‘ శాంతి ప్రబోధ ’ రచనలు

ఇప్పటి జీవితం ఇప్పటి కథల్లో ఉందా?

జనవరి 2014


ఇప్పటి జీవితం ఇప్పటి కథల్లో ఉందా?

కథ అంటే చెవి కోసుకోని వారెవారుంటారు చెప్పండి. అమ్మో, అమ్మమ్మో, నాన్నమ్మో, తాతయ్యో మరింకెవరైనానో కథలు చెప్తుంటే, వింటూ ఊ కొడుతూ నిద్దురపోవడం చిన్నప్పటి నుండీ మనకు తెలిసిందే. అనుభవమే. మనమే కాదు కథ చెప్పుకోవడం అనాదిగా ఉన్నదే. నలుగురూ ఒక దగ్గర చేరి కాలక్షేపం కబుర్లు-కథలు చెప్పుకోవడం, నీతిని, సమాజ పోకడని అంతర్వాహినిగా నింపి కథలు చెప్పుకోవడం ఉన్నదే. మౌఖికంగా చెప్పుకునే కథలు ముద్రణా సదుపాయాలు వచ్చాక అచ్చులో రావడం ప్రారంభం అయింది.

దిన, వార, మాస పత్రికలు పెరిగిపోయాయి. కథలను ఆహ్వానించాయి. ప్రోత్సహించాయి. ఫలితంగా పుంఖాను పుంఖాలుగా కథలు వచ్చాయి. ఎందఱో రచయితలు , రచయిత్రులు పుట్టుకొచ్చారు. మంచినీళ్ళ ప్రాయంగా కథలు రాసేస్తున్నారు.…
పూర్తిగా »