‘ కిరణ్మయి ఇంద్రగంటి ’ రచనలు

తెల్లటి వొక కల

15-ఫిబ్రవరి-2013


తెల్లటి గువ్వ మళ్ళీ వచ్చింది
కిటికీనే పీటగా చేసుక్కూచుంది

నా వంటిల్లు దాని సినిమా తెర
ఒక్కోసారి ఇద్దరం ఎదురుబదురు
నిలబడి వుండిపోతాం– ప్రేక్షకురాలు, నటి
కవ్విస్తూ వినోదిస్తూ.

నా పరుగుల వురుకుల గిన్నెల శబ్దాలు,
వూహాగీతాల కూని రాగాలు,
కల్లోల హృదయాంతరంగాల వల్లెవాటు తడిచారలు
చెంపచేతి పరభాషా కబుర్లూ –

ఇవ్వన్నీ వింతగా, కదలక మెదలక చూస్తుంది.
భయం లేదు, బెరుకు లేదు.
కొంచెం దూరంగా, కొంచెం ఇటూగా జరిగి
గూఢచారిలా నామీదో కన్నేసి వుంచుతుంది.

నాలుగ్గింజలు విసిరితే మొహం తిప్పేసుకుంటుంది.
మెత్తటి రెక్కల్ని ముట్టుకుందామంటే అందదు!

తళతళలాడే…
పూర్తిగా »