‘ ఎం.నారాయణ శర్మ ’ రచనలు

వలస

1
అనేకానేక గుప్త నిశ్శబ్దాలతరువాత
మాటలు అస్తి పంజరాలయ్యాక
ఓ మేఘంకింద తడవడానికి
మట్టై నా గుండె పరిగెడుతున్నప్పుడు
నేనూ వెనకాల దొర్లుకుంటూ వెళతాను

2
కొమ్మలు చెట్టుమొదలుతాకి నమస్కరించినట్టు
పూలు చెట్టుపాదాలపైవాలి పూజించినట్టు
ఎదురు చూపుల వత్తులేసుకుని
రాత్రులై తపిస్తున్న
కళ్ల పాదాల ముందు నాచూపుల్నిజల్లుతాను

3
దూరాన్ని ఏ ప్రమాణంతో కొలుస్తాం
చూపుకి దగ్గరలేనందుకో
మనసుకి దూరంలేనందుకో
వలస సెగ్గడ్డలా సలుపుతుంది
ఏదో ఒక శూన్యం అస్పష్టచిత్రాలని
ఆప్టిక్ నాడిలా మోసుకొస్తూనే ఉంటుంది

4
నేను సన్నివేశంలో లేకుండానేపూర్తిగా »