‘ హరి బొద్దున ’ రచనలు

డెజిగ్నేటెడ్ పార్ట్⁠నర్

డెజిగ్నేటెడ్ పార్ట్⁠నర్

ఇనార్బిట్ మాల్ పార్కింగ్ లాట్లో బైక్ యెక్కడ పార్క్ చేసానో జ్ఞాపకం లేదు. సినిమా హడావిడిలో లెవల్ 1 లో పార్క్ చేసానో, లెవల్ 2 లో పార్క్ చేసానో, వ్యాలే పార్కింగ్ ఇచ్చానో అసలు పార్క్ చేసానో లేదోనని నా సబ్కాన్షస్ డేటాబేస్ ని క్వేరీ చేస్తుండగా ఫోన్ రింగ్ అయ్యింది.

“హలో!…” అన్నాను.

“క్రిష్ణా, ఆదివారం ఇంటికి రారా. ఓ పెళ్లిసంబంధం వచ్చింది. పిల్ల మేనమామ నిన్ను చూస్తడట.”

ఫోన్లో అమ్మ చెప్పటం పూర్తి కాలేదు. “సండేనా? కుదర్దమ్మా.  క్రికెట్ మ్యాచుంది. అయినా మేనమామతో పెళ్లి చూపులేమిటమ్మా?

నేనా టైప్ కాదు.” అన్నాను.

“ఊకో పోడా.  పని మీద మన ఊరు…
పూర్తిగా »