‘ ఝాన్సీ పాపుదేశి ’ రచనలు

కొత్త సమచ్చరం ఇద్దో ఇట్ట జరిగింది

కొత్త సమచ్చరం ఇద్దో ఇట్ట జరిగింది

గుడ్లింతింత సేస్కోని ….గుండెలు గుబగుబ లాడ్తా వుంటే నాలుగుదిక్కలా సూస్తా….ఓయమ్మో..ఏం సేస్తా వుండారు వీల్లు..అనుకుంటా అందుర్లో బీసురోమని కూచ్చోనుండా.

కొత్త సమచ్చరం … ఆడతా..పాడతా పండగ మాదిరి జరిపితే బాగుంటిందని వేల రూపాయిలు కట్టి టిక్కెట్టు కొనుక్కోని బెంగ్లూర్లో …ఇద్దో ఈడికొచ్చినామా!

లైన్లో నిలబడుకోని వస్తావుంటే … వీల్లు ఆడోల్లేనా అనిపిస్తా వుంది…ఒక్కోర్ని జూస్తావుంటే! యాడో ఆడొక బిడ్డె…ఆడొక బిడ్డె తప్పితే…ఒక్కరన్నా సమంగా గుడ్లేసుకున్నారా!

అవ్వ! ఆడది నాకే గొంతెండక పోతాంది. మొగోల్ల కత ఇంక యేరే జెప్పాల్నా..

సిన్నప్పుడు ఉడుగ్గా ఉందని ఇంట్లో పొడుగు షిమ్మీ యేస్కోంటేనే…మాయమ్మ పొరకెత్తుకుంటావుండె. సంకల కాడ్నించి తొడలకాడికి నల్లగుడ్డలు సుట్టుకోని ఈమాదిరి ఇంతమందిలోకి వొచ్చేస్తే..వాళ్ళమ్మా నాయిన్లు ఏమన్రా?? మొగపిలకాయల్తో…
పూర్తిగా »