‘ ఏనుగు నరసింహా రెడ్డి ’ రచనలు

వాడు నవ్వుతాడూ…

పెదవులను సాగదీసి
ఇంటినిండా వెలుగుల్ని పుక్కిలిస్తాడు
అమ్మ భుజం మీద తలవాల్చి
తక్కిన ప్రపంచంతో సవాలు చేస్తాడు
నవ్వుతాడు
నవ్వుతున్నానని
ఎలా చెప్పాలో తెలియక నవ్వుతాడు
పడుతూ
లేస్తూ
పడినందుకూ
లేచినందుకూ నవ్వుతాడు
రెప్పల తలుపుల్ని
మూస్తూ తెరుస్తూ ముచ్చటగా నవ్వుతాడు

వాడు మేలుకుంటే వెలుగు
వాడు నిద్రిస్తే వెన్నెల
వాడి నవ్వు వెలుగులే లేకపోతే
ఇంటిలోకమంతా చీకటి.


పూర్తిగా »

తెలంగాణ బతుకమ్మకు ఓ పట్టుకుచ్చుల పువ్వు

తెలంగాణ బతుకమ్మకు ఓ పట్టుకుచ్చుల పువ్వు

(దాసరాజు రామారావు “పట్టుకుచ్చుల పువ్వు” కవితా సంపుటి పై ఏనుగు నరసింహారెడ్డి సమీక్ష)

ప్రజల ఆకాంక్షల్ని వ్యక్తీకరించడానికి పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఎంత ప్రయోజన రహితమయిందో తెలంగాణ ఉద్యమ సందర్భం
నిరూపిస్తుంది. ప్రత్యేక రాష్ట్రకాంక్ష ఎంత బలీయంగా ఉందో 2009 తర్వాత జరిగిన ప్రతి ఉప ఎన్నికా నిరూపించింది. కానీ 2004
లో కానీ 2009 లో కానీ ఈ ఆకాంక్ష అంత స్పష్టంగా నిరూపించబడలేదు. ఒకవేళ 2009 డిసెంబర్ 9 తర్వాతి ప్రకటన అనంతరమే
సామాన్య ప్రజలలోకి, అన్నివర్గాల తెలంగాణ ప్రజలలోకి ఈ ఆకాంక్ష బలీయంగా వెళ్ళిందని భావించినా 2014 ఎన్నికలు ఏకపక్షంగా తెలంగాణ వాదం వైపు మొగ్గకపోతే పరిస్థితి ఏమిటి?…
పూర్తిగా »

107 బస్టాప్

‘సిటీ బస్సెక్కితే నరకం
చిన్న సీటు దొరికితే స్వర్గం’అని
కవిత్వాలాడుకుంది ఇక్కడే

‘రెండైతే మాట్నీ
ఆరైతే ఫష్షో’
రోజుల్ని సినిమాలుగా
కత్తిరించుకుంది ఇక్కడే

‘ఇక్కడ స్టాపు
ఐనా బస్సు ఎక్కడో ఆపూ
తిక్కరాగాలందుకుంది ఇక్కడే

దిగేవాళ్ళు దిగక ముందే
సీట్ల సిం హాసనాలకు
ఎక్కేవాళ్ళు సూదంటురాళ్ళయ్యేదీ ఇక్కడే

లంచు బాక్సును మోసే హాండు బాగులు
చంకలో లోలకాలైనప్పుడు
అనేకానేక దినచర్యల్లోని
ఆరంభ బిందువూ ఇక్కడే

తొలి వేకువ ప్రయాణంలో చల్లదనమూ
అయాసాల సాయంత్రాల ఆఖరి గమ్యమూ
ఇక్కడే గిరిగీసుకున్నట్లుండేది

బస్టాపుల సిగమీద
ఫుట్టోవర్ కిరీటం…
పూర్తిగా »