‘ అరుణ్‌సాగర్ ’ రచనలు

యేతోబతావ్!

నవంబర్ 2015


వెలుగుముద్దులన్నీ ఫ్లయింగ్‌సాసర్లలో
ఆండ్రోమెడాలోకి ఎగిరిపోయినపుడు
రెప్పలకంటుకున్న నక్షత్రధూళిని
అరచేతుల్లోకి రాల్చుకున్నపుడు-కళ్లలోకురిసిన మెరుపుశకలాలను
అద్దాలకు అద్దిన ప్రతిఫలనము
-చెమ్‌కీ బింబాల పీఠభూమిపై
కోర్కెల అక్షౌహిణుల ఘట్టనము

అట్టి సన్నివేశమునందు:
స్వప్నభస్మాన్ని మిరుమిట్ల జిలుగుతెర మీద
వెల్లకిల ఆరబెట్టుకొనుచుండగా
ఉల్కాపాతము వంటి స్మృతిరేఖలను
జలకవళికలతో వలపట్టేందుకు;
ప్రేయసీ, సాగర్ జైసీ అంఖోవాలీ!
-ఈ పున్నమి సముద్రమే…
తన కెరటాలను ఆకాశంలోకి విసిరిందా?


పూర్తిగా »