‘ రేఖా జ్యోతి ’ రచనలు

ఈసారి నువ్వొస్తే

ఫిబ్రవరి 2018


వచ్చేయకూడదా
చెప్పా పెట్టకుండా అయినా
అమావాస్య నాడైతే ఏం?
నా కన్నుల వెలుతురు చాలదూ నీకూ నాకూ

నువ్వొస్తే ఇప్పుడు వింటున్న ఈ పాట మళ్ళీ నీతో వినాలి
వింటున్నప్పుడు నిన్ను చూడాలి
ఎప్పటిలాగా ఉత్తినే నిను చూస్తూ
మరచిపోతానో మైమరచిపోతానో తెలీదుకానీ
ఆ ఊహ ఒకటి బావుంది

ఈ గోధుమరంగు అట్ట పుస్తకం ఇప్పుడే ఎదురుగా పెట్టేసుకోవాలి
నువ్వొచ్చే వేళకి మరచిపోతానేమో, పోయినసారిలాగా
కళ్ళెదురుగా ఉండికూడా కంటబడకపోతే ఆ నేరం నాదికాదురా
గంటలని గుప్పెట్లోకి తీసుకొని క్షణాలుగా మార్చి విసిరేస్తావే
నీది ఆ నేరం, ముమ్మాటికీ నీదే

నిన్న…
పూర్తిగా »

నువ్విక్కడ లేనప్పుడు

మార్చి 2017


నువ్విక్కడ  లేనప్పుడు

ఓ ఆశలోకి జారడం ఎంత తేలికో ఓ లోతైన నిరాశలో మునగడమూ అంతే తేలిక
ఇక్కడ ఎవరూ లేరు, నేనూ నీ తలపూ… అంతే… అంతే… నా లోకమంతా ఇంతే!
ఒక ఊహ సంతోషమైతే మరో ఊహ దుఃఖం, నిజాలేవీ ఉండవురా
నేనూ, నీ తలపూ… అంతే.

ఒక తలపులో ఏదో విడిపోతుంది, ప్రాణం అల్లాడి పోతుంది,
మరొక తలపులో ఏదో ముడిపడుతుంది మనసు ఉప్పొంగుతుంది
అన్నీ తలపులే, నాకు నేను చెప్పుకొనే నీ కథలే.

ఈ సాయంత్రం నది ఒడ్డున కూర్చొని
పొడి ఇసుకని గుప్పిళ్ళ నుంచి జార విడుస్తుంటే ఎదో దిగులు

పూర్తిగా »

ఉత్కంఠభరితమైన కథ – రాజ్ఞి

ఫిబ్రవరి 2017


ఉత్కంఠభరితమైన కథ – రాజ్ఞి

ఒక మంచి పుస్తకం చదవగానే సన్నిహితులకు  చెప్పేస్తాం, మరీ నచ్చేస్తే కొన్ని వాక్యాలు రాసుకొని దాచుకుంటాం. అంతకు మించి ఒక పుస్తకాన్ని ప్రేమించినప్పుడు, పూర్తిగా ఆ భావాన్నంతా అనుభవించినప్పుడు, చదువరి రచయిత కూడా అయినప్పుడు, అందునా అది మరొకభాషలో ఉన్నప్పుడు, లోపలి సాహిత్యాభిలాష మనసును ‘అనువాదం’ వైపు ప్రేరేపిస్తుంది. ఆ పుస్తకం మీది ప్రేమనంతా సంపూర్ణంగా వ్యక్తపరిచే అందమైన ప్రక్రియే ‘అనువాదం’.  దీనికి ముందు తన పచ్చని తోరణాల వంటి రచనలతో  ‘వాకిలి’ పత్రికకు   శోభను తీసుకువచ్చిన డాక్టర్ మైథిలి అబ్బరాజు గారి ‘రాజ్ఞి‘ – SHE - ( who must be obeyed ) – అనువాద నవల – మే నెల…
పూర్తిగా »

వీడ్కోలు తర్వాతి నువ్వు

డిసెంబర్ 2014


వీడ్కోలు తర్వాతి నువ్వు

నీకొక వీడ్కోలు పద్యం ఒప్పచెప్పేసి
స్థిమితంగా కూర్చుంటాను

చూస్తూ చూస్తూన్న శూన్యంలో నుంచి నిన్ను పోలిన ఓ ఆశ తొంగి చూస్తుంది
మరుక్షణమే ఏదో ఒక వాక్యం నీ కోసం మళ్ళీ మొలకెత్తుతుంది
దూరాల ఎడారిలోనూ పదునైన ముళ్ళ మధ్యలో
కొన్ని సుకుమారమైన పూలు పూస్తాయి

అప్పుడు నీకూ నీ తలపుకీ మధ్య తేడాని కూడా తెలుసుకోలేను
సత్యానికీ స్వప్నానికీ మధ్య ఏ గీతలూ గీయలేను
నే చూస్తున్న అది నువ్వో నేనో ఖచ్చితంగా వేరుచేయలేనప్పుడు
ఉప స్పృహ మరోసారి హెచ్చరిస్తుంది
నీ నుంచి విడివడటమూ, నీతో ముడిపడటమూ రెండూ విఫలయత్నాలే అని


పూర్తిగా »