‘ కపిల రాంకుమార్ ’ రచనలు

అక్షర క్షిపణి

ఏప్రిల్ 2014


అక్షర క్షిపణి

ఓ అక్షరానికి మరో అక్షరం పేర్చటం కాదు
అది క్షిపణిలా పేలినపుడే కవిత్వం!
పళ్ళగొర్రుతో దమ్ము చేసిన చేలో వరినాట్లున్నట్టు
చదరంగపు గళ్ళున్నట్టుండాలి!
గాలికి వూగే జొన్నకంకులమీద వాలిన పిట్టలాగుండాలి
మబ్బులను అహ్వానిస్తూ ఆకాశంలో విన్యాసం చేసే తూనీగల్లాగుండాలి!

ధైర్యపు భుజంమీది సంధించిన ఆయుధంలా!
శత్రు స్వప్న సింహంలా !
జతగూడే అక్షరమే జతగాడౌతుంది!
పదాలతో పదాతిదళానికి మొనగాడైన అధిపతౌతుంది!


పూర్తిగా »