‘ కాంటేకర్ శ్రీకాంత్ ’ రచనలు

అంతర్గీతం

విచిత్రానువిచిత్రంగా
ఒక అపనమ్మక స్థితి నుంచి తేరుకొని
నడుస్తున్న ప్రపంచం నడవడి అర్థమై
వాస్తవం తనలోకి పాక్కుంటూ వస్తుంది
మనిషి.. మనుగడ మరో ప్రపంచంలో
ఉన్నప్పటి జ్ఞాపకాలు అన్ని ముసురుకొని
స్వప్నావస్థ నుంచి బయటపడ్డాక
పిడుగు మీదపడ్డ అవశేషంలాగా
కళ్లముందు ఉంటుంది కదలాడుతూ వాస్తవం

కొమ్మలపై, రెమ్మలపై
పువ్వులపై ఆకులపై
విహరించి.. పిచ్చుకల గూడులో
వెచ్చగా ఒదిగి.. కోయిలల జతలో
కమ్మగా గానంచేసి..
తోడుగా ఎగిరిన రంగురంగుల
సీతాకోక చిలుకలు వెళ్లిపోయాక
కలిసి ప్రవహించిన నదీనదాలు వేరయ్యాక
వనంలో విరబూసిన గడ్డిపువ్వును ముద్దాడిపూర్తిగా »