-అమెరికా

“సాయంత్రం ఫోన్ చేద్దామనుకున్నాను కానీ, కుదర్లేదు. ఎందుకంటే ఏం చెప్పను. మనింట్లో లాగా ఉండాలంటే కుదురుతుందా చెప్పండి. అతనేదో ఫోన్లో మాట్లాడుతున్నాడు. ఆలస్యం అయిపోయింది. ఈ లోపు పసి పిల్లాడు, వంట.. ఎన్నని చెప్పను? నాకు మాత్రం మీతో మాట్లాడాలని ఉండదా” గద్గదమైన గొంతుతో చెట్టు దగ్గర నిలబడి ఫోన్లో మాట్లాడుతున్నావిడ వంక ఒద్దనుకుంటూనే చూశాను. మొబైల్ ఫోన్ల వల్ల వ్యక్తిగతాలన్నీ వీధిలోనే ఇప్పుడు !!

ఆవిడ గమనించినట్లు అనిపించడంతో దూరంగా నడిచాను. కాసేపయ్యాక ఆవిడే అటుగా వచ్చి నన్ను పలకరించింది. “తెలుగు వాళ్ళేనాండీ”

“అవును” అన్నాను ఇబ్బంది గా “మీ ఫోన్ నేను వినలేదు లెండి” అనలేక .

ఆ ఫోన్ ఆవిడ మాట్లాడిన…
పూర్తిగా »

శరత్ దేవదాసు చక్ర పాణి ద్వారా…

ఆగస్ట్ 2013


శరత్ దేవదాసు చక్ర పాణి ద్వారా…

“ఇంకా ఎంత దూరం నాయనా?” ఈ డైలాగ్ వినగానే గుండె లోతుల్లోంచి దుఃఖం ఫెటిల్లున పగిలిన శబ్దం కంటి చివరి నుంచి వరదై చెంప మీదకు జారక పోతే అది దేవదాసు సినిమానే కాదు, వాడు నాగ్గాడే కాదు. తన మరణం తనకు సమీపంలో దర్శనమిస్తున్న ఆ చివరి క్షణాల్లో దేవదా పార్వతిని ఒక్క సారి, ఒకే ఒక్క సారి చూడాలని తపించే క్షణాలు దేవదాసు తో మమేకమై పార్వతి కోసం ఏడవని ప్రేక్షకుడెవరు తెలుగు నాట?

ఒక మహా దృశ్య కావ్యం అంటే ఇదేనా? ఎప్పటికీ చెరిగి పోని ముద్రను గాఢంగా మనో ఫలకంపై చిత్రించేదేనా?

దేవదాసు సినిమా విడుదలై అరవయ్యేళ్ళు అయిన సందర్భంగా…
పూర్తిగా »

పి. సత్యవతి గారి పెళ్లి ప్రయాణం కథ

జూలై 2013


పి. సత్యవతి గారి పెళ్లి ప్రయాణం కథ

పి. సత్యవతి గారి కథలైనా, వ్యాసాలైనా, ఒకసారి చదివి, కన్వీనియెంట్ గానో, యధాలాపంగానో మర్చిపోయేవి కాదు. నెమ్మదిగా రాజుకునే ఆలోచనలు మహా ప్రవాహమై వెంటాడేలా చేసే రచనలు ఒక్కొక్కటీ! మనల్ని మనకే పరిచయం చేస్తాయి అవి . మనల్ని గురించి మనమే కాసేపు కూచుని ఆలోచించు కోవాలనే తపన రేకెత్తిస్తాయి . ఆత్మలు వాలిన చెట్టు, మెలకువ, అమ్మకేం తీసుకెళ్లాలి, నాన్న ఇలా ప్రతి కథా “ఈ పాయింట్ ని ఆలొచించడం నేనెలా మర్చిపోయాను?” అన్న ప్రశ్న చదివిన ప్రతి సారీ భుజం చరుచుకునేలా, నాలుక్కరుచుకునేలా చేస్తాయి . . పెద్ద పెద్ద అజెండా ప్రకటన లేకుండా, నీతి పాఠాలు లేకుండా, డైడాక్టిక్ గా ఉండక,…
పూర్తిగా »