‘ మానాపురం రాజా చంద్రశేఖర్ ’ రచనలు

రేపటి ఎదురు చూపులోంచి..!

పాటతో అడవికి
పోరాట రహస్యం నేర్పాలనుకున్నాను!
చెట్ల కొమ్మల్లోని ఆకుల కళ్ళల్లోంచి
ఎర్రటి చింతనిప్పులు చిగురించడం మొదలుపెట్టాయి!
సమూహంలోని గొంతులకు
శృతి కలిపాయని భ్రమపడ్డాను!
నిశితంగా పరిశీలించి చూసినపుడు
మనిషిలోని దగ్గరితనం
వినికిడితనాన్ని కోల్పోయిందని అర్థమయింది!
మనసులతో మమేకంకాలేని
కొన్ని ఆశయాల చేతకానితనాలకి
ఈ వనాల అలజడి
ఒక ప్రతిబింబ సూచికయ్యింది!
కాలం గొంతు నొక్కిపట్టి అదిమితే
చిన్నప్పటి జ్ఞాపకాలతో పాటు
కొన్ని బతుకు నిజాలైనా బయటపడతాయని చూశాను..
గుంపులోంచి తొంగి చూసే జడివానలు
ఒంటరితనంలోని డొల్లతనాన్ని ప్రశ్నించడం
సృష్టి…
పూర్తిగా »