‘ సురేష్ రావి ’ రచనలు

తడి గాలం

ఏప్రిల్ 2016


నిదురలోకి జారుకోవటం తెలియని
ప్రతి అస్తిత్వం లిఖించే
సంఘర్షణా ప్రతులలో
కొన్ని వాక్యాలుగా అలుముకోవడం
ప్రతి నాకూ ప్రతి నీకు కంఠో పాఠమే కదా

సంస్థాగత వ్యామోహాలని తప్పించుకోలేని
నాగరిక విన్యాసాలలో
ప్రతి జీవనం పొడిబారటం నిజమే కావచ్చు
అయితేనేం ఎక్కడో ప్రతి మనలో
తడిగాలమొకటి సిద్ధంగా ఉండే ఉంటుంది

కళ్ళల్లో మెరుపు లిఖించబడి ఉన్నన్నాళ్ళూ
శూన్యం దరి చేరని ఏకాంతాలు
జీవితం మీద పెంచే ఇచ్ఛని
అద్దుకున్న వాడికి శాపాలైనా వరాలైనా
బతుకులో పెద్ద తేడా ఉండదులే

స్వప్నాలు అమ్ముకోవడం వచ్చిన వాడికి

పూర్తిగా »

కాసిని మరకలు

డిసెంబర్ 2015


కాసిని మరకలు

హాయ్ రా!

నువ్వెలా ఉన్నావో నన్ను చేరుకున్న నీ అక్షరాలు విప్పి చెప్పాయి. నీ అక్షరాలకి ఈ నా లేఖ సమాధానంగా రాసింది కాదు గానీ నువ్వు, నేను, మనలాంటి వాళ్ళందరం ఎలా ఉన్నామో ఆలోచిస్తుంటే కాగితాన్నద్దుకున్న సిరామరకలు ఇవి.

ప్రతి రోజూ కొత్త ఉషస్సు తడిమినప్పుడల్లా ఒక్కొక్కసారి కొత్త ఉత్సాహంలా, మరి కొన్నిసార్లు అదో ఉత్పాతంలా అనిపించటంలోనే మనసు ద్వైదీభావం కనిపిస్తుంది కదా.. ఉత్సాహానికి ఊపిరి వచ్చిన రోజు కాలాన్ని ఎంత త్వరగా పరిగెత్తిస్తుందో, శూన్యాన్నివెంటపెట్టుకొచ్చిన రోజు క్షణం గడవక విలవిల్లాడిపోతుంది.

మనసులోని పదార్ధం అంతా ఖాళీఅయి ఒక్క ఆలోచనా ముందుకు కదలని నీరవ నిశ్శబ్దంలో ఎంత శూన్యం దాగి ఉంటుందో నీకు…
పూర్తిగా »