‘ చంద్ర కన్నెగంటి ’ రచనలు

అందరూ ఒకేరకంగా ఎందుకు రాయడం? – కన్నెగంటి చంద్ర

ఏప్రిల్ 2017


అందరూ ఒకేరకంగా ఎందుకు రాయడం? – కన్నెగంటి చంద్ర


తన రచనల్ని ప్రచారం చేసుకోటం అలా వుంచి అవి ఎక్కడ అచ్చయ్యాయన్నది కూడా చెప్పడు – గుచ్చి గుచ్చి అడిగితే తప్ప. అచ్చయిన తన పుస్తకాలు ‘మూడో ముద్రణ’, ‘వాన వెలిసిన సాయంత్రం’ ఎక్కడున్నాయో తనకే తెలీని అయోమయం. World Wide Web లో పడి దేనికోసమో ఎందుకో వెతుకులాడుతున్నప్పుడు గూగుల్ క్రాలర్‌కి కూడా దొరకని ఓ మారుమూల పేజీలో తామర తూడులా పాకుతూ తన కవితో, కథో, తుమ్మముల్లులా గుచ్చుతూ వెంటపడి మన స్వానుభవంలోకి చొచ్చుకొస్తుంది.తెలుగు కథలా అనిపించని ఓ కొత్త కథా నిర్మాణం, ఊహించశక్యం కాని ఇమేజరీ కవిత్వం ఇతను మనవాడేనా అన్న సందేహంలో ముంచినా, తనతో సంభాషించిన మరుక్షణం…
పూర్తిగా »

భిన్నత్వాన్ని ఆదరించడం కాదు, ఆహ్వానించగలగాలి..

ఫిబ్రవరి 2015


అంతర్జాలం మూలాన మిగతా ప్రపంచం మనకు సన్నిహితంగా వస్తున్నది. మనకు చేరే సమాచారమూ, అందుబాటులోకి వచ్చే అభిప్రాయాలూ, కలిగే పరిచయాలూ, ఎదురయ్యే అనుభవాలూ విస్తృతమవుతున్నాయి. మనం ముందు ఏర్పరచుకున్న నమ్మకాలు అర్థరహితం అని తేల్చి చెప్పే, మన జీవితాలకు ఆలంబన అయిన విలువల్ని ప్రశ్నించే వాదనలనూ, వాస్తవాలనూ మనం తప్పించుకోలేం. ఈ వ్యతిరేకాభిప్రాయాలనూ, సమాచారాన్నీ సమన్వయపర్చుకుందుకు కావలసింది తార్కిక జ్ఞానం. కానీ ఈథాస్, పేథాస్ లు లోగాస్ ను వెనక్కి నెట్టేస్తాయి. ఆవేశాలూ, భావోద్వేగాలూ ముందు ఉప్పొంగుకొస్తాయి. వాటిని సమర్ధించుకోడానికి తర్కం పక్కదోవలు పడుతుంది. నిందారోపణలూ, దూషణలూ, ద్వేషాలూ మిగిలిపోతాయి.

ప్రతి ఒక్కరికీ దేవుడి పాత్ర వహించాలని ఉంటుందేమో, ప్రపంచమంతా తన అభిప్రాయాలకు అనుగుణంగా నడుచుకోవాలనీ,…
పూర్తిగా »

అన్నీ ఊహాజనితమే!

ఫిబ్రవరి 2013


అన్నీ ఊహాజనితమే!

వరంగల్‌లో ఇంజనీరింగ్ చదివేరోజుల్లో రాయడం మొదలు పెట్టాను. ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి, జ్యోతి పత్రికల్లో నాలుగయిదు కథలు వచ్చాయి. కాలేజ్ చదువు ముగిశాక భిలాయిలో ఉద్యోగం రావడంతో ప్రవాసాంధ్ర జీవితం మొదలయింది. కాలేజ్ రీడింగ్‌రూంలో చదవడానికి అన్ని వార, మాస పత్రికలూ ఉండేవి కానీ అక్కడ ఏవీ దొరికేవి కాదు. ఒకటీ అరా తప్పించి రాయలేదు ఆరోజుల్లో. అక్కడినుంచి ఎమ్మెస్ చేయడానికి అమెరికా వచ్చినప్పుడూ అందులో ఏ మార్పూ కలగలేదు. అయితే తొంబైలలో SCIT న్యూస్ గ్రూప్ ఏర్పడటంతో ఇంటర్నెట్‌లో తెలుగువారికందరికీ అన్నీ పంచుకునేందుకు ఒక వేదిక దొరికింది. అందులోనే నా రచనావ్యాసంగం మళ్ళీ మొదలయింది.

రాయడానికీ, చదివేవాళ్ళకు చదవడానికీ ఎక్కువ సమయం పట్టదు కనక కవితలు…
పూర్తిగా »